Dasara: హైదరాబాద్ బెంగాలీ సమితిలో ఘనంగా నవమి వేడుకలు.. ఆయుధ పూజలో పాల్గొన్న జూపల్లి రామ్ రావు

Dasara Celebrations: శరన్నవరాత్రుల్లో భాగంగా దుర్గమ్మ వారి నవమి వేడుకలను హైదరాబాద్ బెంగాలీ సమితి ఘనంగా నిర్వహించింది. నవమి సందర్బంగా..

Dasara: హైదరాబాద్ బెంగాలీ సమితిలో ఘనంగా నవమి వేడుకలు.. ఆయుధ పూజలో పాల్గొన్న జూపల్లి రామ్ రావు
Dasara In Hyderabad

Edited By:

Updated on: Oct 15, 2021 | 10:50 AM

Dasara Celebrations: శరన్నవరాత్రుల్లో భాగంగా దుర్గమ్మ వారి నవమి వేడుకలను హైదరాబాద్ బెంగాలీ సమితి ఘనంగా నిర్వహించింది. నవమి సందర్బంగా నిత్య పూజ అలంకరణలు, హోమం, ఆయుధ పూజ వంటివి వైభవంగా జరిపారు. రామకృష్ణమఠం పక్కన ఉన్న బెంగాలీ సమితి దసరా ఉత్సవాల సందర్బంగా ఐదురోజుల అమ్మవారి వేడుకలను అట్టహాసంగా చేశారు. బెంగాలీ సంస్కృతి,, సంప్రదాయలు ఉట్టిపడేలా హైదరాబాద్ లో 80 ఏళ్లుగా ఇదే తరహాలో దుర్గాపూజోత్సవం నిర్వహిస్తున్నారు. నవమి రోజు పూజా కార్యక్రమంలో జూపల్లి రామ్ రావు పాల్గొన్నారు.

అంతకుముందు రోజుల్లో తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్, ఏపీ మాజీ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, మైహోమ్ గ్రూప్ చైర్మన్ జూపల్లి రామేశ్వరరావు పాల్గొన్నారు. తెలుగురాష్ట్రాల్లో స్థిరపడిన బెంగాలీలు, స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. ఎంతో విశిష్టత కలిగిన బెంగాలీ సమితి దుర్గమ్మ ఉత్సవాలను కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఆడిటోరియంలో నిర్వహించారు. దశమి రోజున పండుగ వాతావరణంలో అమ్మవారి ప్రతిమను నిమజ్జనం చేయనున్న నిర్వాహకులు తెలిపారు.

 

Also Read: సొంత గూటికి చేరుకున్న ఎయిర్ ఇండియా.. అరుదైన బహుమతిని అందుకున్న రతన్ టాటా.. ఎందుకంటే..