Tirumala: శ్రీవారి దర్శనానికి వెళ్తున్న భక్తులకు హెచ్చరిక.. ఇవి లేకపోతే అనుమతించేది లేదంటున్న అధికారులు

| Edited By: Ravi Kiran

Oct 05, 2021 | 7:33 AM

Tirumala: కలియుగదైవం కొలువైన క్షేత్రం తిరుమల తిరుపతి. భక్తుల పాలిట కొంగుబంగారంగా కోరిన కోర్కెలు తీర్చే స్వామిని దర్శించుకోవడానికి వెళ్తున్న..

Tirumala: శ్రీవారి దర్శనానికి వెళ్తున్న భక్తులకు హెచ్చరిక.. ఇవి లేకపోతే అనుమతించేది లేదంటున్న అధికారులు
జులై మాసంలో 7.13 లక్షల మంది భక్తులు స్వామివారి అన్నప్రసాదం స్వీకరించినట్లు టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది.
Follow us on

Tirumala: కలియుగదైవం కొలువైన క్షేత్రం తిరుమల తిరుపతి. భక్తుల పాలిట కొంగుబంగారంగా కోరిన కోర్కెలు తీర్చే స్వామిని దర్శించుకోవడానికి వెళ్తున్న భక్తులకు టిటిడి అధికారులు కొన్ని సూచనలు చేశారు. శ్రీవారి దర్శన టికెట్లు ఉన్న భ‌క్తుల‌ను మాత్ర‌మే తిరుమలకు అనుమతిని ఇస్తున్నామని చెప్పారు. కోవిడ్ వ్యాప్తి నివారణలో భాగంగా భక్తులు, ఉద్యోగుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని వ్యాక్సినేష‌న్ సర్టిఫికేట్ కానీ, దర్శనానికి 72 గంటల ముందు చేసుకున్న ఆర్‌టిపిసిఆర్ పరీక్ష నెగిటివ్ సర్టిఫికేట్ కానీ త‌ప్ప‌నిస‌రిగా తీసుకురావాల‌ని టిటిడి విజ్ఞ‌ప్తి చేసింది.

ప‌లువురు భ‌క్తులు ద‌ర్శ‌న టికెట్లు లేకుండా స్వామివారి ద‌ర్శ‌నం కోసం వ‌స్తుండ‌డంతో అలిపిరి చెక్ పాయింట్ వ‌ద్ద సిబ్బంది త‌నిఖీ చేసి వెన‌క్కు పంపుతున్నారు. కావున భ‌క్తులు ఈ విష‌యాల‌ను గ‌మ‌నించి టిటిడికి స‌హ‌క‌రించాల‌ని కోర‌డ‌మైన‌ది. టికెట్లు లేకుండా ఆనేకమంది భక్తులు శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి వ‌స్తుండ‌టంతో టీటీడీ ఈ విధంగా మరోసారి ప్రకటన చేసింది.

మరోవైపు తిరుమ‌ల శ్రీవారి వార్షిక బ్ర‌హ్మోత్స‌వాలకు కోవిడ్ నిబంధనలను అనుసరించి అధికారులు స‌ర్వం సిద్ధం చేశారు. ఈ నెల 7వ తేదీ నుంచి 15 వ‌ర‌కు శ్రీవారి బ్ర‌హ్మోత్స‌వాలు జరగనున్నాయి. బ్ర‌హ్మోత్స‌వాల నేప‌థ్యంలో రేపు శ్రీవారి ఆల‌యంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం నిర్వ‌హించ‌నున్నారు. ఈ నెల 6న సాయంత్రం 6 గంట‌ల‌కు ఉత్స‌వాల‌కు అంకురార్ప‌ణ చేయ‌నున్నారు. 15వ తేదీన రాత్రి ధ్వ‌జారోహ‌ణ‌తో బ్ర‌హ్మోత్స‌వాలు ముగియ‌నున్నాయి. కరోనా దృష్ట్యా బ్ర‌హ్మోత్స‌వాల‌ను ఏకాంతంగా టీటీడీ అధికారులు నిర్వహించనున్నారు.

Also Read:   నవరాత్రి ఉత్సవవాలు ఘనంగా జరిగే పురాతనమైన ప్రసిద్ధి చెందిన అమ్మవారి ఆలయాలు.. 

 బ్రహ్మోత్సవాల్లో 13 జిల్లాల్లోని వారికి బంపర్ ఆఫర్.. ఉచిత బస్సులతో పాటు శ్రీవారి దర్శనం..