Krishna and Karna : కర్ణుడికి వరమిస్తానన్న కృష్ణుడు.. రాధేయుడు అడిగిన వరం విన్న కన్నయ్య కంట కన్నీరు..

|

Jun 28, 2021 | 7:48 AM

Krishna and Karna: మహాభారతంలో ఉన్నతమైన స్థానం పొందిన వ్యక్తి కర్ణుడు.. తన వ్యక్తిత్వం, ధర్మం, దానం గుణం, స్నేహ ధర్మంతో మహాభారతంలో ప్రముఖ స్థానాన్ని పొందాడు. కర్ణుడు దూర్వాస..

Krishna and Karna : కర్ణుడికి వరమిస్తానన్న కృష్ణుడు.. రాధేయుడు అడిగిన వరం విన్న కన్నయ్య కంట కన్నీరు..
Karna Krishna
Follow us on

Krishna and Karna: మహాభారతంలో ఉన్నతమైన స్థానం పొందిన వ్యక్తి కర్ణుడు.. తన వ్యక్తిత్వం, ధర్మం, దానం గుణం, స్నేహ ధర్మంతో మహాభారతంలో ప్రముఖ స్థానాన్ని పొందాడు. కర్ణుడు దూర్వాస మహర్షి కుంతీభోజుని కుమార్తెయైన కుంతికి ఇచ్చిన వరప్రభావంతో సూర్య దేవునికి ఆమెకు కలిగిన సంతానము. సూర్యుని అంశాన సహజ కవచకుండలాలతో జన్మించిన కర్ణుడు సూర్యతేజస్సుతో ప్రకాశించాడు. కుంతి కర్ణుడిని గంగలో విడిచిపెడితే.. అతిరధుడి ఇంట రాధేయుడిగా పెరిగాడు. సూతపుత్రుడిగా కర్ణుని జీవితాంతం వరకు ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నాడు . శకుని సలహాలతో విభేదించిన కర్ణుడు, దుర్యోధనుని కొరకు తన జీవితం ను పణం గా పెట్టినవ్యక్తి గా చరిత్రలో నిలిచిపోయినాడు.

అయితే కర్ణుడు కోసం కృష్ణుడు కోసం కన్నీళ్లు పెట్టాడు. అంటే.. కర్ణుడు ఎంతటి ఉన్నతమైన వ్యక్తి అయ్యుండాలి. అవును కన్నయ్య యుద్ధం లో మరణంతో పోరాడుతున్న కర్ణుడిని చూసి కన్నీళ్లు పెట్టాడు. కర్ణుడు చేసిన దానధర్మాలు అతడిని మృత్యువు దరి చేరకుండా చేశాయి. దీంతో కృష్ణుడు కర్ణుడి వద్దకు వెళ్లి ఒక కోరిక కోరాడు. కర్ణా నువ్వు దానం చేయగా పొందిన పుణ్యఫలాలన్నీ నాకు దానం చేయవా అని అడిగాడు కర్ణుడు వెంటనే ఏమీ ఆలోచించకున్నా తన వద్ద ఉన్న పుణ్యఫలం అంతా కృష్ణుడికి దానం చేశాడు. అప్పుడు కృష్ణుడు కర్ణుడి తలను తన చేతులతో పట్టుకుని నీకో వరమిస్తాను ఏమి కావాలో అడుగు అన్నాడు అంటే.. అందుకు కర్ణుడు నాకు ఇంకో జన్మ వద్దు.. ఒకవేళ అలా మళ్ళీ జన్మ ఉంటె.. అప్పుడు కూడా ఎవరు ఏమి అడిగినా లేదు అని చెప్పకుండా ఇచ్చేటువంటి హృదయాన్ని నాకు ఇవ్వు అని అడిగాడు.

కర్ణుడు అడిగిన వరం విన్న వెంటనే కృష్ణయ్య కళ్ళు కన్నీటి ధారలై పొంగాయి. ఇంతమంచి వాడి వేంటయ్యా కర్ణా నువ్వు అని గట్టిగ కర్ణుడి దేహాన్ని తన హృదయానికి హత్తుకున్నాడు కృష్ణుడు.

Also Read: శ్రీవారి వివాహం అనంతరం కొలువుదీరిన ఆలయం శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయం