దసరా నవరాత్రుల ఉత్సవాలకు కౌంట్ డౌన్ సార్ట్ అయింది. మరికొన్ని రోజుల్లో శరన్నవరాత్రుల ఉత్సవాలు రానున్నాయి. ఈ నేపధ్యంలో దేశంలో ప్రముఖ అమ్మవారి ఆలయాలు, శక్తి పీఠాలను దర్శించుకోవడానికి అమ్మవారి భక్తులు ఆసక్తిని చూపిస్తారు. అలా నవరాత్రులలో సందర్శించోకోవాల్సిన ఆలయాల్లో ఒకటి మేఘాలయలోని జైంతియా హిల్స్‌లో ఉన్న నార్తియాంగ్ దుర్గా ఆలయం. ఈ ఆలయంలో దుర్గాదేవి నివసిస్తుందని మేఘాలయ హిందువుల విశ్వాసం. అందమైన శిల్ప కళతో ఆకట్టుకునే పురాతన దుర్గా దేవాలయం 500 సంవత్సరాల క్రితం నిర్మించినట్లు తెలుస్తోంది. ఈ పుణ్యక్షేత్రం భారతదేశంలోని 51 శక్తి పీఠాలలో ఒకటిగా విశ్వాసం. ఈ క్షేత్రంలో సతీదేవి ఎడమ తొడ ఇక్కడ పడిందని నమ్మకం. ఈ ప్రదేశానికి అపారమైన ఆధ్యాత్మిక శక్తి ఉందని పురాణాలు పేర్కొంటున్నాయి.
ఈ దేవాలయం దుర్గామాత విగ్రహం, దానికి సమీపంలోనే శివాలయం ఉంది. అమ్మవారిని జయంతేశ్వరి, జయంతి అని పిలుస్తారు. భైరవ కామదీశ్వరుడుగా శివుడు పూజలను అందుకుంటున్నాడు.
ఈ ఆలయాన్ని జైంతియా రాజు జాసో మానిక్ ఈ ఆలయాన్ని నిర్మించాడు. అందుకే ఈ దుర్గాదేవి ఆలయాన్ని జయంతేశ్వరి ఆలయం అని కూడా అంటారు. జైంతియా హిల్స్ నుంచి చూస్తే మ్యుండు నది శిఖరం నుంచి అద్భుతమైన దృశ్యాలను సందర్శించడం ఒక అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది.
హిందూ, ఖాసీ సంప్రదాయాల మిశ్రమంలో ఇక్కడ అమ్మవారికి పూజలు నిర్వహిస్తారు. స్థానిక సాయం లేదా సర్దార్ పూజ పఠనాలకు బాధ్యత వహిస్తారు. దుర్గాపూజ సమయంలో మేకలను బలి ఇస్తారు. నాలుగు రోజుల పూజలో అరటి చెట్టును దేవతగా పూజిస్తారు. 10న అరటిచెట్టును స్థానిక మింటూ నదిలో నిమజ్జనం చేశారు.
పురాణాల ప్రకారం జైంతియా రాజు జాసో మానిక్ హిందూ రాజు నారా నారాయణ కుమార్తెను వివాహం చేసుకున్న తరువాత.. జాసో మానిక్ హిందూ మతంలోకి మారారు. ఆ సమయంలో జాసో కలలో మానిక్ సమీపంలోని కొండలపై ఆలయాన్ని నిర్మించమని అమ్మవారి ఆదేశించినట్లు కల కన్నారు. ఈ ఆలయం షిల్లాంగ్ తూర్పు వైపు 65 కిలోమీటర్ల దూరంలో ఉంది.
రైలు మార్గంలో
ఈ ఆలయాన్ని గౌహతి, షిల్లాంగ్ విమానాశ్రయాల నుంచి చేరుకోవచ్చు. గౌహతి నుండి దూరం దాదాపు 150 కి.మీ. షిల్లాంగ్ నుంచి దూరం 60 కి.మీ. ఇది గౌహతి రైల్వే స్టేషన్ నుండి కూడా చేరుకోవచ్చు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం, ఖచ్చితమైనది అని మేము ధృవీకరించడం లేదు. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి