Dussehra 2022: ఈ ఏడాది దసరా పండగ సమయాల్లో కూడా గందరగోళం.. ఖచ్చితమైన తేదీ, సమయాన్ని తెలుసుకోండి

|

Sep 16, 2022 | 2:56 PM

వేద పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం ఆశ్వయుజ మాసం శుక్ల పక్ష దశమి తిథి అక్టోబర్ 4, మంగళవారం మధ్యాహ్నం 2.21 నుండి ప్రారంభమవుతుంది  మరుసటి రోజు అంటే అక్టోబర్ 5 బుధవారం మధ్యాహ్నం 12 గంటల వరకు కొనసాగుతుంది.

Dussehra 2022: ఈ ఏడాది దసరా పండగ సమయాల్లో కూడా గందరగోళం.. ఖచ్చితమైన తేదీ, సమయాన్ని తెలుసుకోండి
Dussehra 2022 Puja Time
Follow us on

Dussehra 2022 Date: చెడుపై మంచి విజయం సాధించిన దానికి గుర్తుగా జరుపుకునే పండుగ విజయదశమి లేదా దసరా పండుగ. ఈ ఏడాది దసరా పర్వదినం ఎప్పుడు జరుపుకోవాలనే విషయంపై ప్రజల్లో గందరగోళం నెలకొంది. పంచాంగం ప్రకారం పవిత్రమైన దసరా పండుగను ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసంలో మాసంలోని శుక్ల పక్షంలోని పదవ రోజున జరుపుకుంటారు. ఆయుధపూజ అని కూడా పిలువబడే విజయదశి పండుగ తేదీ.. విజయదశమి పర్వదినం రోజున కొన్ని ప్రాంతాల్లో జరుపుకునే రావణ దహనం చేసే సమయం గురించి సందేహాలను నివృత్తిని ఉజ్జయినిలోని ప్రసిద్ధ జ్యోతిష్కుడు,  పంచాంగకర్త  పండిట్ చందన్‌ నివృత్తి చేశారు. ఈ ఏడాది దసరా పండుగ జరుపుకునే ఖచ్చితమైన తేదీని, అమ్మవారిని ఆరాధించే పవిత్రమైన సమయాల గురించి తెలుసుకుందాం..

వేద పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం ఆశ్వయుజ మాసం శుక్ల పక్ష దశమి తిథి అక్టోబర్ 4, మంగళవారం మధ్యాహ్నం 2.21 నుండి ప్రారంభమవుతుంది  మరుసటి రోజు అంటే అక్టోబర్ 5 బుధవారం మధ్యాహ్నం 12 గంటల వరకు కొనసాగుతుంది. దీని కారణంగా.. ఈ పవిత్ర పండుగ ఖచ్చితమైన తేదీ గురించి చాలా మందిలో గందరగోళం ఉంది. అక్టోబరు 4న దసరా పండుగ జరుపుకుంటే.. సాయంత్రం రావణ దహనం చేస్తే ఆయుధ పూజలు ఎప్పుడు చేస్తారని.. 5వ తేదీ ఉదయం ఆయుధ పూజలు చేస్తే ఆ తేదీ తర్వాత  రవాణ దహనం ఎప్పుడు చేయాలి అన్న సందేశాలు అమ్మవారి భక్తులలో ఏర్పడ్డాయి.

దసరా తేదీ, శుభ సమయం:

దశమి తేదీ అక్టోబర్ 4 మధ్యాహ్నం 2.21 నుండి ప్రారంభమవుతుంది. విజయదశమి పండుగను అక్టోబర్ 5 న జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు.  అక్టోబరు 5 మధ్యాహ్నం 12 గంటల వరకు పదవ తేదీ ఉంటుందని.. కనుక ఈ రోజు ఉదయం ఆయుధ పూజలు చేయవచ్చని తెలిపారు. అక్టోబర్ 5 రాత్రి తేది  రావణుడిని దహనం నిర్వహించవచ్చునని సూచించారు.

పండగ నిర్వహణ తేదీ, శుభసమయం: 

దశమి తేదీ ప్రారంభమవుతుంది – అక్టోబర్ 4, 2022, మధ్యాహ్నం 2:23 నుండి

దశమి తిథి ముగింపు – 5 అక్టోబర్ 2022, 12:12 సాయంత్రం

శ్రవణ నక్షత్రం ప్రారంభం – అక్టోబర్ 4, 2022, మధ్యాహ్నం 12:11 నుండి

శ్రావణ నక్షత్రం ముగుస్తుంది – 5 అక్టోబర్ 2022, రాత్రి 09:00 వరకు

విజయ్ (అభిజిత్) ముహూర్తం – అక్టోబర్ 5, 2022, రాత్రి 11:59 నుండి 12:47 వరకు (కొత్త వ్యాపారం ప్రారంభించడానికి ప్రత్యేక ముహూర్తం, కొత్త పెట్టుబడి)

అమృత కాలం – 5 అక్టోబర్ 2022, ఉదయం 11:33 నుండి మధ్యాహ్నం 01:02 వరకు

దుముర్హూర్తం – 5 అక్టోబర్ 2022, ఉదయం 11:51 నుండి 12:38 వరకు

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

(ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలు, జానపద విశ్వాసాలపై ఆధారపడి ఇవ్వబడింది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. సాధారణ ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)