Christmas celebrations: అబ్బురపరుస్తున్న 400 ఏళ్ల నాటి రామదుర్గం చర్చి.. ప్రారంభమైన క్రిస్మస్ వేడుకలు
దేశ వ్యాప్తంగా క్రిస్మస్ సెలబ్రేషన్స్ అంగరంగ వైభవంగా మొదలయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా పురాతన చర్చిలున్నాయి. అలాంటి చర్చి ఒకటి కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం లో ఉంది. ఈ చర్చికి నాలుగు శతాబ్దాల ఘన చరిత్ర ఉంది. ఆలూరు మండలంలోని రామదుర్గం ప్రార్థన మందిరాన్ని 400 ఏళ్ల క్రితం నిర్మించారు.
1780లో ఫాదర్ సెయింట్ రామదుర్గం చర్చిని గోవా రిజిస్టర్లో రాయించారు. ఇది జరిగిన తర్వాత 150 ఏళ్లకు ముందు.. ఆదోనికి చెందిన మినుములు చిన్న నాగప్ప పెద్ద నాగప్ప రామదుర్గంలో పునీత అన్నమ్మ చర్చి నిర్మించారు. చిన్న నాగప్ప పెద్ద నాగప్ప జొన్నల వ్యాపారం నిమిత్తం కోసం రాయచూరు వెళ్లారు. అక్కడ క్రైస్తవ గురువు కాటేటిస్టులును కలుసుకున్నారు ఆయన బోధనలతో వారు క్రైస్తవ మతాన్ని స్వీకరించి రామదుర్గం ఆదోని ప్రాంతాల్లో చర్చి నిర్మించారు. ఆ తర్వాత గోవా క్రైస్తవ మిషన్ నుంచి వందలాది మంది విదేశీయులు రామదుర్గం చర్చిలో సేవలందించారు. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో విదేశీయులు డైనవేర్మూలిన్ అనే ఫాదర్ రామదుర్గం చర్చిలో స్థిరపడ్డారు.
విద్య వైద్యం చేస్తూ కరువుకాలంలో ఆహార ధాన్యాలు ఇచ్చి ప్రజలను ఆదుకున్నారు. ప్రస్తుతం రామదుర్గంలో రాతి కట్టడంతో ఉన్న చర్చి నిర్మాణం అందరినీ ఆకట్టుకుంటుంది. కాలక్రమేనా పాలనా సౌలభ్యం కోసం ఆదోనికి మారింది. చిప్పగిరిలో ఒకటిన్నర కోట్ల వ్యయంతో ఫాతిమా ఆర్సిఎం పేరుతో పాఠశాల నిర్మించారు. ఈ గ్రామానికి చెందిన 13 మంది ఫాదర్ లు విదేశాల్లో, మనదేశంలోనూ మత బోధన చేస్తున్నారు. క్రిస్మస్ సందర్భంగా పండుగకు చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు ఊరేగింపు అన్నదానం చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. రామదుర్గంలో చర్చిలో ముందస్తు క్రిస్మస్ సంబరాలు మొదలయ్యాయి. ఈ వేడుకలు ఐదు రోజుల పాటు జరుగుతాయి. క్రిస్మస్ వేడుకల కోసం ఇప్పటికే నిర్వాహకులు ఏర్పాటు చేశారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..