Chanakya Niti: పురుషుల్లో ఈ మూడు లక్షణాలను మహిళలు బాగా లైక్ చేస్తారు.. అవేంటంటే..

|

Sep 11, 2022 | 6:10 AM

Chanakya Niti: ఒక వ్యక్తి నడవడిక, ప్రవర్తన, కదలికల ద్వారా వారి వ్యక్తిత్వాన్ని తెలుసుకోవచ్చు. ప్రతి స్త్రీ తన జీవిత భాగస్వామి మంచి లక్షణాలు కలిగి ఉండాలని కోరుకుంటుంది.

Chanakya Niti: పురుషుల్లో ఈ మూడు లక్షణాలను మహిళలు బాగా లైక్ చేస్తారు.. అవేంటంటే..
Women And Men
Follow us on

Chanakya Niti: ఒక వ్యక్తి నడవడిక, ప్రవర్తన, కదలికల ద్వారా వారి వ్యక్తిత్వాన్ని తెలుసుకోవచ్చు. ప్రతి స్త్రీ తన జీవిత భాగస్వామి మంచి లక్షణాలు కలిగి ఉండాలని కోరుకుంటుంది. జీవితాంతం అతనిని అనుసరించాలని భావిస్తుంటుంది. చాణక్యుడు ప్రకారం.. పురుషులలో కొన్ని లక్షణాలు వారిని ఉత్తమంగా చేస్తాయి. ఆ లక్షలణాలను బట్టి మనిషి ఎలాంటి వాడో ఇట్టే చెప్పేయొచ్చంటారు చాణక్యుడు. చాణక్యుడి ప్రకారం మహాపురుషుని లక్షణాలు ఏంటో ఇవాళ మనం తెలుసుకుందాం. అలాగే, మహిళలు వ్యక్తిలో ఎలాంటి అలవాట్లను ఇష్టపడుతారో కూడా తెలుసుకుందాం..

నిజాయితీ..

సంబంధాలలో నిజాయితీగా ఉండే వ్యక్తి ప్రతిచోటా గౌరవానికి అర్హుడని చాణక్యుడు పేర్కొన్నారు. స్త్రీల పట్ల గొప్ప ఉద్దేశ్యం ఉన్న పురుషులు, వారు తమ భార్యను, స్నేహితురాలిని ఎప్పటికీ మోసం చేయరు. పురుషుల ఈ గుణం స్త్రీలను ఆకర్షిస్తుంది. అలాంటి పురుషులు తమ సంబంధాన్ని బలంగా ఉంచుకోవడానికి నిరంతరం ప్రయత్నాలు చేస్తారు. ఎప్పుడూ అబద్ధాలు చెప్పరు.

ఇవి కూడా చదవండి

ప్రవర్తన..

సంస్కారం, మధురమైన మాటలు, సౌమ్యత వంటి లక్షణాలు పురుషుల నుంచి స్త్రీలు ఆశిస్తారు. అయితే ఈ లక్షణాలు పురుషులలో ఉంటే, అది వారి సత్యాన్ని చూపుతుంది. అలాంటి పురుషులు తమ మధురమైన స్వరంతో ప్రజల హృదయాలను గెలుచుకుంటారు. ఈ లక్షణం మహిళలను బాగా ప్రభావితం చేస్తుంది. ఇతరుల పట్ల పురుషుల ప్రవర్తన వారి మంచి, చెడు మర్యాదలను ప్రతిబింబిస్తుంది.

మంచి వినేవాడు..

ప్రతి స్త్రీ తన జీవిత భాగస్వామి నీడలా తనతో పాటు నిలబడాలని కోరుకుంటుంది. మంచి శ్రోతగా ఆమె చెప్పేది వినాలి. విషయాలు తెలుసుకోవాలి. ఆమె గురించి ఆలోచించాలి. మాట్లాడే శక్తి ఉంటే వినే ధైర్యం కూడా ఉండాలి. ఇది మంచి మనిషికి గుర్తు. ఒక గొప్ప వ్యక్తి తన తప్పులకు క్షమాపణ చెప్పడానికి ఎప్పుడూ వెనుకాడడు.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని పబ్లిష్ చేయడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..