Puri Jagannatha Temple :  పూరి జగన్నాథుడికి దేవతా రూపాలతో 4.8 కేజీల బంగారు నగలను సమర్పించిన ఓ భక్తుడు

|

Feb 17, 2021 | 10:21 AM

 కరోనా వైరస్ సృష్టించిన అల్లకల్లోలం నుంచి దేశం ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. లాక్ డౌన్ సమయంలో దేవాలయాల్లో నిలిపివేసిన భక్తుల దర్శనాలను తిరిగి పునరుద్ధరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రఖ్యాత పూరీ జగన్నాథ్ స్వామి ఆలయ నిర్వాకులు మళ్ళీ ఆలయం తెరిచి కోవిడ్ నిబంధనలను...

Puri Jagannatha Temple :  పూరి జగన్నాథుడికి  దేవతా రూపాలతో 4.8 కేజీల బంగారు నగలను సమర్పించిన ఓ భక్తుడు
Follow us on

Puri Shree Jagannatha Temple : కరోనా వైరస్ సృష్టించిన అల్లకల్లోలం నుంచి దేశం ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. లాక్ డౌన్ సమయంలో దేవాలయాల్లో నిలిపివేసిన భక్తుల దర్శనాలను తిరిగి పునరుద్ధరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రఖ్యాత పూరీ జగన్నాథ్ స్వామి ఆలయ నిర్వాకులు మళ్ళీ ఆలయం తెరిచి కోవిడ్ నిబంధనలను పాటిస్తూ భక్తులకు దర్శనాలకు అనుమతినిస్తున్నారు. దీంతో భక్తులు భారీ సంఖ్యలో స్వామిని దర్శించుకుంటున్నారు. అందులో భాగంగా ఓ భక్తుడు స్వామివారికి బంగారు నగలను కనుకలుగా సమర్పించారు. ఈ నగలు మొత్తం 4 కేజీల బంగారంతో తయారు చేశారు. అంటే వీటి ధర సుమారు రూ. 1,77,00,000 ఉండవచ్చు అని తెలుస్తోంది. ఈ నగలను చూసిన భక్తులు చాలా బాగున్నాయని.. ఎంత సేపు చూసినా చూడాలనిపించేటంత అక్షర్షణీయంగా ఉన్నాయని భక్తులు అంటున్నారు. బంగారు ఆభరణాల్లో మందిరంలోని దేవతల రూపాలు ఉన్నాయి. జోబా, శ్రీముఖ పద్మల రూపాలతో ఆ నగలు చూపరులను ఆకర్షిస్తున్నాయి.

Also Read:

జోగులాంబ అమ్మవారి సన్నిధిలో సీఎం కేసీఆర్‌ కుటుంబం.. వార్షిక బ్రహ్మోత్సవాల్లో ప్రత్యేక పూజలు

హిందూధర్మంలో అత్యంత ప్రాముఖ్యతకలిగిన దీపాన్ని ప్రతి రోజూ ఇంట్లో ఎందుకు వెలిగిస్తారో తెలుసా..!