చాణక్యుడు(Acharya Chanakya) చెప్పినట్లు డబ్బు సంపాధించాలనే కోరిక ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అయితే ఈ కల అందరికీ నెరవేరదు. కొందరు వ్యక్తులు మాత్రమే సంపదను సృష్టిస్తారు. లక్ష్మి దేవి ఆశీర్వాదం ఎవరికైతే ఉంటుందో వారి వద్ద డబ్బు నిలుస్తుందన్నది ఓ నమ్మకం. ఇదే విషయాన్ని ఆచార్య చాణక్యుడు తన కౌటిల్య అర్ధశాస్త్రంలో చెప్పారు. కష్టపడి పనిచేయడం, జ్ఞానం, కష్టపడి పని చేయడంలో కొన్ని నియమాలను పాటించడం వల్ల లక్ష్మీ దేవి సంతోషిస్తుందని చాణక్యుడు పేర్కొన్నాడు. జీవితంలో లక్ష్మీ దేవి అనుగ్రహం వల్ల జీవితం సరళంగా, సులభంగా ఉంటుంది. లక్ష్మీ దేవి అనుగ్రహం ఉంటే ఆనందం, శ్రేయస్సు కారకంగా వారి అభివృద్ధిలో ఎలాంటి అడ్డంకులు ఉండవని చాణక్యుడు తన గ్రంధంలో వెల్లడించాడు. దీంతో పాటు సమాజంలో గౌరవం కూడా పెరుగుతుందని తెలిపాడు. అయితే మనం సంపాధించే డబ్బు మన వద్ద స్థిరంగా ఉండాలంటే కొన్ని విషయాలు ఖచ్చితంగా తెలిసి ఉండాలని చాణక్యుడు తెలిపాడు.. అవేటోం ఓ సారి తెలుసుకుందాం..
పదవిని, ప్రతిష్టను దుర్వినియోగం చేయవద్దు- పదవి, పలుకుబడిని ఉపయోగించి బలహీనులను వేధించే వారు, వారిని అవమానించి, వారి హక్కులను లాగేసుకునేవారి వద్ద లక్ష్మీ దేవి అస్సలు నిలిచి ఉండాదని చాణక్యుడు తన గ్రంధంలో వెల్లడించారు. లక్ష్మీ దేవికి అలాంటి వాళ్ళంటే అస్సలు ఇష్టం ఉండదు. తరువాత, వారు ఇబ్బందులను, వైఫల్యాన్ని మాత్రమే పొందుతారు.
డబ్బు కోసం అత్యాశ పడకండి- చాణక్య నీతి ప్రకారం, ఏ వ్యక్తి ఇతరుల డబ్బు కోసం అత్యాశతో ఉండకూడదు. జీవితంలో డబ్బు కష్టపడితేనే వస్తుంది. కష్టపడని డబ్బు ఎక్కువ కాలం నిలవదు. ఇలా ఆర్జించే డబ్బు ఎప్పటికీ సంతృప్తి ఇవ్వదు. దురాశతో సంపాధించేవారిలో కూడా అనేక లోపాలు ఉంటాయని వెల్లడిచారు. అత్యాశ కలిగిన వారికి లక్ష్మీ అనుగ్రహం లభించదు.
వ్యక్తుల ఎంపికలో జాగ్రత్తగా ఉండండి – చాణక్య నీతి ప్రకారం, తప్పుడు సహవాసం ఎల్లప్పుడూ హాని కలిగిస్తుంది. దీని వల్ల ఇప్పటి వరకు ఎవరికీ ప్రయోజనం లేదు. తప్పుడు అలవాట్లలో ఉన్న వ్యక్తులను లక్ష్మీ దేవి చాలా త్వరగా వదిలివేస్తుంది. అందువల్ల, జీవితంలో విజయం కోసం, తప్పుడు వ్యక్తుల సహవాసాన్ని వెంటనే వదిలివేయాలి. చాణక్య విధానం ప్రకారం, ఒక వ్యక్తి పండితులతో వేదాలపై అవగాహన ఉన్నవారితో , దైవారాధన కలిగిన వ్యక్తులతో సహవాసం చేయాలి..
డబ్బును అనవసరంగా ఖర్చు చేయవద్దు- చాణక్య నీతి ప్రకారం, లక్ష్మీ దేవిని అవమానించకూడదు. లక్ష్మీని గౌరవించని వారితో.. డబ్బు నిలిచివుండుదు. కాబట్టి దానిని పొదుపు చేయడం ద్వారా ఖర్చును తగ్గించుకోవచ్చు.
ఇవి కూడా చదవండి: Hyderabad: హైదరాబాద్‌లో షాకింగ్ ఇన్సిడెంట్.. లక్డీకాపూల్ వద్ద రేంజ్ రోవర్ కారులో మంటలు..