Chanakya Niti: ప్రపంచంలో తెలివైన వ్యక్తికి శత్రువులుండరు ఎందుకంటే వారు ఇలా పనిచేస్తారంటున్న చాణక్య

|

Aug 12, 2021 | 6:08 AM

Chanakya Niti: ఆచార్య చాణుక్యుడు.. తెలివైన వ్యక్తి జీవితంలో ఎదగడానికి.. అద్భుతాలు సృషించడానికి ఏ విధంగా తనను తాను మల్చుకుంటాడో చెప్పారు.. అదే సమయంలో అహం ఉన్న వ్యక్తి జీవితం ఎలా ఉంటుందో చెబుతూ.. దానిని పక్కన..

Chanakya Niti: ప్రపంచంలో తెలివైన వ్యక్తికి శత్రువులుండరు ఎందుకంటే వారు ఇలా పనిచేస్తారంటున్న చాణక్య
Acharya Chanakya
Follow us on

Chanakya Niti: ఆచార్య చాణుక్యుడు.. తెలివైన వ్యక్తి జీవితంలో ఎదగడానికి.. అద్భుతాలు సృషించడానికి ఏ విధంగా తనను తాను మల్చుకుంటాడో చెప్పారు.. అదే సమయంలో అహం ఉన్న వ్యక్తి జీవితం ఎలా ఉంటుందో చెబుతూ.. దానిని పక్కన పెట్టి ఎదగమని సూచించారు. వ్యక్తి యొక్క విద్యా పరమైన విజ్ఞానంతో పాటు ఆచరణాత్మక జ్ఞానానికి కూడా ఆచార్య చాణుక్యుడు అత్యధిక ప్రాధాన్యతనిచ్చారు. ఎవరి కంటే ఎవరూ గొప్పవారు కాదని చెప్పారు. ఇతరుల చేతిలో ధనం ఉంటే మనకు ఉపయోగం ఎలా ఉండదో, అలాగే విజ్ఞానం కూడా పుస్తకాల్లో బంధీ అయితే ఎవరికీ మంచి జరగదన్నారు. తెలివైనవాడు తన తోటివారికి తగిన గౌరవం ఇస్తాడు… జ్ఞానం ఉన్నా దాని వల్ల ఎవరికీ ఎలాంటి ఉపయోగం లేకపోతే అతడు తెలివైన వ్యక్తి కాదని తెలిపారు కౌటిల్యుడు.

ప్రపంచంలో తెలివైన వ్యక్తులకు శత్రువులు ఉన్నారా ఒక్కసారి ఊహించుకోండి. ఓ సాధారణ మనిషికి జీవితంలోని కొన్ని విషయాలపై మాత్రమే నియంత్రణ ఉంటుంది. చాలా విషయాల్లో ఇతరుల సహాయం లేనిది ముందుకు సాగలేడు. అదే తెలివైవాడు కొన్నిసార్లు అనవసరమైన విషయాలను పక్కనబెట్టి ముఖ్యమైన లక్ష్యాలను చేరుకోడానికి ఎలాంటి భేషజాలు లేకుండా పనిచేస్తాడు. ఉత్పాదక విషయాలపై దృష్టి కేంద్రీకరించి వాటి కోసమే శక్తిని వినియోగిస్తాడు.

వ్యక్తులు కొన్ని సందర్భాల్లో తమ అహం, శౌర్యం, ఆత్మగౌరవం, అందం పట్ల ఆకర్షణతో ఆయోమయానికి గురవుతారు. ఇటువంటి సందర్భంలో తనకు అవసరమైంది ఏంటో అవగాహన చేసుకుని సమస్య నుంచి బయటపడటానికి తెలివైన వ్యక్తి ప్రయత్నిస్తాడు.
సమస్యలు ఎదురైనప్పుడు అహాన్ని పక్కనబెట్టి వాటిని పరిష్కరించుకోవాలట.ఏదైనా పని చివరి దశలో ఉన్నప్పుడు ప్రతి అంశానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఆ పని వల్ల ముప్పు తొలగిపోయినా అది ఎందుకు ఎదురయిందో తెలుసుకోవాలి. అనుచిత వ్యాఖ్యలు, అసందర్భ ప్రేలాపనతో విలువైన సమయాన్ని వృథా చేయరాదని సూచించారు చాణక్య

కొందరు ప్రతి అంశాన్ని ప్రతిష్ట‌కు ముడిపెట్టి కాలాన్ని దుర్వినియోగం చేసుకుంటారు. అసలు ఇంతకీ ప్రతిష్ట అంటే ఏంటో తెలుసుకోవాలి. అహానికి మరో రూపమే ఇది కనుక దీన్ని అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని చాణక్య చెప్పారు. ఎందుకంటే అహం వలన ఒరిగేది ఏమీ లేదని.. కనీసం ఒక్క ముద్ద కూడా పెటలేదు కదా అని తెలిపారు .
కనుక ఇటువంటి విషయాలతో కాలయాపన చేస్తూ.. శక్తిని వృథా చేసుకోకుండా .. అద్భుతాలు సృష్టించ‌డానికి ప్రయత్నించమని సూచించారు. తెలివైన వ్యక్తి పెద్ద లక్ష్యాలు ఏర్పరచుకుంటాడు. వాటిపైనే మనసు కేంద్రీకరించి పక్కన జరిగే అనవసరమైన విషయాల గురించి పట్టించుకోడని చెప్పారు చాణక్య.

Also Read:  ఆన్‌లైన్‌లో అమ్మకానికి మామిడాకులు..నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్.. కలికాలం అంటున్న పెద్దలు