NAGOBA: మొక్కు తీర్చుకుంటేనే కోడలిగా గుర్తింపు.. అమావాస్య అర్ధరాత్రి పూజలు

|

Feb 06, 2022 | 3:18 PM

తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జరిగే నాగోబా జాతర(Nagoba Festival) అత్యంత ప్రజాదరణ పొందింది. సమ్మక్క-సారలమ్మ జాతర తర్వాత రెండో అతిపెద్ద జాతరగా ఖ్యాతి గడించింది.

NAGOBA: మొక్కు తీర్చుకుంటేనే కోడలిగా గుర్తింపు.. అమావాస్య అర్ధరాత్రి పూజలు
Nagoba
Follow us on

తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జరిగే నాగోబా జాతర(Nagoba Festival) అత్యంత ప్రజాదరణ పొందింది. సమ్మక్క-సారలమ్మ జాతర తర్వాత రెండో అతిపెద్ద జాతరగా ఖ్యాతి గడించింది. ఈ వేడుక కోసం మెస్రం వంశస్థులు ఎక్కడున్నా ఎడ్లబళ్లపై వచ్చి మర్రిచెట్టు నీడన సేదతీరి, హస్తిన మడుగు నుంచి తెచ్చే జలంతో ఆలయాన్ని అభిషేకించి నాగోబాను ఆరాధిస్తారు. పెళ్లయిన మహిళలు ఇక్కడ బేటి పేరిట మొక్కు తీర్చుకుంటేనే మెస్రం వంశీయుల కోడలిగా గుర్తింపు లభిస్తుంది. ఇక్కడ కర్మకాండ చేస్తేనే చనిపోయినవారికి మోక్షం కలుగుతుందని భక్తలు విశ్వసిస్తారు. ఏటా పుష్య మాస అమావాస్య అర్ధరాత్రి మహాపూజతో జాతర ఆరంభిస్తారు. అంతకంటే నెల ముందు నియమ నిష్టల ప్రస్థానం ప్రారంభమవుతుంది.

మెస్రం, గోడం ఆడపడచులు కొత్త కుండల్లో తెచ్చే పవిత్ర జలాన్ని(Holy water) తుడుం మోతలు, సన్నాయి స్వరాల మధ్య అందరిపై చల్లుతారు. మర్రి చెట్టు నీడన అందరూ తమ వెంట తెచ్చుకున్న జొన్న సంకటి, సాంబారను నాగోబాకు నివేదిస్తారు. ఎవరికీ ఎవరూ భారం కాకూడదనేది ఈ నైవేద్య సమర్పణలో అంతర్లీనంగా ఉన్న సూత్రం. ఇప్పటికీ జాతరకు ఎడ్ల బళ్ల పైనే రావాలన్నది భక్తుల నిబంధన. ఏడాదికి సరిపడా వంటపాత్రలు, వ్యవసాయ పనిముట్లు జాతరలో కొనుగోలు చేయాలనేది ఆచారం. అమావాస్యనాటి ఈ జాతర వెలుగులు పంచుతుందని, తాము నిష్కల్మషంగా ఉంటే దేవత కాపాడుతుందని నమ్ముతారు. అదే వారిలో ధైర్యాన్ని నింపుతోందనడంలో సందేహం లేదు.

Also Read

MLA Sinciarity: కేసు నమోదైన భర్తను.. సొంత స్కూటీపై తీసుకెళ్లి పోలీసులకు అప్పగించిన ఎమ్మెల్యే.. ఎందుకో తెలుసా..?

Lata Mangeshkar: ధనవంతమైన బీసీసీఐకి సహాయం చేసిన లతా మంగేష్కర్.. ఎప్పుడంటే..

UP Assembly Election 2022: యూపీ బీజేపీ మేనిఫెస్టో విడుదల వాయిదా.. ఆమెపై గౌరవ సూచకంగా..