మనిషికి ఆధ్యాత్మిక చింతన అవసరమా? ఆధునిక తత్వవేత్తలు నేటి యువతకు ఏమి చెబుతున్నారంటే..

|

Dec 13, 2022 | 5:37 PM

మొత్తానికి భగవంతుడిని మనం తెలుసుకోవాలన్నా, భగవంతుడే మనల్ని కనుగొనాలన్నా మనం చేయాల్సింది ఏమైనా ఉంటుందా అని నేటితరం యువత ప్రశ్నిస్తోంది. ప్రాచ్య, పాశ్చాత్య తత్వవేత్తలు సైతం ఇది చాలా తేలిక అని అంటున్నారు. నిస్వార్ధంగా ఉండు.

మనిషికి ఆధ్యాత్మిక చింతన అవసరమా? ఆధునిక తత్వవేత్తలు నేటి యువతకు ఏమి చెబుతున్నారంటే..
Spiritual Thoughts
Follow us on

మనిషికి ఆధ్యాత్మిక చింతన అవసరమా? భగవంతుడు ఉన్నాడా, లేడా? ఆయనను కనుగొనాల్సిన అవసరం ఉందా? ఈ ప్రశ్నలు అతి పురాతన కాలం నుంచి ఉదయిస్తూనే ఉన్నాయి. అంతేకాదు, మనిషి పుట్టిన నాటి నుంచి మరణించేవరకు మనసులో ఈ తరహా ప్రశ్నలు మెదులుతూనే ఉన్నాయి. అనేక అనేక మంది మహాత్ములు ఈ ప్రశ్నలకు సమాధానం కోసం తమ జీవితాలను త్యాగం చేశారు. భోగభాగ్యాలను, సిరి సంపదలను, కుటుంబాన్ని వదిలి పెట్టేశారు. అడవుల్లో, లోయల్లో, పర్వతాల్లో, నదీ తీరాల్లో, సముద్రతీరాల్లో ఈ ప్రశ్నలకు సమాధానాల కోసం తీవ్రంగా అన్వేషించారు. ఈ ప్రశ్నలకు సమాధానాల కోసం తీవ్రంగా గ్రంథాలను శోధించారు. శ్రీకృష్ణుడు, బుద్ధుడు, మహావీరుడు, మహమ్మద్ ప్రవక్త, ఏసుక్రీస్తు, సోక్రటీస్ వంటి మహానుభావుల దగ్గర నుంచి ఇటీవలి రామకృష్ణ పరమహంస, యోగానంద, స్వామి వివేకానంద, రమణ మహర్షి, జె. కృష్ణమూర్తి వరకు ఎందరో యోగులు, సిద్ధులు, సాధువులు, సర్వసంగ పరిత్యాగులు సత్యాన్వేషణ పేరుతో సమాధానాలు శోధించారు.

వారు కనుగొన్న సత్యానికి వారు రకరకాల పేర్లు పెట్టారు. భగవంతుడికి ఉన్న పేర్లను పక్కనపెట్టి, భగవత్ స్వరూపాన్ని వారు వీక్షించిన తీరును బట్టి వారు దానిని పరమాత్మ అని, సర్వాంతర్యామి అని, శుద్ధ చైతన్యమని, సూపర్ ఇంటెలిజెన్స్ అని వివిధ పేర్లతో పిలిచారు. చివరికి వారంతా తేల్చి చెప్పింది ఏమిటంటే, పరమాత్మ ఎక్కడో లేడు మనలోనే ఉన్నాడు అని. దీనికోసం అడవులు, కొండలు, నదులను పట్టుకొని తిరగాల్సిన అవసరం లేదని, గుళ్ళు, గోపురాలు సందర్శించాల్సిన అవసరం కూడా లేదని స్పష్టం చేశారు. భగవంతుడిని నీలోనే వెతుక్కో అని ఒకరంటే నేనెవరిని అని ప్రశ్నించుకో అని మరొకరు అన్నారు. అంతర్ము గుడివైతే చాలు, పరమాత్ముడు నీకు జ్యోతి రూపంలో కనిపిస్తాడని కూడా కొందరు చెప్పారు. భగవంతుడు బయట ఎక్కడ ఉన్నా, మనలోనే ఉన్నా మొత్తానికి ఆధ్యాత్మిక చింతన ద్వారానే ఆయన ఉనికిని తెలుసుకోగలమని, ఈ ఆధ్యాత్మిక చింతననే సత్యాన్వేషణ అంటున్నామని అర్ధం అవుతోంది. నువ్వు ఆయనను కనిపెట్టే పని పెట్టుకోవద్దు. ఆయనే నిన్ను వెతుక్కుంటూ వస్తాడు అని ప్రముఖ తత్వవేత్త యు.జి. కృష్ణమూర్తి ఒక కొత్త విషయానికి తెర తీశారు.

మొత్తానికి భగవంతుడిని మనం తెలుసుకోవాలన్నా, భగవంతుడే మనల్ని కనుగొనాలన్నా మనం చేయాల్సింది ఏమైనా ఉంటుందా అని నేటితరం యువత ప్రశ్నిస్తోంది. ప్రాచ్య, పాశ్చాత్య తత్వవేత్తలు సైతం ఇది చాలా తేలిక అని అంటున్నారు. నిస్వార్ధంగా ఉండు. పరోపకారం అలవాటు చేసుకో. నిస్సహాయులకు సహాయంగా ఉండు. నిజమే చెప్పు. కలలో కూడా ఎవరికి కీడు తలపెట్టకు. నెగిటివ్ గా కాక పాజిటివ్గా మాత్రమే ఆలోచించు. ఈ లక్షణాలను అలవాటు చేసుకుంటే నువ్వు అతి చిన్న సత్యాన్వేషణ ప్రయత్నం చేసినా ఫలిస్తుంది. లేదా పరమాత్ముడే నీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాడు అంటున్నారు ఆధునిక తత్వవేత్తలు. ఈ లక్షణాలన్నీ అనబరుచుకున్నా, ఇందులో కొన్ని మాత్రమే అలవర్చుకుని ఆచరణలో పెట్టిన ఆయన నీ వెంటే ఉంటాడని, ఏదో ఒక రోజున నీకు కనిపించి తీరుతాడు అని పరమహంస యోగానంద వంటి వారు చెప్పారు. పరమాత్మ కోసం అడవులు, చెట్లు, పుట్టలను పట్టుకొని తిరగనక్కరలేదని, తాను ఎవరికి కనిపించాలా అని ఆయనే అన్వేషణ చేస్తుంటాడని ఆయన వివరించారు కౌశిక్.

ఇవి కూడా చదవండి

Author: TV9 Telugu Desk

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..