Ratha Saptami 2022: ఈ సంవత్సరం రథ సప్తమి పండుగ మాఘ శుక్ల సప్తమి ఫిబ్రవరి 8 మంగళవారం రోజున జరుపుకోనున్నారు. సూర్య జయంతి పేరుతో పాటు ఈ రోజును అచల సప్తమి అని కూడా అంటారు . రథ సప్తమి రోజున భక్తులు సూర్య భగవానుడిని భక్తి శ్రద్దలతో నియమ నిష్టలతో పూజిస్తారు, తద్వారా భగవంతుడు సంతోషిస్తాడని ఆశీర్వాదాలను అందిస్తాడని భక్తుల నమ్మకం. ఈ రోజున, పూజ సమయంలో భక్తులు కోరికలు నెరవేరడం కోసం సూర్య మంత్రాలను జపిస్తే , ఫలితం లభిస్తుంది. ఈ రోజు మంత్రాలను పఠించడం వల్ల మీకు ఆరోగ్యం, సంతానం, ఆనందం, ధన ధాన్యాలు లభిస్తాయి. రథసప్తమి నాడు సూర్య భగవానుడి ని ప్రసన్నం చేసుకునే ప్రభావవంతమైన మంత్రాల గురించి తెలుసుకుందాం-
విశేష ఫలితాలను ఇచ్చే సూర్య మంత్రం
1. ఆరోగ్యం కోసం మంత్రం
ఓం నమః: సూర్యాయ శాంతాయ సర్వరోగ నివారిణి. ఆయురారోగ్య మైశ్వర్యం దేహి దేవ: జగత్పతే.
2. సూర్య బీజ మంత్రం
ఓం, హ్రాం, హ్రీం, హ్రోం, సః, సుర్యాయ నమః
3. పుత్రుని పొందుటకు సూర్య మంత్రము
ఓం భాస్కరాయ విద్మహే మహాద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్య: ప్రచోదయాత్
4. కోరికల నెరవేర్పు సూర్య మంత్రం
ఓం హీం హీం సహస్ర కిరణాయ మనోవాచింత ఫలం దేహీ దేహీ స్వాహా ||
5. ఓం హ్రీం ఘృణి: సూర్య ఆదిత్య: క్లీన్ ఓం
6. ఓం హ్రీం హ్రీం సూర్యాయ నమః
7. ఏహి సూర్య సహస్రాంశో తేజోరాశే జగత్పతే ।
అనుకంపయ మాం భక్త్యా గృహాణార్ఘ్యం దివాకర ॥
సూర్యారాధన ప్రాముఖ్యత:
రథ సప్తమి రోజున తెల్లవారుజామున లేచి తలస్నానం చేసిన తర్వాత సూర్యభగవానుని భక్తితో, విశ్వాసంతో పూజించాలి. సూర్యభగవానుని ఆరాధించడం వలన అన్ని రకాల శారీరక వ్యాధులు తొలగిపోతాయని, ఆయురారోగ్యాలు కలుగుతాయని నమ్మకం. అంతేకాదు తండ్రితో సంబంధాలు సరిగా లేని సంతానం రథ సప్తమిరోజున సూర్యభగవానుని ఆరాధిస్తే మంచి రిలేషన్ ఏర్పడుతుందని పెద్దల నమ్మకం. ఎవరి జతకంలోనైనా సూర్యుడు బలమైన స్థానంలో ఉంటే.. ఆ వ్యక్తులు సమాజంలో కీర్తి, ప్రతిష్టలు పొందుతారు. అంతేకాదు ఎప్పుడూ విజయాన్ని సొంతం చేసుకుంటారు. తాను పని చేసే రంగంలో ప్రతి ఒక్కరిని ప్రేమిస్తాడు.
రథసప్తమిని రోజు పూజా విధానం:
ఈ రోజున ఉదయం స్నానం చేసి ముందుగా సూర్యోదయ సమయంలో సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించండి.ఈ నీటిలో కొన్ని గంగాజలం, ఎర్రటి పువ్వులు మొదలైనవి వేయండి. దీని తరువాత, సూర్య భగవానునికి నెయ్యి దీపం , ఎర్రటి పువ్వులు, కర్పూరం ,ధూపంతో పూజించాలి. ఉపవాస దీక్షను చేపట్టి.. తమను బాధల నుండి విముక్తి చేయమని సూర్య భగవానుడిని ప్రార్థించాలి.
(ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలు , నమ్మకంపై ఆధారపడి ఉంటుంది, దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. సాధారణ ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)
Also Read: పెన్సిల్‌తో గీసిన ఆ బొమ్మ ఖరీదు 74 కోట్లు.. దీని స్పెషాలిటీ ఏమిటంటే..