Chanakya Niti: మీరు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ ఐదు విషయాలను ఎదుటివారితో పంచుకోవద్దు అంటున్న చాణక్య..

|

Feb 19, 2022 | 5:37 PM

Chanakya Niti: ఆచార్య చాణక్యుడు (Acharya Chanakya)తన జీవితంలో ఎదురైన అనుభవాలతో నీతి శాస్త్రం(Niti Sastra)గా రచించాడు. ఈ నీటి శాస్త్రం నేటికీ అనుసరణీయం..

Chanakya Niti: మీరు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ ఐదు విషయాలను ఎదుటివారితో పంచుకోవద్దు అంటున్న చాణక్య..
Follow us on

Chanakya Niti: ఆచార్య చాణక్యుడు (Acharya Chanakya)తన జీవితంలో ఎదురైన అనుభవాలతో నీతి శాస్త్రం(Niti Sastra)గా రచించాడు. ఈ నీటి శాస్త్రం నేటికీ అనుసరణీయం. ఇందులో మనిషి తన జీవితాన్ని సంతోషంగా, విజయవంతం జీవించడానికి అనేక ఉపయోగకరమైన సూచనలు ఉన్నాయి. ఈ  చాణక్య నీతిని బాగా చదివి, అనుసరించినట్లయితే, ఎవరికైనా విజయం తధ్యమని పెద్దల నమ్మకం. ఆచార్య చాణుక్యుడు తన నీతి శాస్త్రం ద్వారా పిల్లలకు, పెద్దలకు , పెద్దలకు ఏదో ఒక పాఠాన్ని అందించాడు. అయితే పెద్దలు మనకు ఎప్పుడైనా దుఃఖం, బాధ కలిగితే ఎవరితో నైనా పంచుకుంటే ఉపశమనం అలభిస్తుందని చెబుతారు. కానీ చాణుక్యుడు అలా మీకు కలిగిన దుఃఖం, బాధలు ఎవరితోనూ పంచుకోవద్దని.. మీ బాధను మీకు మాత్రమే పరిమితం చేసుకోలేని.. లేదంటే.. మీరు సమస్యలను కొని తెచ్చుకున్నట్లే అని అంటున్నాడు.. అవి ఏమిటో చూద్దాం..

  1. ఆచార్య చాణక్యుడు చెప్పిన ప్రకారం.. మనిషి సంపద నశించినప్పుడు, మనస్సులో దుఃఖం ఉన్నప్పుడు, భార్య ప్రవర్తన తెలిసినప్పుడు.. ఎదుటి వ్యక్తితో ఎప్పుడూ చర్చించవద్దు. మీరు చెబుతున్నప్పుడు విన్నవారు.. ఎప్పుడైనా మీరు అవమానానికి గురైనప్పుడు మీరు చెప్పిన విషయాలను మీకు చేడు చేసేలా ఉపయోగించవచ్చు.
  2.  డబ్బు ప్రతి మనిషికి మంచి బలాన్ని ఇస్తుందని ఆచార్య చాణుక్యుడు నమ్మకం. అయితే ఎప్పుడైనా మీకు నష్టం కలిగి డబ్బులు పోగొట్టుకుంటే.. దాని గురించి ఎవరికీ చెప్పకండి. ఎందుకంటే మీరు డబ్బులు పోగొట్టుకున్నారని తెలిసిన తర్వాత, మీకు సహాయం చేసే వ్యక్తులు కూడా సహాయం చేయడానికి దూరంగా ఉంటారు.
  3. మీరు బాధలో ఉండి..  మనస్సు విచారంగా ఉన్నప్పటికీ, ఈ విషయాన్ని ఎవరితోనూ ఎప్పుడూ చర్చించకూడదని చాణక్య చెబుతున్నారు. మీ బాధను తెలుసుకున్న తర్వాత అవతలి వారు మీ ముందు ఓదార్పుని వ్యక్తం చేస్తారు.. తరువాత మీ వెనుక మిమ్మల్ని ఎగతాళి చేస్తారు.
  4. ఒకవేళ ఏ వ్యక్తి భార్య ప్రవర్తన చెడ్డది. లేదా ఆమె పాత్ర గురించి తెలుసుకున్నట్లయితే.. మీ భార్య గురించి ఎవరితోనూ చర్చించకండి. ఎటువంటి విషయాన్నీ అయినా మీ మనసులో దాచుకోండి. మీ భార్య గురించి ఎవరితోనైనా చర్చిస్తే.. తర్వాత సమాజంలో తల ఎత్తుకుని తిరగడం  కష్టమవుతుంది.
  5. మీరు ఎక్కడైనా ఎప్పుడైనా ఏ కారణంతో నైనా అవమానానికి గురైతే, ఆ విషయాన్ని ఎవరితోనూ ప్రస్తావించకండి. ఆ అవమానాన్ని మనసులో దాచుకొని.. శాంతిగా నడుచుకోండి. ఇతరులతో చర్చించడం వల్ల మీ గౌరవం పోగొట్టుకున్న వారు అవుతారు.

Also Read:   గడ్డకట్టే చలిలో జనం పరుగులు..‘వరల్డ్స్‌ కోల్డెస్ట్‌ మారథాన్‌’గా గిన్నిస్‌ రికార్డు.. ఎక్కడంటే..