Chanakya Niti: జీవితం సాఫీగా సంతోషంగా సాగాలంటే.. చాణుక్యుడు చెప్పిన ఈ విషయాలను పాటించండి..

|

Jan 24, 2022 | 12:46 PM

Chanakya Niti: ఆచార్య చాణక్యుడు (Acharya Chanakya)గొప్ప పండితుడు కనుక అతన్ని కౌటిల్య అని పిలుస్తారు. దౌత్యం, ఆర్థికశాస్త్రం, రాజకీయాలు  వంటి విషయాలపై చాణక్యుడికి..

Chanakya Niti: జీవితం సాఫీగా సంతోషంగా సాగాలంటే.. చాణుక్యుడు చెప్పిన ఈ విషయాలను పాటించండి..
Follow us on

Chanakya Niti: ఆచార్య చాణక్యుడు (Acharya Chanakya)గొప్ప పండితుడు కనుక అతన్ని కౌటిల్య అని పిలుస్తారు. దౌత్యం, ఆర్థికశాస్త్రం, రాజకీయాలు  వంటి విషయాలపై చాణక్యుడికి  మంచి పట్టుఉంది. చాణుక్యుడు రచించిన నీతి శాస్త్రం (Chanakya Niti )నేటి మానవులకు అనేక జీవిత విధానాలను నేర్పుతుంది.  వాటిని ఆచరిస్తే.. ఆ మనిషిజీవితం ఏ కలతలు, కష్టాలు లేకుండా సాఫీగా సాగిపోతుందని పెద్దల నమ్మకం. సంతోషకరమైన జీవితాన్ని గడపవచ్చు. చాణుక్యుడు మనిషి తన జీవితంలో ఇతరులకు కొన్ని చెప్పకూడని విషయాలు ఉన్నాయని అంటున్నాడు. అవి ఇతరులకు చెప్పడం వలన జీవితంలో అవమానాలు, నష్టాలు తప్పవని హెచ్చరిస్తున్నాడు అవి ఏమిటో తెలుసుకుందాం.

కుటుంబంలోని విబేధాలు:
మీ కుటుంబంలో ఎలాంటి విభేదాలు వచ్చినా ఇంటి విషయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరితోనూ చెప్పకూడదు. ఇలా ఇంటి విషయాలను ఎదుటివారితో పంచుకుంటే అవమానాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది. అంతేకాదు అవతలివారు సమయం వచ్చినప్పుడు.. మీ సంబంధంలో వివాదాలను సృష్టించడానికి ఉపయోగించుకోవచ్చు.

వైవాహిక జీవితం గురించిన విషయాలు:
చాణక్య నీతి ప్రకారం, ఒక వ్యక్తి తన వైవాహిక జీవితంలోని విషయాలను ఎవరితోనూ పంచుకోకూడదు. భార్యాభర్తల మధ్య మాటలను వారికే పరిమితం కావాలి. ముఖ్యంగా భార్య భార్తల మధ్య ఏ రకమైన గొడవలు ఏర్పడినా ఈ విషయాన్ని మూడో వ్యక్తితో పంచుకోకూడదు. ఇలా చేయడం వలన భవిష్యత్తులో పరువు, గౌరవం కోల్పోవాల్సి వస్తుంది. అంతేకాదు భార్యాభర్తల సంబంధంలో చీలికలు కూడా ఏర్పడవచ్చు.

ముఖ్యమైన పనులు చేపట్టిన విషయంలో:
చాణక్య నీతి ప్రకారం.. ఎవరినా తన పనికి సంబంధించిన ముఖ్యమైన విషయాలను,ప్రణాళికలను ఇతర వ్యక్తుల వద్ద ప్రస్తావించకూడదు. ఇలా మీ పని విషయంలో మీ ఆలోచనలు ఇతరులతో పంచుకోవడం వలన మీ పనుల్లో ఒకొక్కసారి నష్టాలను చవిచూడవలసి ఉంటుంది. విజయావకాశాలను కూడా ఒకొక్కసారి కోల్పోతారు. అందుకే ఎవరైనా పని చేపట్టి.. అది పూర్తయిన తర్వాతే చెప్పాలి.

బలహీనతలు :
ప్రతి వ్యక్తికి బలం,బలహీనతలు ఉంటాయి. ఎవరినా సరే తమ బలహీనతలను ఇతరుల ముందు ఎప్పుడూ బయటపెట్టవద్దు. అలా చేయడం వలన ఇతరుల దృష్టిలో మీరు బలహీనంగా మారిపోతారు. లేదా ఒకొక్కసారి.. ఆ వ్యక్తులు ఎప్పుడైనా మీ బలహీనతను ఉపయోగించుకోవచ్చు.

ఒక వ్యక్తిలోని మంచి చెడులు:
చాణక్య నీతి ప్రకారం.. ప్రతి వ్యక్తిలో మంచి, చెడు ఉంటాయి. కనుక ఎవరికైనా సరే ఏది మంచి, ఏది చెడు అనే విషయాన్ని సరిగ్గా తెలియజేయాలి. అంతేకాదు ఎదుటివారి మంచి చెడుల గురించి మీ శత్రువుల దగ్గర ఎప్పడు ప్రస్తావించాదు.

బాధను వ్యక్తం చేయవద్దు
చాణక్య నీతి ప్రకారం, .. ఒక వ్యక్తి తన బాధలను ఎవరి ముందు చెప్పకూడదు. దీని వల్ల ప్రజలు మిమ్మల్ని బలహీనులుగా భావిస్తారు. ఇది భవిష్యత్తులో మీ పనికి ఆటంకాలు కూడా కలగవచ్చు.

అవమాన పడినప్పుడు
చాణక్యుడి నీతి ప్రకారం ఎవరైనా ఎక్కడైనా అవమానానికి గురైతే దానిని మీలోనే ఉంచుకోవాలి. ఎవరి ముందు కూడా ప్రస్తావించకూడదు. అలా మీకు జరిగిన అవమానాన్ని ప్రాస్తావిస్తే..ఎదుటివారు అపహాస్యం చేయవచ్చు.

Also Read:

 అనుమానాస్పదస్థితిలో నేల బావిలో శవమైన యువకుడు.. పోలీసుల దర్యాప్తులో సంచలనాలు!