Chinna Jeeyar Swamy: సమతామూర్తి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవానికి కేంద్ర మంత్రి భూపేందర్‌ యాదవ్‌ను ఆహ్వానించిన చిన్నజీయర్ స్వామి

|

Sep 18, 2021 | 5:39 AM

Statue of Equality: రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ శివారు శంషాబాద్ ముచ్చింతల్‌లో అతిపెద్ద సమతామూర్తి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవానికి చిన్నజీయర్ స్వామి ఆహ్వానాలు అందిస్తున్నారు. ఇప్పటికే

Chinna Jeeyar Swamy: సమతామూర్తి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవానికి కేంద్ర మంత్రి భూపేందర్‌ యాదవ్‌ను ఆహ్వానించిన చిన్నజీయర్ స్వామి
Chinna Jeeyar Swamy
Follow us on

Statue of Equality: రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ శివారు శంషాబాద్ ముచ్చింతల్‌లో అతిపెద్ద సమతామూర్తి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవానికి చిన్నజీయర్ స్వామి ఆహ్వానాలు అందిస్తున్నారు. ఇప్పటికే చిన్నజీయర్ స్వామి ముచ్చింతల్‌లో అతిపెద్ద సమతామూర్తి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ బృహత్క్యార్యానికి రావాలంటూ.. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు, భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. చిన్నజీయర్ స్వామీజీ వెంట మై హోమ్ గ్రూప్‌ అధినేత డాక్టర్‌ జూపల్లి రామేశ్వరరావు సైతం ఉన్నారు. దీనిలో భాగంగా.. కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్‌ను కూడా చిన్నజీయర్ స్వామీజీ, మై హోమ్ గ్రూప్‌ అధినేత డాక్టర్‌ జూపల్లి రామేశ్వరరావు ఆహ్వానించారు. కార్మిక, ఉపాధి, పర్యావరణం శాఖ మంత్రి భూపేందర్ యాదవ్‌ను శుక్రవారం కలిసి సమతామూర్తి విగ్రహ ప్రతిష్టాపనకు రావాలని చిన్నజీయర్ స్వామీజీ, డాక్టర్‌ జూపల్లి రామేశ్వరరావు ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయనతో కొంత సేపు మాట్లాడారు.

హైదరాబాద్ శివారు ముచ్చింతల్‌లోని చిన్నజీయర్‌ స్వామి ఆశ్రమంలో 200 ఎకరాల్లో వేయి కోట్లతో భగవద్రామానుజుల 216 అడుగుల విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. ఈ మహోత్సవ ఘట్టానికి దేశంలోని పలువురు ప్రముఖులను చినజీయర్‌ స్వామి స్వయంగా అహ్వానిస్తున్నారు. ‘స్టాట్యూ ఆఫ్‌ ఈక్వాలిటీ’కి నిలువెత్తు నిదర్శనమైన సమతామూర్తి విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలు 2022 ఫిబ్రవరి 2 నుంచి 14వరకు కార్యక్రమాలు జరుగుతాయి. 1 వెయ్యి 35 హోమ గుండాలతో ప్రత్యేక యాగం నిర్వహించనున్నారు.

సమతా మూర్తి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి సంబంధించి మరిన్ని వివరాల కోసం మీరు సంప్రదించాల్సిన ఫోన్ నెం.+91 790 14 2 2022, వెబ్‌సైట్ Statueofequality.org, ఈ-మెయిల్ Srs.samaroham@statueofequality.org

Also Read:

సమతామూర్తి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవానికి సీజేఐ ఎన్వీ రమణను ఆహ్వానించిన చిన్నజీయర్ స్వామి

DGP Mahender Reddy: అసలు ఆ అనుమానాలే అక్కర్లేదు.. రేపిస్ట్ రాజు మృతిపై డీజీపీ కీలక వ్యాఖ్యలు