ఆంధ్రప్రదేశ్ లో దసరా సందడి కనిపిస్తోంది. తెల్లవారు జామునుంచే ఇంద్రకీలాద్రి సహా అమ్మవారి ఆలయాలు కిక్కిరిసిపోయాయి. ఇంద్రకీలాద్రి లో ఈరోజు రాజరాజేశ్వరి దేవీ అలంకారంలో కనకదుర్గ దర్శమిస్తున్నారు. నేటితో దసర ఉత్సవాలు ముగియనున్నాయి. ఈ రోజు ఉదయం 10:30 కు పూర్ణాహుతి తో దసర నవరాత్రి ఉత్సవాలు సమాప్తం కానున్నాయి. ఉత్సవాల్లో చివరి రోజు కావటంతో ఇంద్రకీలాద్రి కి భక్తుల తాకిడి పెరిగింది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారి దర్శనం కోసం క్యూ లైన్ లో బారులు తీరారు . అంతేకాదు భవానీ మాల వేసుకున్న భక్తులు దుర్గమ్మ దర్శనం కోసం సుదూర ప్రాంతాల నుంచి నడుచుకుంటూ ఇంద్రకీలాద్రికి చేరుకుంటున్నారు .
దసరా పండుగ సందర్భంగా సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు సుఖశాంతులతో ఉండాలని దుర్గమ్మను వేడుకున్నానన్నారు. దసరా పండుగ మన జీవితాల్లో.. కొత్త వెలుగులు నింపాలని ఆకాంక్షిస్తున్నా అంటు సీఎం శుభాకాంక్షలు చెప్పారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి . .