వేసవి సెలవులు కావడంతో తిరుమల తిరుపతి క్షేత్రానికి వెళ్తున్న భక్తులకు అలెర్ట్.. తిరుమలలో మరోసారి చిరుత కలకలం సృష్టించింది. శ్రీవారి దర్శనానికి తిరుపతి నుంచి తిరుమల క్షేత్రానికి వెళ్ళే భక్తులకు ఘాట్ రోడ్డుమీద చిరుత కనిపించింది. ఈ రోజు తెల్లవారు జామున తిరుమలకు కొందరు భక్తులు కారులో వెళ్తున్న సమయంలో ఆ కారుకు చిరుత పులి అడ్డుగా వచ్చింది. ఈ సంఘటనకు సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. దీంతో భక్తుల్లో భయాందోళనలు నెలకొన్నాయి.
మరోవైపు సెలవుల కారణంగా తిరుమల క్షేత్రంలో భారీ సంఖ్యలో భక్తుల రద్దీ నెలకొంది. స్వామివారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. కంపార్ట్మెంట్స్ లో ఎదురు చూస్తున్నారు. అదే సమయంలో తిరుమల తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రం వద్ద భక్తుల రద్దీ నెలకొంది. అన్న ప్రసాదం తీసుకోవడానికి భక్తులు లోపలికి ప్రవేశించడానికి సుమారుగా గంట సమయం పడుతుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..