
ప్రస్తుత యుగంలో ప్రతి ఒక్కరూ బిజీ బిజీగా జీవితాన్ని గడుపుతున్నారు. తమ సమయాన్ని వృధా చేయడానికి కూడా సమయం ఉండడం లేదు. రోజులో ఇరవై నాలుగు గంటలు ఉన్నప్పటికీ చేయడానికి తగినంత పనులు లేవని కొందరు వ్యక్తిగత, వృత్తి జీవితాన్ని నిర్వహించడానికి తగినంత సమయం లేదని మరికొందరు చెబుతూ ఉంటారు. సమయం లేదని చెప్పేవారికి.. సమయం అవశ్యతను గుర్తించి సమయం అత్యవసరం, ప్రాముఖ్యత ఆధారంగా పనులను అంచనా వేయమంటూ చాణక్యుడు సలహా ఇచ్చాడు. ఎవరైనా ఇలా చేస్తే ఒత్తిడి లేకుండా ఉన్న సమయంలో మీ పనులన్నింటినీ పూర్తి చేయవచ్చు. అప్పుడు ఖచ్చితంగా విజయం మీదే అవుతుందని చాణక్యుడు చెప్పాడు.
సమయం ప్రాముఖ్యత, ఆవశ్యకతను గమనించండి: చాణక్యుడి ప్రకారం అన్ని పనులు ఒకే విధమైన విలువను కలిగి ఉండవు. అందువల్ల పనులను ప్రాధాన్యత బట్టి ఎప్పుడు చేయాలి అనేది నిర్ణయించుకోవాలి. అంతేకాదు సాధ్యమైనంత తక్కువ సమయంలో పనిని పూర్తి చేయడం ముఖ్యం. అత్యవసరం అయిన.. ముఖ్యమైన పనుల మధ్య తేడాను గుర్తించండి. అత్యవసర పనులను వెంటనే పూర్తి చేయాలి. ముఖ్యమైన పనులపై దృష్టి సారించి.. వాటికి సమయాన్ని కేటాయించే వ్యక్తులు తమ లక్ష్యాలను చాలా సులభంగా సాధించగలరు. ప్రయోజనాలు కలిగించే కార్యకలాపాల్లో పాల్గొనడం ద్వారా సమయాన్ని గుర్తించాలని చాణక్యుడు చెప్పాడు.
అవసరమైన పనులను జాబితా చేయండి: చాణక్యుడు చెప్పినట్లుగా చేయవలసిన అన్ని పనులను జాబితాను ముందుగానే సిద్ధం చేయండి. అత్యవసరం, ప్రాముఖ్యత ఆధారంగా పనులను వర్గీకరించండి. ప్రతి పనికి ప్రాధాన్యత ప్రకారం సమయం కేటాయించడం చాలా ముఖ్యం. ఈ పద్ధతి పనిని పూర్తి చేసేటప్పుడు మెరుగైన ఫలితాలను పొందడానికి సహాయపడుతుంది.
ముఖ్యమైన పనులకు ప్రాధాన్యత ఇవ్వండి: పనులకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. ఉత్పాదకత పెరుగుతుంది. అందువలన ముఖ్యమైన పనులపై దృష్టి పెట్టడం ద్వారా మీ దైనందిన జీవితంలో సాఫల్యం, సంతృప్తిని అనుభవించవచ్చు. ఇలా చేస్తే పనులను చేయడానికి తగినంత సమయం లేదు అన్న మాటే రాదు.
సమయ పరిమితిని నిర్ణయించండి: చాణక్య నీతిలో చెప్పినట్లుగా ఏదైనా పనిని పూర్తి చేయడానికి కాల పరిమితిని నిర్ణయించడం ముఖ్యం. ఈ పనిని ఈ రోజే పూర్తి చేయాలనుకుంటే.. మీరు అనుకున్న సమయానికి పనిని పూర్తి చేస్తారు. సమయాన్ని సరిగ్గా నిర్వహిస్తూ .. సమయ పరిమితులను నిర్దేశించుకుని పనిని చేస్తే.. ఎవరికైనా విజయం సొంతం అవుతుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు