Christmas Celebration: కేథడ్రల్ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోడీ.. ఈ చర్చి స్పెషాలిటీ ఏమిటంటే..

|

Dec 24, 2024 | 6:43 AM

దేశ వ్యాప్తంగా ఘనంగా క్రిస్మస్ సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. క్రిస్మస్ వేడుకలకు ప్రధాని నరేంద్ర మోడీ హాజరు కానున్న చర్చికి ప్రత్యేకతలు ఉన్నాయి. ఆ ప్రత్యేక జాతర గురించి తెలుసుకుంటే.. ఎవరైనా సరే ఆ చర్చికి వెళ్లకుండా ఆపలేరు. ప్రజలను ఆకర్షిస్తున్న ఈ చర్చి ప్రత్యేకతలు ఏమిటో తెలుసుకుందాం...

Christmas Celebration: కేథడ్రల్ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోడీ.. ఈ చర్చి స్పెషాలిటీ ఏమిటంటే..
Christmas Celebrations
Follow us on

దేశ రాజధాని ఢిల్లీలోని సీబీసీఐ సెంటర్‌ ఆవరణలోని క్యాథలిక్‌ బిషప్‌ కాన్ఫరెన్స్‌ ఆఫ్‌ ఇండియా (సీబీసీఐ) చర్చిలో సోమవారం సాయంత్రం 6.30 గంటలకు నిర్వహించిన క్రిస్మస్‌ వేడుకల్లో ప్రధాని మోడీ పాల్గొన్నారు. సేక్రేడ్ హార్ట్ కేథడ్రల్ చర్చి క్రిస్మస్ నుంచి కొత్త సంవత్సరం వరకు ఢిల్లీలో అత్యంత సుందరంగా అలంకరించబడిన చర్చిలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ కేథడ్రల్ పురాతన చర్చిలలో ఒకటి. అంతేకాదు ఢిల్లీలోని అతిపెద్ద చర్చి కూడా. ఈ చర్చి ఢిల్లీలోని గోల్ డక్ ఖానా సమీపంలో ఉంది.

కేథడ్రల్ చర్చిను సాధారణ ప్రజలు కూడా సందర్శించుకోవచ్చు. క్రిస్మస్ రోజున మాత్రమే కాదు సాధారణంగా రోజులో ఎప్పుడైనా ప్రార్థన చేసుకోవచ్చు. మీరు చర్చి నిర్వహించే ప్రార్థనలకు హాజరు కావాలనుకుంటే.. ఉదయం లేదా సాయంత్రం సందర్శనకు వెళ్ళవచ్చు. సేక్రేడ్ హార్ట్ కేథడ్రల్ చర్చి భారతదేశంలోని న్యూ ఢిల్లీ నగర మధ్యలో ఉంది. ఇక్కడ క్రైస్తవ మతానికి చెందిన ప్రజలు తమ దేవుడు యేసును ప్రార్థిస్తారు.

చాలా ఆకర్షణీయంగా లుక్..

తెలుపు రంగులో పెయింట్ చేయబడిన కేథడ్రల్ చర్చి భవనం బాహ్య రూపం చాలా ఆకర్షణీయంగా, అందంగా ఉంది. సేక్రేడ్ హార్ట్ కేథడ్రల్ క్రైస్తవులకు ముఖ్యమైన చర్చి. క్రైస్తవ మతానికి చెందిన వారు ప్రతిరోజూ ఇక్కడ ప్రార్థనలు చేస్తుంటారు. ఉదయం, సాయంత్రం ప్రార్థనల సమయంలో చర్చి రద్దీగా ఉంటుంది. ఈ సమయంలో భారీ సంఖ్యలో భక్తులు ప్రార్ధన చేయడానికి హాజరవుతారు. సేక్రేడ్ హార్ట్ కేథడ్రల్ క్రిస్మస్, ఈస్టర్ వేడుకల సందర్భంగా అత్యంత సందడిగా ఉండే కేంద్రంగా పరిగణించబడుతుంది.

