
ఒడిశాలోని పూరి జగన్నాథ ఆలయంలో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. ఆలయంలోని నీలచక్రంపై మరోసారి గరుడ పక్షి వచ్చి వాలింది. ఊహించని ఈ ఘటనతో పండితులు, కొంతమంది నిపుణులు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేశారు. చాలామంది దీనినీ జగన్నాథుని లీలలో ఒక భాగమని నమ్ముతున్నారు. ఇది శుభప్రదంగా కొందరు చెబుతుంటే… మరికొందరు దీనిని ఒక సంకేతం, యాదృచ్చికంగా జరిగిన సంఘటన అంటున్నారు. అయితే, ఇంతకీ ఇది శుభానికి సంకేతమా.. లేదంటే ఏదైనా చెడు జరగబోతుందా..? అనే కోణంలో కూడా ఇప్పుడు ప్రజల్లో చర్చ మొదలైంది. ఆ వివరాల్లోకి వెళితే…
ఈ సారి గరుడ పక్షి పూరీ జగన్నాథుడి ఆలయ గోపురం మీద కూర్చుని ఉంది. పూరీ ఆలయ గోపురంమీద ఉండే జెండా మీద గరుడ పక్షి కూర్చుని ఉన్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజనులు కొందరు ఇది దైవ సందేశమని కామెంట్స్ చేస్తుండగా, మరి కొందరు మాత్రం ఏదో ప్రమాదం జరగబోతుందనే దానికి ఇది హెచ్చరిక అంటూ కామెంట్స్ చేస్తున్నారు. చాలా మంది దీన్ని పహల్గాం ఉగ్రదాడితో కనెక్ట్ చేసి కామెంట్స్ చేస్తున్నారు.
Eagle on top of Jaganath Temple.
Second time this inauspicious event.Last time a eagle was seen flying too close to top. Then Pehalgam and Op Sindoor happened.
Now this. 🙏🏻🙏🏻🧿 pic.twitter.com/lQSRgAiMVm— Aryaman (@AryamanBharat) September 2, 2025
నివేదికల ప్రకారం, ఆ పక్షి జగన్నాథ ఆలయం పైన కొద్దిసేపు ఎగిరి ఆపై పతితపవన్ బనపై విశ్రాంతి తీసుకుని, ఎగిరిపోయింది. ఈ సమయంలో ఉత్సాహభరితమైన భక్తులు ఈ అసాధారణ దృగ్విషయాన్ని ఫోటోలు తీయడం మానేయలేదు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..