Chanakya Niti: లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లపుడూ ఉండాలంటే.. ఈ విషయాలను పాటించమంటున్న చాణక్య

|

Mar 21, 2022 | 8:43 AM

Chanakya Niti: ఆచార్య చాణక్యుడు(Acharya Chanakya) తక్షశిల విశ్వవిద్యాలయంలో అధ్యాపకునిగా సేవలందిస్తూ అనేక రచనలు చేశారు. అలా చాణక్యుడు రచించిన పుస్తకాల్లో ఒకటి నీతి శాస్త్రం (Niti Shastra). దీనిలో మానవ..

Chanakya Niti: లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లపుడూ ఉండాలంటే.. ఈ విషయాలను పాటించమంటున్న చాణక్య
Follow us on

Chanakya Niti: ఆచార్య చాణక్యుడు(Acharya Chanakya) తక్షశిల విశ్వవిద్యాలయంలో అధ్యాపకునిగా సేవలందిస్తూ అనేక రచనలు చేశారు. అలా చాణక్యుడు రచించిన పుస్తకాల్లో ఒకటి నీతి శాస్త్రం (Niti Shastra). దీనిలో మానవ జీవితంలోని ప్రతి అంశాన్ని ప్రస్తావించాడు. నీతి శాస్త్రంలో తెలిపిన విషయాలను నేటి జనరేషన్‌కు కూడా స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయి. ఆచార్య బోధనలు, అతని విధానాలను అర్థం చేసుకుంటే.. జీవితంలో ఏర్పడే ఎటువంటి పరిస్థితులను అయినా ఎదుర్కోవచ్చని మన పెద్దల నమ్మకం. జీవితంలో ఆనందం, సంపద ఎల్లప్పుడూ ఉండాలంటే అనేక విషయాల పట్ల శ్రద్ధ వహించాలని చాణుక్యుడు చెప్పాడు. ముఖ్యంగా లక్ష్మీదేవి అనుగ్రహం కుటుంబం పై సాధనా ఉండాలంటే కొన్ని విషయాలను ఎల్లప్పుడూ పాటించాలని సూచించాడు చాణుక్యుడు..

  1. ఆచార్య చాణక్యుడు ప్రకారం, ఎల్లప్పుడూ అవసరమైన వ్యక్తికి సహాయం చేయాలి. ఇతరులకు కష్ట సమయంలో సహాయం చేసేవారు… ఎప్పుడూ డబ్బు సంబంధిత సమస్యలను ఎదుర్కోరు. అలాంటి వ్యక్తిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది.
  2. ఆచార్య చాణక్యుడు ప్రకారం, భార్యాభర్తల మధ్య ప్రేమ ఉంటే, ఆ ఇల్లు ఎల్లప్పుడూ సుఖ సంపదతో నిండి ఉంటుంది. నిత్యం మనస్పర్థల వాతావరణం ఉండే ఇంట్లో లక్ష్మి నివసించదు. లక్ష్మీదేవి సంతోషంగా ఉండే ఇల్లే నివాసం.
  3. ఆచార్య చాణక్యుడు ప్రకారం, శ్రమకు ఎప్పుడూ భయపడకూడదు. కష్టపడి పనిచేసే వారిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. అలాంటి వారు డబ్బుకు సంబంధించిన సమస్యలను ఎదుర్కోవాల్సిన అవసరం లేదు.
  4. ఆచార్య చాణక్యుడు ప్రకారం.. వృధా ఖర్చు చేయకూడదు. ఇలా అనవసర ఖర్చులు చేసేవారి పట్ల లక్ష్మీదేవికి కోపం వస్తుంది. కనుక సంపాదనను బట్టి.. బడ్జెట్ వేసుకుని ఖర్చు పెట్టుకోవాలి. దుబారా ఖర్చులకు దూరంగా ఉండాలి.

Also Read:

HAL School Jobs: హైదరాబాద్‌ హాల్‌ సెకండరీ స్కూల్‌లో ఉద్యోగాలు.. దరఖాస్తులకు రేపే చివరి తేదీ..

Yadadri: ఇవాళ యాదాద్రిలో మహాసంప్రోక్షణకు అంకురార్పణ.. వారం రోజులపాటు పంచకుండాత్మక మహాయాగం