Chinna Jeeyar Swamy: దుబ్బాక పట్టణంలో కొత్తగా నిర్మించిన బాలాజీ ఆలయంలో విగ్రహ ప్రతిష్ట చేశారు శ్రీశ్రీశ్రీ త్రిదిండి చిన్నజీయర్ స్వామి. వేదమంత్రోచ్ఛరణల నడుమ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ఆయన ప్రతిష్టించారు. భక్తి ఉన్న ప్రతి ఒక్కరు ఒకే కుటుంబానికి చెందినవారని ఈ సందర్భంగా త్రిదండి చిన్నజీయర్ స్వామి చెప్పారు. సమానత్వం కలిగించాలంటే దైవం కలిగి ఉండాలన్నారు. దైవం, భక్తి, జ్ఞానం లేక ఒకరినొకరు చంపుకునే పరిస్థితి దాపురించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఆలయాలు కట్టడం అంటే వ్యక్తులలో సంస్కారం నింపుతున్నట్టేనన్నారు చిన్నజీయర్ స్వామీజీ. శంషాబాద్ లో అతిపెద్ద రామానుజయ ప్రతిష్ట కార్యక్రమం ఫిబ్రవరి లో ఉంటుందన్నారు. రాజ్యాధికారం ఒకటే చూసుకోకుండా ఈ ప్రాంతాన్ని నీటి వనరులతో తీర్చిదిద్దిన ఘనత సీఎం కేసీఆర్‌దే అంటూ ప్రశంసించారు చిన్నజీయర్ స్వామి.
గుడి ప్రారంభోత్సవం, విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో తెలంగాణ ఆర్థికశాఖామంత్రి హరీష్ రావు కూడా పాల్గొన్నారు. గతంలో దేవాలయానికి సంబంధించిన నిధులు ప్రభుత్వాలు వాడుకునేవని.. ఇప్పుడు ప్రభుత్వమే దేవాలయాలకు ఖర్చు చేస్తోందన్నారు. చిన్నజీయర్ స్వామి ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకెళ్తోందన్నారు. గతంలో ఆత్మహత్య హత్యలకు నిలయంగా ఉన్న దుబ్బాక.. ఇప్పుడు ఎక్కడ చూసినా పచ్చని పొలాలతో కనిపిస్తోందన్నారు మంత్రి హరీష్ రావు.
Read also: KRMB: కృష్ణానది యాజమాన్య బోర్డుపై ఏపీ ఒత్తిడి తీవ్రతరం.. 27న కేఆర్ఎంబీ భేటీ నేపథ్యంలో మరో లేఖ