Yadadri: యాదాద్రిలో భక్తుల రద్దీ.. సమస్యల లేమితో చిన్నారులు, వృద్ధులు సతమతం

|

May 01, 2022 | 6:42 PM

తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి(Yadadri) లో భక్తుల రద్దీ నెలకొంది. ఆదివారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారిలో ఆలయ పరిసరాలు కిక్కిరిశాయి. క్యూలైన్లు, ప్రసాదాల కౌంటర్లు, కల్యాణకట్ట, లక్ష్మీ పుష్కరిణి...

Yadadri: యాదాద్రిలో భక్తుల రద్దీ.. సమస్యల లేమితో చిన్నారులు, వృద్ధులు సతమతం
Yadadri
Follow us on

తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి(Yadadri) లో భక్తుల రద్దీ నెలకొంది. ఆదివారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారిలో ఆలయ పరిసరాలు కిక్కిరిశాయి. క్యూలైన్లు, ప్రసాదాల కౌంటర్లు, కల్యాణకట్ట, లక్ష్మీ పుష్కరిణి కిటకిటలాడాయి. స్వామి వారి దర్శనానికి గంటలకు పైగా సమయం పడుతుండటంతో క్యూలైన్లలో ఉన్న భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్వామి అమ్మవార్ల దర్శానాల కోసం క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు.. నల్లాల ద్వారా వస్తున్న వేడి నీరు తాగలేక అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఆలయ మాడ వీధుల్లోనూ సరిపడా చలువ పందిర్లు లేకపోవడంతో ఎండ వేడికి భక్తులు తట్టుకోలేకపోతున్నారు. ఉక్కపోతతో చిన్నారులు, వృద్ధులు సతమతమవుతున్నారు.ఉదయం 7 గంటలకు బయల్దేరి వచ్చినా.. దాదాపు మూడు గంటలకు పైగా నిల్చొనే ఉన్నామని..కనీస సదుపాయాలు కూడా కల్పించలేదని భక్తులు వాపోతున్నారు. యాదాద్రికి వచ్చే వీఐపీలకే సకల మర్యాదలు చేపడుతున్నారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సామాన్య భక్తులను పట్టించుకోవడం లేదని అసహనం వ్యక్తం చేశారు.

కోట్ల రూపాయల ఖర్చు పెట్టి కట్టించామని సీఎం కేసీఆర్‌ చెప్పుకొంటున్నారని.. కానీ క్షేత్ర స్థాయిలో కనీస సదుపాయాలు కూడా లేవని భక్తులు మండిపడుతున్నారు. వేసవి తాపానికి చిన్నారులు, వృద్ధులు తట్టుకోలేకపోతున్నారని ఆవేదన చెందారు. స్వామివారిని దర్శించుకుని సంతోషంగా వెళ్దాం అనుకుంటే.. ఈ క్యూలైన్లలోనే గంటల తరబడి ఎదురుచూసి నీరుగారిపోతున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Gmail Security: జీమెయిల్ అకౌంట్ హ్యాక్ అయిందని అనుమానమా.. వెంటనే ఇలా చెక్ చేసుకోండి..

Chiranjeevi: సినీకార్మికుల సమస్యల పరిష్కారానికి ముందే ఉంటా.. టాలీవుడ్ కు చిరంజీవి భరోసా