ఇవి కూడా చదవండి

చర్చి ఎలా ప్రజాదరణ పొందిందంటే

ఫాదర్ జాన్ పాల్ 1986లో భారతదేశ పర్యటన సందర్భంగా ఢిల్లీలోని సేక్రేడ్ హార్ట్ కేథడ్రల్ చర్చ్‌ను సందర్శించారు. ఫాదర్ జాన్ పాల్ సందర్శన తర్వాత ఈ చర్చికి చాలా ప్రజాదరణను ఇచ్చింది. ఇప్పుడు ఈ చర్చి ఢిల్లీలో ప్రధాన పర్యాటక కేంద్రంగా మారింది. చర్చిని చూసేందుకు దేశ విదేశాల నుంచి భారీ సంఖ్యలో పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. చర్చి భవనంపై దూరం నుంచి ఫాదర్ పోప్ జాన్ పాల్ విగ్రహం కనిపిస్తుంది. ఫాదర్ జాన్ పాల్ చేతులు కట్టుకుని నిలబడి భక్తులకు, ప్రజలకు అభివాదం చేస్తున్నట్లు ఉంటుంది.

మీరు సేక్రేడ్ హార్ట్ కేథడ్రల్ చర్చ్‌లోకి ప్రవేశించిన వెంటనే.. భక్తులకు కూర్చునేందుకు ఏర్పాట్లు ఉంటాయి. ఇక్కడ చక్కటి అందమైన అలంకరణతో కూడిన ప్రార్థనా గది కనిపిస్తుంది. భవనం లోపల మేరీ మాత భారీ విగ్రహం కూడా ఉంది. ఇది రాతిపై అందంగా నిర్మించబడి ఉంటుంది.

అందంగా కనిపించే చర్చి

సేక్రేడ్ హార్ట్ కేథడ్రల్ చర్చి 14 ఎకరాల స్థలంలో నిర్మించబడింది. సేక్రేడ్ హార్ట్ కేథడ్రల్ క్యాంపస్‌లో రెండు వేర్వేరు పిల్లల కోసం స్టడీ బిడ్లింగ్స్ కూడా ఉన్నాయి. అందులో ఒకటి సెయింట్ కొలంబా స్కూల్ కాగా, మరొకటి కాన్వెంట్ ఆఫ్ జీసస్ మేరీ స్కూల్.. ఇందులో స్టూడెంట్స్ కు ఆధునిక విద్యను అందిస్తున్నారు. దీనితో పాటు చర్చి లోపల అందమైన తోటలు, పచ్చని చెట్లు చర్చి అందాన్ని మరింత పెంచుతాయి.

ప్రారంభోత్సవం ఎప్పుడంటే

1929లో ఆగ్రా ఆర్చ్ బిషప్ ఎవాంజెలిస్టా లాటినో ఎన్రికో వన్నీ ఈ చర్చికి పునాది రాయి వేశారు. భవన నిర్మాణ పనులు 1930లో ప్రారంభమయ్యాయి. సేక్రేడ్ హార్ట్ కేథడ్రల్ చర్చిని నిర్మించడానికి 5 సంవత్సరాలు పట్టింది. చర్చి నిర్మించడానికి కావాల్సిన డబ్బును స్వచ్ఛంద సేవా సంస్థల నుంచి , సామాన్య ప్రజలు ఇచ్చే విరాళాల ద్వారా సేకరించబడింది. చర్చి భవనం పూర్తయిన తర్వాత, చర్చి ప్రారంభోత్సవ వేడుక డిసెంబర్ 8, 1935న జరిగింది. క్రైస్తవ ప్రజల సమక్షంలో పాపల్ ఇంటర్‌న్యూన్సియో, లియో కిర్కెల్స్ ప్రారంభోత్సవం చేశారు.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..