Chandra Grahan 2022: కొత్త ఏడాదిలో ఏర్పడే చంద్రగ్రహణాలు.. సమయం, తేదీ సహా పూర్తి వివరాలు..

|

Dec 21, 2021 | 11:27 AM

Chandra Grahan 2022: 2021 సంవత్సరానికి గుడ్ బై చెప్పేసి.. కొత్త సంవత్సరం 2022 కి స్వాగతం చెప్పడానికి రెడీ అవుతున్నాం.. నూతన సంవత్సరం ప్రతి ఒక్కరికీ సంపద,  శ్రేయస్సును..

Chandra Grahan 2022: కొత్త ఏడాదిలో ఏర్పడే చంద్రగ్రహణాలు.. సమయం, తేదీ సహా పూర్తి వివరాలు..
Chandra Grahan 2022
Follow us on

Chandra Grahan 2022: 2021 సంవత్సరానికి గుడ్ బై చెప్పేసి.. కొత్త సంవత్సరం 2022 కి స్వాగతం చెప్పడానికి రెడీ అవుతున్నాం.. నూతన సంవత్సరం ప్రతి ఒక్కరికీ సంపద,  శ్రేయస్సును తీసుకురావాలని కోరుకుంటున్నాం. కొత్త ఏడాది 2022 లో రెండు సూర్య గ్రహణాలు, రెండు చంద్ర గ్రహణాలు ఏర్పడనున్నాడని తెలుస్తోంది. అయితే చంద్రగ్రహణం ఎలా ఏర్పడుతుందంటే..  సూర్యుడు, భూమి , చంద్రుడు ఒక సరళ రేఖలో  వచ్చినప్పుడు భూమి యొక్క నీడ  చంద్రుడిని కవర్ చేస్తుంది. అప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది.

మూడు రకాల చంద్ర గ్రహణాలు ఉన్నాయి.. సంపూర్ణ చంద్రగ్రహణం, పాక్షిక చంద్రగ్రహణం,పెనంబ్రల్ చంద్రగ్రహణం.  భూమి నీడ చంద్రుడిని పూర్తిగా ఆవరిస్తే దానిని సంపూర్ణ చంద్రగ్రహణం అంటారు. ఈ సమయంలో చంద్రుడు పూర్తిగా ఎర్రగా కనిపిస్తాడు.  ఇక చంద్రుడు , సూర్యుని మధ్య భూమి వచ్చినప్పుడు.. భూమి  నీడ చంద్రునిపై  కొంత భాగంపై పడినప్పుడు ఏర్పడే గ్రహణాన్ని పాక్షిక చంద్రగ్రహణం అంటారు.

పెనంబ్రల్ చంద్రగ్రహణంలో, సూర్యుడు, చంద్రుడు, భూమి సరళ రేఖలో లేనప్పుడు సూర్యు చంద్రుడుల మధ్యకు భూమి వస్తుంది.

2022 సంవత్సరం రెండు చంద్రగ్రహణాలు ఏర్పడనున్నాయని తెలుస్తోంది. ఆ చంద్రగ్రహణం సమయం, తేదీని తెలుసుకుందాం..

మొదటి చంద్ర గ్రహణం
మొదటి చంద్రగ్రహణం 16 మే 2022 సోమవారం ఏర్పడనుంది. ఇది సంపూర్ణ చంద్రగ్రహణం. సోమవారం ఉదయం 7.02 నుండి మధ్యాహ్నం 12.20 గంటల వరకు చంద్రగ్రహణం కొనసాగుతుంది. ఈ మొదటి చంద్రగ్రహణం దక్షిణ అమెరికా, పసిఫిక్, దక్షిణ ,పశ్చిమ ఐరోపా, దక్షిణ/పశ్చిమ ఆసియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, అంటార్కిటికా సహా భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో కనిపిస్తుంది. సూత కాలం చంద్రగ్రహణానికి 9 గంటల ముందు ప్రారంభమవుతుంది.. చంద్రగ్రహణం ముగిసే సమయతో సూత కాలం ముగుస్తుంది.

రెండవ చంద్ర గ్రహణం

2022లో రెండవ చంద్రగ్రహణం 8 నవంబర్ 2022 మంగళవారం ఏర్పడనుంది. ఈ గ్రహణం కూడా సంపూర్ణ చంద్రగ్రహణం. మధ్యాహ్నం 13.32 నుండి రాత్రి 7.27 వరకు చంద్రగ్రహణం ఏర్పడే సమయం. రెండవ చంద్ర గ్రహణం ఉత్తర, తూర్పు యూరప్, ఆసియా, భారతదేశం, ఆస్ట్రేలియా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా భాగాలలో కనిపిస్తుంది. ఈ చంద్రగ్రహణ సూత కాలం చంద్రగ్రహణానికి 9 గంటల ముందు ప్రారంభమవుతుంది మరియు దాని ముగింపుతో సూతకాలం ముగుస్తుంది.

Also Read:   నిద్రపోయే సమయంలో ఈ వస్తువులను తల దగ్గర పెట్టుకోకండి.. ఇలా చేస్తే ఆర్ధికంగా కష్టాలు పడే అవకాశం ఉంది..(photo gallery)