- Telugu News Photo Gallery Spiritual photos Chanakya niti follow these things there will never be a shortage of money in telugu
Chanakya Niti: ఇంట్లో డబ్బుకు ఇబ్బందులు ఏర్పడకూడదంటే.. చాణక్య చెప్పిన ఈ విషయాలను అనుసరించండి
ఆచార్య చాణక్యుడు నీతి శాస్త్రంలో చాలా విషయాలు ప్రస్తావించారు. నీతి శాస్త్రంలో సంపద, సంబంధాలు, వైవాహిక జీవితం, ఉద్యోగం-వ్యాపారం, విద్యకు సంబంధించిన అనేక విషయాలు పేర్కొన్నారు. ఈ విషయాలను అనుసరించడం ద్వారా ఒక వ్యక్తికి జీవితం సుఖ సంతోషాలతో సాగుతుందని పెద్దల నమ్మకం.
Updated on: Sep 16, 2022 | 5:52 PM

సందేహం: ఒకరినొకరు ఎప్పుడూ అనుమానించుకోకండి. సంబంధంలో సందేహాలు ఉంటే ఆ సంబంధాన్ని నాశనం చేయవచ్చు.కనుక మీ భాగస్వామిని ఎప్పుడూ అనుమానించకండి. మీ భాగస్వామి గురించి మీకు ఏవైనా ఆలోచనలు ఉంటే.. వెంటనే మీ భాగస్వామిని అడగడం ద్వారా ఆ అనుమానాన్ని ఆలోచనను దూరం చేసుకోండి.

డేగ తన లక్ష్యాన్ని సాధించడంలో ఎప్పుడూ విఫలం కాదు. ఎవరూ తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకూడదు. జీవితంలో లక్ష్యాన్ని నిర్దేశించుకుని దానిని సాధించే దిశగా అడుగులు వేయాలి. జాగ్రత్తగా ఆలోచించి సమయం తీసుకుని సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుని ఎల్లప్పుడూ లక్ష్యం చేరుకోవాలి.

దొంగిలించబడిన డబ్బు - దొంగతనం చేసి.. సంపాదించిన డబ్బు లేదా తప్పుడు మార్గాల్లో సంపాదించిన డబ్బులు వ్యక్తి వద్ద ఎక్కువ కాలం ఉండదు. అలాంటి సంపాదనకు విలువ ఉండదు.. అటువంటి వ్యక్తిని ఎవరూ గౌరవంగా చూడరు. కనుక దొంగతనం చేసి డబ్బు సంపాదించకండి.

ఆచార్య చాణక్యుడు నీతి శాస్త్రంలో సంపద, ఆస్తికి సంబంధించిన కొన్ని విషయాలు కూడా చెప్పాడు. తప్పుడు మార్గాల ద్వారా సంపాదించిన డబ్బు ఎప్పుడూ ఆ వ్యక్తి వద్ద ఉండదని నీతిశాస్త్రంలో పేర్కొన్నారు.

మోసం చేయడం ద్వారా - ఆచార్య చాణక్యుడు ప్రకారం.. మోసం చేసి సంపాదించిన డబ్బు ఆ వ్యక్తి దగ్గర ఎప్పుడూ నిలబడదు. ఎంత ధనం, సిరి సంపదలున్నా అలాంటి వ్యక్తులను.. ఆ ఇంటి కుటుంబ సభ్యులను ఎవరూ గౌరవించరు




