Chitragupta Puja 2023: ఈ ఏడాది చిత్రగుప్తుడి నోము ఎప్పుడు జరుపుకుంటారు.. పూజ, ప్రాముఖ్యత ఏమిటంటే..

|

Nov 03, 2023 | 10:48 AM

చిత్రగుప్త పూజను ప్రత్యేకంగా మహిళలు.. కాయస్థ కుటుంబం నిర్వహిస్తుంది. ఈ రోజున పుస్తకాలు, పెన్నులను పూజించే సంప్రదాయం ఉంది. ఆచారాల ప్రకారం చిత్రగుప్తుని ఆరాధించడం,  ఈ రోజున ఆయనను స్మరించుకోవడం వల్ల పనిలో పురోగతి, తెలివితేటలు పెరిగే వరం లభిస్తుందని విశ్వాసం. చిత్రగుప్తుని ఆరాధనలో పుస్తకం, పెన్నకి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ సంవత్సరం చిత్రగుప్త పూజ  తేదీ, పూజ పద్ధతిని గురించి తెలుసుకుందాం.

Chitragupta Puja 2023: ఈ ఏడాది చిత్రగుప్తుడి నోము ఎప్పుడు జరుపుకుంటారు.. పూజ, ప్రాముఖ్యత ఏమిటంటే..
Chitragupta Puja 2023
Follow us on

హిందూ మతంలో నోములు, వ్రతాలు పూజలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అయితే నోములను చేసే ముందు ఖచ్చితంగా చిత్రగుప్త నోముని చేసుకోవాలని .. అప్పుడే మిగిలిన నోములను చేయాలని  ఒక విశ్వాసం దీంతో చిత్రగుప్తుడి పూజకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. దీపావళి రెండో రోజు యమ ద్వితీయ రోజున చిత్రగుప్తుడి పుట్టిన రోజుగా జరుపుకుంటారు. ఇది ప్రతి సంవత్సరం దీపావళి పండగ జరుపుకున్న రెండవ రోజున చిత్రగుప్తుడు పూజని జరుపుకుంటారు. బ్రహ్మ తనయుడు చిత్రగుప్తుడు యమ ధర్మ రాజుకి సహాయకుడిగా హిందువుల నమ్మకం. ఎందుకంటే మరణానంతరం మానవుల మంచి చెడుల గురించి చిత్రగుప్తుడు మాత్రమే యమధర్మ రాజుకి చెబుతాడని విశ్వాసం. ఎవరు స్వర్గానికి వెళ్లాలో, ఎవరు నరకానికి వెళ్లాలో భగవంతుడు చిత్రగుప్తుడు మాత్రమే నిర్ణయిస్తాడు. చిత్రగుప్త పూజను ప్రత్యేకంగా మహిళలు.. కాయస్థ కుటుంబం నిర్వహిస్తుంది. ఈ రోజున పుస్తకాలు, పెన్నులను పూజించే సంప్రదాయం ఉంది. ఆచారాల ప్రకారం చిత్రగుప్తుని ఆరాధించడం,  ఈ రోజున ఆయనను స్మరించుకోవడం వల్ల పనిలో పురోగతి, తెలివితేటలు పెరిగే వరం లభిస్తుందని విశ్వాసం. చిత్రగుప్తుని ఆరాధనలో పుస్తకం, పెన్నకి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ సంవత్సరం చిత్రగుప్త పూజ  తేదీ, పూజ పద్ధతిని గురించి తెలుసుకుందాం.

చిత్రగుప్త పూజ ఎప్పుడంటే

పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం కార్తీక మాసంలోని శుక్ల పక్షం రెండవ రోజున చిత్రగుప్త పూజను జరుపుకుంటారు. ఈ సంవత్సరం ఈ పండుగ జరుపుకునే తిథి నవంబర్ 14, మంగళవారం రోజున మధ్యాహ్నం 02:36 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు నవంబర్ 15వ తేదీ మధ్యాహ్నం 01:47 గంటలకు ముగుస్తుంది. ఈ తిధి ఉన్న రోజుల్లో రాహుకాలం తప్ప ఏ శుభ సమయంలోనైనా చిత్రగుప్తుని పూజించవచ్చు.

చిత్రగుప్త పూజకు అనుకూలమైన సమయం

ఉదయం ముహూర్తం – 10.48 నుంచి 12.13 వరకు

ఇవి కూడా చదవండి

అభిజిత్ ముహూర్తం – 11.50 నుంచి 12.36 వరకు

అమృత కాల ముహూర్తం – సాయంత్రం 05.00 నుంచి 06.36 వరకు

రాహుకాల సమయం – మధ్యాహ్నం 03.03 నుండి 04.28 వరకు

చిత్రగుప్త పూజ విధానం

చిత్రగుప్త పూజ రోజున.. తెల్లవారు జామున నిద్రలేచి స్నానం చేసి చిత్రగుప్తుడు, యమరాజుల చిత్రపటాన్ని ఒక వేదికపై ఉంచి, ఆచారాల ప్రకారం పుష్పాలు, అక్షతలతో పూజించాలి. నైవేద్యాన్ని స్వామివారికి సమర్పించాలి. తరువాత.. సాదా కాగితంపై  ఆవు నెయ్యి, కుంకుమ, పసుపు తో స్వస్తిక చిహ్నాన్నివేయాలి.. ఆ తరువాత పేరు, చిరునామా, తేదీ , సంవత్సర ఖర్చుల లెక్కలు వ్రాసి, కాగితాన్ని మడిచి దేవుని పాదాల వద్ద సమర్పించండి. అదేవిధంగా తమ సంపద, వంశ వృద్ధి పెరగడానికి భగవంతుని నుండి ఆశీర్వాదం పొందాలి. చివరగా చిత్రగుప్తునికి ఆరతి ఇవ్వాలి.

చిత్రగుప్త పూజ ప్రాముఖ్యత

మహిళలు, వ్యాపారానికి సంబంధించిన వ్యక్తులకు చిత్రగుప్త పూజకు చాలా ప్రాముఖ్యత ఇస్తారు.  బ్రహ్మ దేవుడి శరీరం నుంచి చిత్రగుప్తుడు జన్మించాడని నమ్ముతారు. అందుకే కాయస్థ సమాజం చిత్రగుప్తుడిని తమ ఆరాధ్య దైవంగా భావిస్తారు. చిత్రగుప్తుని భక్తితో పూజించడం వల్ల వ్యాపార అభివృద్ధి, తెలివితేటలు, జ్ఞానం అభివృద్ధి చెందుతుందని విశ్వాసం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు