Diwali 2023: దీపావళి రోజున గుడ్ల గూబ బలి, కేజీ పత్తితో దీపం వెలిగించే సంప్రదాయం.. ఎప్పుడు మొదలైందంటే..

|

Nov 09, 2023 | 11:13 AM

దీపావళి రోజున మొఘల్ ప్యాలెస్ పై భాగంలో భారీ దీపం వెలిగించే సంప్రదాయం ఉందని చెబుతారు. సుమారు ఒక కిలోల పత్తి , అనేక లీటర్ల ఆవాల నూనెను ఈ దీపం వెలిగించడానికి ఉపయోగించేవారు. రాత్రంతా దీపం వెలుగుతూనే ఉండడం కోసం ఎవరో ఒకరు ఆ దీపం వద్దకు కాపలాగా ఉండేవారు. దీపం వెలిగించాడనికి ప్యాలెస్ ఎక్కడానికి నిచ్చెనను ఉపయోగించి దీపంలో నూనె పోసేవారట. 

Diwali 2023: దీపావళి రోజున గుడ్ల గూబ బలి, కేజీ పత్తితో దీపం వెలిగించే సంప్రదాయం.. ఎప్పుడు మొదలైందంటే..
Mughal's Diwali
Follow us on

దేశ వ్యాప్తంగా దీపావళి సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. ఇంటి నుంచి  మార్కెట్‌ వరకు దీపావళి శోభ కనిపిస్తుంది. ఇళ్లను అలంకరిస్తున్నారు. ప్రజలు షాపింగ్‌లో బిజీగా ఉన్నారు. అయితే మొఘలుల కాలంలో కూడా దీపావళి జరుపుకునేవారు. ఆనాటి దీపావళికి నేటి దీపావళికి తేడా ఉందని చాలా మంది చరిత్రకారులు చెబుతున్నారు. మొఘలుల కాలంలో వస్తువులకు, పండగలకు కొత్త పేర్లను పెట్టే సంప్రదాయం ఎప్పటి నుంచో ఉంది.. దీపావళి విషయంలో కూడా అదే జరిగింది. ఆ సమయంలో దీపావళి జష్న్-ఎ-రివాజ్ అని పిలిచేవారు.

చరిత్రకారులు చెప్పిన ప్రకారం మొఘల్ సామ్రాజ్యం భారత్ లో బాబర్ అడుగు పెట్టడంతో మొదలైంది.. అయితే దీపావళి బాబర్, హుమాయున్ ల పాలనలో మొదలు కాలేదు.. దీపావళి జరుపుకునే ప్రక్రియ అక్బర్ పాలనలో ప్రారంభమైందని తెలుస్తోంది. అయితే మొఘలులు హిందూ పండుగలపై ఎందుకు అంత ఆసక్తి కనబరిచారనే విషయంపై కొంతమంది ఉలేమాలకు అభ్యంతరాలు ఉన్నాయి. దీనిని ఇస్లామిక్ పద్ధతికి వ్యతిరేకంగా పేర్కొన్నారు. మొఘలుల దృష్టిలో దీపావళి పండుగ కేవలం మెరిసే రాత్రి. ఆ కాలంలో  మూఢ నమ్మకాలు బలంగా ఉండేవి. దీపావళి రోజున గుడ్లగూబలను బలి ఇచ్చేవారు.

మొఘలులకు దీపావళి అంటే ఏమిటి?

దీపావళి పండగను మొఘల్ సామ్రాజ్య చక్రవర్తులు గొప్ప ఉత్సాహంగా జరుపుకునేవారు.  మొఘలుల మూడవ తరం చక్రవర్తి అక్బర్..  హిందూ పండుగల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరిచాడు. అక్బర్ హయాంలో ఆగ్రా కోట, ఫతేపూర్ సిక్రీ నిర్మాణ ప్రక్రియ ప్రారంభమైంది. బేగం జోధాబాయి, బీర్బల్ ఇక్కడ నివసించారు.

ఇవి కూడా చదవండి

షాజహాన్, జహంగీర్ లు దీపావళి పండగ జరుపుకునే విషయంలో అంత ఉత్సాహం చూపలేదు. అదే సమయంలో ఔరంగజేబు పాలనలో దీపావళి పండగ అంటే రాజపుత్ర కుటుంబాల నుండి వచ్చే బహుమతులుగా భావించేవారు. జోధ్‌పూర్ చక్రవర్తి రాజా జస్వంత్ సింగ్, జైపూర్ సుల్తానేట్ రాజా జై సింగ్ వంటి అనేక కుటుంబాల నుండి ఔరంగజేబుకు బహుమతులు పంపేవారు.

చరిత్రకారుడు AV స్విత్ ప్రకారం ఢిల్లీ కోటలో దీపావళిని ప్రత్యేకంగా జరుపుకునే సంప్రదాయం ఉంది. అప్పట్లో జరిగిన దీపావళి వేడుకకు ఢిల్లీ కోట సాక్షిగా నిలిచింది. 1720 నుంచి 1748 మధ్య మహమ్మద్ షా హయాంలో కూడా దీపావళిని ప్రత్యేకంగా జరుపుకునేవారు. ప్యాలెస్ ముందు ఉన్న పెద్ద మైదానంలో కార్యక్రమాలు నిర్వహించేవారు. ప్యాలెస్ దీపాలతో దేదీప్యమానంగా వెలుగులు చిందేది.

రాజభవనంలోని ఎత్తైన ప్రదేశంలో పెద్ద దీపం

దీపావళి రోజున మొఘల్ ప్యాలెస్ పై భాగంలో భారీ దీపం వెలిగించే సంప్రదాయం ఉందని చెబుతారు. సుమారు ఒక కిలోల పత్తి , అనేక లీటర్ల ఆవాల నూనెను ఈ దీపం వెలిగించడానికి ఉపయోగించేవారు. రాత్రంతా దీపం వెలుగుతూనే ఉండడం కోసం ఎవరో ఒకరు ఆ దీపం వద్దకు కాపలాగా ఉండేవారు. దీపం వెలిగించాడనికి ప్యాలెస్ ఎక్కడానికి నిచ్చెనను ఉపయోగించి దీపంలో నూనె పోసేవారట.

దీపావళి పండగ జరుపుకోవడానికి మొఘల్ పాలకులు భిన్నమైన ఆలోచనలు కలిగి ఉన్నారు. కొంతమంది రాజులకు ఇది దీపాల పండుగ. కొందరికి స్వీట్లు, ఇష్టమైన ఆహారం తినే పండుగగా జరుపుకునేవారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..