AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chanakya Niti: ఈ నలుగురితో నిజాయతీగా స్నేహం చేస్తే.. జీవితాంతం అన్నివిధాలా మీకు తోడుగా ఉంటారంటున్న చాణక్య

Chanakya Niti: ఆచార్య చాణక్యుడు (Acharya Chanakya) తన జీవితంలో ఎదురైన అనుభవాలను నీతి శాస్త్రం(Niti Sastra)గా రచించాడు. ఈ నీతి శాస్త్రం నేటికీ అనుసరణీయం. ఈ చాణక్య నీతిని బాగా చదివి,.

Chanakya Niti: ఈ నలుగురితో నిజాయతీగా స్నేహం చేస్తే.. జీవితాంతం అన్నివిధాలా మీకు తోడుగా ఉంటారంటున్న చాణక్య
Chanakya Niti
Surya Kala
|

Updated on: Mar 10, 2022 | 2:45 PM

Share

Chanakya Niti: ఆచార్య చాణక్యుడు (Acharya Chanakya) తన జీవితంలో ఎదురైన అనుభవాలను నీతి శాస్త్రం(Niti Sastra)గా రచించాడు. ఈ నీతి శాస్త్రం నేటికీ అనుసరణీయం. ఈ  చాణక్య నీతిని బాగా చదివి, అనుసరించినట్లయితే, ఎవరికైనా విజయం తధ్యమని పెద్దల నమ్మకం. ఇందులో మనిషి తన జీవితాన్ని సంతోషంగా, విజయవంతం జీవించడానికి అనేక ఉపయోగకరమైన సూచనలు ఉన్నాయి. మనిషి తనజీవితంలో ఈ నలుగురితో నిజాయతీగా స్నేహం చేస్తే.. ఎప్పటికీ వీరు మిమ్మల్ని మోసం చేయదని చాణక్య చెబుతున్నాడు. నమ్మదగిన ఆ స్నేహితులు ఎవరో ఈరోజు తెలుసుకుందాం..

మనిషి జీవితంలో మొదటి స్నేహితుడు విద్య అని చాణక్య చెప్పారు. మీరు ఇంటి నుండి బయటకి అడుగు పెట్టినప్పుడు, మీ జ్ఞానం ఎల్లప్పుడూ మీతో ఉంటుంది. అంతేకాదు మీ విద్య జ్ఞానం మంచి , చెడుల మధ్య వ్యత్యాసాన్ని చెబుతుందని ఆచార్య చెప్పారు. ఇది మీకు సమాజంలో గౌరవాన్ని ఇస్తుంది. అందువల్ల.. మనిషి వీలైనంత జ్ఞానాన్ని సంపాదించుకోవాలని సూచించాడు చాణక్య.

ఒక వ్యక్తికి  రెండవ నిజమైన స్నేహితుడు అతని భార్య.  భర్త ప్రతి సుఖం , దుఃఖంలో తన భర్తకు మద్దతు ఇస్తుంది మంచి భార్య. భర్త కష్టాలను అధిగమించేలా అన్నివిధాలుగా సహకరిస్తుంది. అంతేకాదు తన కుటుంబం ఆనందం గా ఉండడానికి సుఖ సంతోషలతో ఉంచడానికి ప్రయత్నం చేస్తుంది. భర్త చనిపోయే వరకు ఎట్టిపరిస్థితుల్లోనూ భార్య ఒంటరిగా ఉండడానికి ఇష్టపడదు.

ఓ వ్యక్తికీ నిజమైన ముఖ్యమైన మూడవ స్నేహితుడు ఔషధం. ఔషధం అనారోగ్యంతో ఉన్న వ్యక్తిని మళ్లీ ఆరోగ్యవంతంగా  చేస్తుంది. అనారోగ్యంతో ఉన్న వ్యక్తికీ ఎవరూ సహాయం చేయలేనప్పుడు..  వైద్యం మాత్రమే అతనికి మిత్రుడు

నాల్గవ నిజమైన స్నేహితుడు ఆవ్యక్తి మతం.  తమ మతాన్ని అనుసరిస్తూ.. మంచి పనులు చేయడం ద్వారా పుణ్యాన్ని పొందుతారు. మరణ సమయంలో అన్ని భౌతిక వస్తువులు మిమ్మల్ని విడిచి పెడతాయి. సి చివరికి మనిషి శరీరం కూడా అతనిని విడిచి పెడుతుంది. అయితే వ్యక్తి చేసిన పుణ్యకార్యాలు ఎప్పటికీ అతనితోనే ఉంటాయి. సమాజంలో కూడా, మతపరమైన పనుల వల్ల..వ్యక్తికి గౌరవం లభిస్తుంది. ఆ వ్యక్తి మరణించిన తర్వాత కూడా అతనిని జ్ఞాపకం చేసుకుంటారు. కనుక ధార్మిక పనుల పట్ల ఆసక్తిని పెంచుకొని వీలైనంత వరకు ప్రజలకు మేలు జరిగేలా కృషి చేయమని చాణక్య సూచించారు.

Also Read:

 నిజంగా 15 నిమిషాల్లోపు రోజంతా సరిపడే ఛార్జింగ్ అందించగలదా? మేము కనుగున్నాం.. మీరు నిశ్చింతగా ఉండండి..