చాణక్యనీతి: శత్రువును జయించాలంటే చాణక్య ఈ 3 విషయాలు చెబుతున్నాడు..! ఏంటంటే..?

|

Sep 20, 2021 | 8:54 AM

చాణక్యనీతి: మౌర్యుల కాలంలో ఆచార్య చాణక్య గొప్ప పండితులు. అపర మేధావి. ఆర్థిక శాస్త్రంలో, పాలనా శాస్త్రంలో నిష్టాతులు. ఆయన

చాణక్యనీతి: శత్రువును జయించాలంటే చాణక్య ఈ 3 విషయాలు చెబుతున్నాడు..! ఏంటంటే..?
Chanakya Niti
Follow us on

చాణక్యనీతి: మౌర్యుల కాలంలో ఆచార్య చాణక్య గొప్ప పండితులు. అపర మేధావి. ఆర్థిక శాస్త్రంలో, పాలనా శాస్త్రంలో నిష్టాతులు. ఆయన వ్యూహాలకు తిరుగులేదు. ఆయన ధౌత్యానికి సాటి రాదు. అన్నింటికంటే మించి ఆచార్య చాణక్య మంచి గురువు. ఆయన చాలా సంవత్సరాల పాటు పిల్లలకు ఆర్థిక శాస్త్రాన్ని బోధించారు. ఈ క్రమంలోనే ఆర్థికశాస్త్ర సహా, నైతిక విలువలు, తదితర అంశాలపై అనేక గ్రంథాలు రాశారు. అయితే, ఆచార్య చాణక్య తన ఎథిక్స్ గ్రంథంలో మనిషి జీవితానికి సంబంధించి ఎన్నో కీలక విషయాలను ప్రస్తావించారు.

కట్టు, బొట్టు, నడవడిక, ఆహారం, ఆహార్యం వంటి ప్రతీ అంశంలో మనిషి ఎలా ఉండాలి.. ఎలా ఉండకూడదు.. అని కూలంకశంగా వివరించారు. అందుకే.. ఆయన చూపిన మార్గాలను తెలుసుకునేందుకు నేటికీ ప్రజలు ఆసక్తి కనబరుస్తుంటారు. నీతి శాస్త్రంలో ఆయన రాసిన అంశాలను అనుసరించడం ద్వారా ఎంతో మంది విజయతీరాలకు చేరారు కూడా. చాణక్య శత్రువును తక్కువగా అంచనా వేస్తే ఆ వ్యక్తి అప్పటికే యుద్ధంలో ఓడిపోయాడని అర్థం. ఎందుకంటే శత్రువుపై విజయం సాధించాలంటే కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకోవాలని చెబుతున్నాడు.

1. శత్రువు ప్రతి కదలికను గమనించండి
ఆచార్య చాణక్యుడు శత్రువును గెలవడానికి అతని బలహీనత తెలుసుకోవాలని సూచించారు. మీ శత్రువు చేసే పనులను నిరంతరం గమనించాలన్నాడు. అప్పుడే అతడిని ఏ విధంగా ఓడించాలనే ఒక నిర్ణయానికి వస్తారని చెప్పాడు.

2. శత్రువు బలంగా ఉంటే..
మీ శత్రువు బలంగా ఉంటే మీరు తెలివితేటలతో అతడిని ఓడించాలని సూచించాడు. ఒకవేళ శత్రువు కంటే మీరు బలంగా ఉంటే ఆ విషయం దాచిపెట్టి మీరు అతడిని ఓడించాలని సూచించాడు. మీ శ్రేయోభిలాషులతో ప్లాన్ చేసి మంచి వ్యూహం సిద్దం చేసుకోవాలని ఆచార్య చాణక్య చెప్పాడు.

3. శత్రువును తక్కువ అంచనా వేయవద్దు
మీ శత్రువును బలహీనుడిగా భావించే పొరపాటు ఎప్పుడూ చేయవద్దన్నాడు. చాలా మంది తమ శత్రువును బలహీనంగా భావిస్తారు. ఇదే వారు చేసే పెద్ద తప్పు అని ఆచార్య చెప్పాడు. శత్రువు బలహీనత, బలంపై అవగాహన ఉండాలని అన్నాడు. అప్పుడే ఆ వ్యక్తి తన శత్రువుపై ఘనమైన విజయం సాధించగలడని సూచించాడు.

Megastar Chiranjeevi: లవ్ స్టోరీ ప్రీ రిలీజ్ ఈవెంట్‏లో అమీర్ ఖాన్ పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు(వీడియో)

Rajinder Pal Singh Bhatia: మాజీ మంత్రి, బీజేపీ నేత భాటియా ఆత్మహత్య.. ఇంట్లో ఉరి వేసుకుని..

10 ఓవర్లలో 10 పరుగులిచ్చి 8 వికెట్లు తీసిన ఘనుడు..! ఐపీఎల్‌లో ఏ టీం తరపున ఆడుతున్నాడో తెలుసా..?