Chanakya Niti: ఆచార్య చాణక్యుడు రచించిన నీతి శాస్త్రం( Niti-Shastra)లో మానవ జీవితంలోని ప్రతి అంశాన్ని ప్రస్తావించాడు. చాణుక్యుడు తన జీవితానుభవంతో చెప్పిన విషయాలను ప్రస్తుత సమాజంలో నేటి జనరేషన్ కు అనుసరణీయం. అలా చాణుక్యుడు చెప్పిన విషయాలను పాటిస్తే.. ఎంతటి కష్టమైనా తేలికగా నివారించుకోవచ్చు. నీతి శాస్త్రంలో సమాజంలోని దాదాపు ప్రతి అంశానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలను ప్రస్తావించారు. ఒక వ్యక్తి జీవితానికి సంబంధించిన అనేక ముఖ్యమైన విషయాలు ఆచార్య చాణక్యుడి ఈ పుస్తకంలో పొందుపరిచారు. మనిషి ఎదుర్కొనే నష్టాలు, వైఫల్యాల గురించి కూడా చెప్పాడు. ఈరోజు వాటి గురించి తెలుసుకుందాం
సమయం ప్రాముఖ్యత:
ఆచార్య చాణక్యుడు ప్రకారం, సమయం ప్రాముఖ్యతను అర్థం చేసుకోని వారు తరచుగా వైఫల్యాలను ఎదుర్కొంటారు. అలాంటివారు తరచుగా కష్టాలను ఎదుర్కోవలసి ఉంటుందని చాణక్యుడు చెప్పాడు. నిజానికి ఒకసారి గడిచిన కాలం తిరిగి రాదు. ప్రతి ఒక్క క్షణం వ్యక్తి ఎదుగుదలకు, స్థిరమైన జీవితానికి విలువైనది. కనుక సమయం విలువ గురించి మనిషి ఎప్పుడూ గుర్తుంచుకోవాలి.
కోపం
ఆచార్య చాణక్యుడు ప్రకారం, కోపం వ్యక్తికి అతిపెద్ద శత్రువు. కోపాన్ని అదుపు చేసుకోలేని వారు నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది. అంతే కాదు, వైఫల్యం అలాంటి వారిని ఇబ్బంది పెడుతుంది. నిజానికి అధిక కోపం ఉన్న వ్యక్తిని ప్రజలు ఇష్టపడరు. అలాగే అలాంటి వారితో కలవడం, స్నేహం చేయడం కూడా ఇష్టపడరు.
అధిక ఖర్చులు
చాణక్యుడు ప్రకారం, మనిషి తన ఆదాయానికి అనుగుణంగా ఖర్చు చేయాలి. అయితే ఎక్కువమంది తమ ఆదాయం కంటే ఎక్కువ ఖర్చు చేయడం ప్రారంభిస్తారు. ఈ అలవాటు వల్ల ఒక్కోసారి ఆర్థిక సంక్షోభ పరిస్థితులను ఎదుర్కోవాల్సి రావచ్చు. అందుకనే డబ్బు పొదుపుగా వాడుకోవాలి. అవసరం చెప్పి రాదని ఎప్పుడైనా కష్టంలో పొడుపు చేసిన డబ్బుని వాడుకోవచ్చు అని చాణుక్యుడు చెప్పాడు. ది.
డబ్బు వృధా
చాణక్య నీతి ప్రకారం, సంపదకు దేవత లక్ష్మీదేవి. లక్ష్మీ దేవి చంచల స్వభావం కలవారు. ఎప్పుడూ ఒకే చోట ఉండదు. కనుక లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల ధనం లభించినట్లయితే, ఆ డబ్బు వృధా చేయకండి. అంతేకాదు డబ్బుని తప్పుడు మార్గంలో ఖర్చు చేస్తే.. ఆర్ధికంగా ఇబ్బందులు పడవచ్చు అని చెప్పారు.
Also Read: