Lunar Eclipse: రేపే చంద్రగ్రహణం.. గర్భిణీలు గుర్తుంచుకోవలసిన ఈ 4 విషయాలు అతి ముఖ్యం..! లేకపోతే ప్రమాదమే!

|

May 04, 2023 | 7:27 PM

చంద్రగ్రహణం సమయంలో అన్ని రకాల శుభకార్యాలు, పూజలు-పారాయణాలు, తినడం-తాగడం, నిద్రించడం కూడా అశుభకరమైనదిగా పరిగణించబడుతుంది. అందువల్ల ఈ పనులన్ని నిషేధించబడ్డాయి. ముఖ్యంగా గర్భిణీలు గ్రహణ సమయంలో కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలని, అలాగే కొన్ని పనులను పొరపాటున కూడా చేయకుండా ఉండాలని సూచించారు.

Lunar Eclipse: రేపే చంద్రగ్రహణం.. గర్భిణీలు గుర్తుంచుకోవలసిన ఈ 4 విషయాలు అతి ముఖ్యం..! లేకపోతే ప్రమాదమే!
Chandra Grahan Pregnancy Ef
Follow us on

2023 సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం మే5 శుక్రవారం రోజున ఏర్పడనుంది. అంతకుముందు సంవత్సరంలో(2022) మొదటి సూర్యగ్రహణం ఏప్రిల్ 20న సంభవించింది. అయితే, జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈ ఏడాది ఏర్పడబోయే తొలి చంద్ర గ్రహణం ఎంతో ప్రత్యేకమైనదిగా చెబుతున్నారు. ఇలాంటిది 130 ఏళ్ల తర్వాత వైశాఖ పూర్ణిమ రోజున ఈ గ్రహణం ఏర్పడుతుండటంతో.. చాలా ప్రత్యేకం అంటున్నారు పండితులు. మే 5న అనగా శుక్రవారం రాత్రి దాదాపు 8:45 గంటలకు గ్రహణం ప్రారంభమవుతుంది. అర్థరాత్రి 1:00 గంటకు ముగుస్తుంది. ఇక గ్రహణం ప్రారంభం కావడానికి 9 గంటల ముందు నుంచి సూతకం అనగా అశుభ గడియలు ప్రారంభమై గ్రహణం ముగియడంతో ముగుస్తాయి. అయితే ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం అనేక విధాలుగా ప్రత్యేకంగా ఉండబోతోంది. చంద్రుడు లోతైన తులారాశిలో ఉంటాడు. దీనితో పాటు బుద్ధ పూర్ణిమ కూడా చంద్రగ్రహణం రోజునే గజలక్ష్మి రాజయోగ ప్రభావం కూడా ఈ రోజున ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, చంద్రగ్రహణానికి ముందే గజలక్ష్మి రాజయోగం ఏర్పడింది. దీని ప్రభావం గ్రహణ సమయంలో కూడా ఉంటుంది.

మత విశ్వాసాల ప్రకారం.. చంద్రగ్రహణం సమయంలో అన్ని రకాల శుభకార్యాలు, పూజలు-పారాయణాలు, తినడం-తాగడం, నిద్రించడం కూడా అశుభకరమైనదిగా పరిగణించబడుతుంది. అందువల్ల ఈ పనులన్ని నిషేధించబడ్డాయి. ముఖ్యంగా గర్భిణీలు గ్రహణ సమయంలో కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలని, అలాగే కొన్ని పనులను పొరపాటున కూడా చేయకుండా ఉండాలని సూచించారు.

గ్రహణం సంభవించే సమయంలో గర్భిణీలు ఒత్తిడి లేకుండా ఉండటానికి వారికిష్టమైన దైవాన్ని తలచుకోవాలి. మంత్రాలు, భజనలను జపిస్తూ ఉండాలి. అలాగే గ్రహణం సమయంలో మీ మనసులో ప్రతికూల ఆలోచనలు రాకుండా చూసుకోవాలి. అలానే గ్రహణం సమయంలోగాయత్రీ మంత్రం, మహామృత్యుంజయ మంత్రం, హనుమాన్‌ చాలీసా పఠించాలి. గ్రహణ కాలంలో ఇతరులతో వాదోపవాదాలు, వాదనలకు దిగకుండా ఉండాలి. మత విశ్వాసాల ప్రకారం, గర్భిణీ స్త్రీలు చంద్రగ్రహణం లేదా సూర్యగ్రహణం సమయంలో పదునైన వస్తువులను ఉపయోగించకూడదు. గ్రహణం ప్రతికూల ప్రభావాలు తల్లి, బిడ్డపై కనిపిస్తాయని చెబుతారు.

ఇవి కూడా చదవండి

మత విశ్వాసాల ప్రకారం, చంద్రగ్రహణం సమయంలో నిద్రకు దూరంగా ఉండాలి. గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా గ్రహణ సమయంలో నిద్రపోకూడదని చెబుతారు. గ్రహణం సమయంలో నిద్రించడం వల్ల పుట్టబోయే బిడ్డ మెదడుపై ప్రతికూల ప్రభావం పడుతుందని అంటున్నారు.

మత విశ్వాసాల ప్రకారం, గ్రహణం ముగిసిన తర్వాత గర్భిణీలు తమ స్నానపు నీటిలో గంగాజలం లేదా ఏదైనా పవిత్ర నదిలోని నీటిని కలిపి స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల బిడ్డకు, తల్లికి గ్రహణ దోషం తొలగిపోతుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..