Chanakya Neeti: జీవితంలో ఇలా ఉంటే .. పీకల్లోతు కష్టాల్లో ఉన్నా బయటపడొచ్చు.. చాణక్యుడు ఏమని చెప్పాడంటే..?

|

Nov 24, 2022 | 7:17 AM

ఆచార్య చాణక్యుడు అపరమేథావి.. గొప్ప పండితుడు. ఆయన అత్యంత నైపుణ్యం కలిగిన వ్యూహకర్త.. తత్వవేత్త.. దౌత్యవేత్త, ఆర్థికవేత్త ఇలా అన్ని రంగాల్లో సత్తాచాటారని పేర్కొంటారు. అందుకే నేటికీ ఆయన విధానాలను ప్రజలు అనుసరిస్తుంటారు

Chanakya Neeti: జీవితంలో ఇలా ఉంటే .. పీకల్లోతు కష్టాల్లో ఉన్నా బయటపడొచ్చు.. చాణక్యుడు ఏమని చెప్పాడంటే..?
Chanakya Niti
Follow us on

ఆచార్య చాణక్యుడు అపరమేథావి.. గొప్ప పండితుడు. ఆయన అత్యంత నైపుణ్యం కలిగిన వ్యూహకర్త.. తత్వవేత్త.. దౌత్యవేత్త, ఆర్థికవేత్త ఇలా అన్ని రంగాల్లో సత్తాచాటారని పేర్కొంటారు. అందుకే నేటికీ ఆయన విధానాలను ప్రజలు అనుసరిస్తుంటారు. ఆయన తన విధానాల బలంతో ఒక సాధారణ బాల చంద్రగుప్త మౌర్యుడిని చక్రవర్తిగా చేశారు. ఆయన విధానాలు పూర్వం ఎలా ఉన్నాయో.. నేటికీ అంతే సందర్భోచితంగా ఉన్నాయి. నేటికీ ప్రజలు జీవితంలో ఉన్నతమైన స్థానానికి చేరుకోవడానికి, విజయవంతమైన జీవితాన్ని సాధించడానికి ఈ విధానాలను అనుసరిస్తారు. ఈ విధానాలను అనుసరించడం ద్వారా, ఒక వ్యక్తి ఎటువంటి క్లిష్ట పరిస్థితులనైనా దృఢంగా ఎదుర్కోగలడు. ఈ విధానాలను అనుసరించడం ద్వారా ఒక వ్యక్తి తన జీవితాన్ని మెరుగుపరుచుకోవచ్చు. ఆచార్య చాణక్యుడు నీతి శాస్త్రంలో ఇలాంటి కొన్ని విషయాల గురించి కూడా ప్రత్యేక వివరించాడు. ఒక వ్యక్తి చెడు సమయాల్లో పలు సూత్రాలను అవలంబించడం ద్వారా కష్టాలను కూడా సులభంగా అధిగమించగలడు. వీటిని పాటించడం వల్ల త్వరలోనే మంచి రోజులు వస్తాయని.. సంయమనం పాటించాలని సూచించాడు. ఆ విషయాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం

  1. ధైర్యం – సంయమనం: చాణక్యుడు ప్రకారం.. ధైర్యం సంయమనం కలిగి ఉండటం ద్వారా.. వ్యక్తి ప్రతి కష్టాన్ని దృఢంగా ఎదుర్కోగలడు. చెడు సమయాల్లో ఎల్లప్పుడూ ధైర్యం, స్వీయ నియంత్రణను కొనసాగించాలి. ఈ సమయంలో ఏదైనా నిర్ణయం ధైర్యంగా, తెలివిగా తీసుకోవాలి. చెడు సమయాలు తరచుగా వస్తుంటాయి.. ఇలాంటప్పుడు మనం చేసే ప్రతి పని తప్పుగా మారుతుంది. కావున ఈ సమయంలో ఓపిక పట్టడం మంచిది.
  2. సహనం: ఒక వ్యక్తి చెడు సమయాల్లో సహనంతో ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడకూడదు. భయపడి విజయం సాధించలేరు. చెడు సమయాల్లో ఒక వ్యక్తి తన సహనాన్ని కోల్పోవడం తరచుగా జరుగుతుంది. దుర్భర పరిస్థితుల్లో, చెడు సమయాల్లో సహనం కోల్పోకూడదు. పగలు తర్వాత రాత్రి ఎలా వస్తుందో.. రాత్రికి.. పగలు కూడా అంతే వస్తుంది. అదే విధంగా చెడు తర్వాత మంచి సమయం కూడా వస్తుంది. కావున చెడు సమయాల్లో సహనం కోల్పోకండి.
  3. విశ్వాసం: చాణక్యుడు ప్రకారం.. ఒక వ్యక్తి కష్ట సమయాల్లో విశ్వాసాన్ని కోల్పోకూడదు. ఆత్మవిశ్వాసంతో ఉంటే.. ఎలాంటి పెద్ద కష్టాన్నైనా సులభంగా అధిగమించవచ్చు. మనసులోనే ఓడిపోతే విజయం సాధించలేరు. మనస్సులో గెలుస్తామన్న సంకల్పం ఉంటే.. విజయం వరిస్తుంది. అదే ఓడిపోతామన్న భయం కలిగితే.. ఓటమి కలుగుతుంది. అందుకే ఎప్పుడూ నిన్ను నువ్వు నమ్ము… మీ ఆత్మవిశ్వాసాన్ని ఎప్పటికీ కోల్పోవద్దు.. అంటూ చాణక్య నీతిలో బోధించాడు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి