Vastu Tips: ఇంట్లో వాస్తు దోష నివారణకు కర్పూరంతో ఈ చిట్కాను పాటించండి చూడండి..

|

Aug 20, 2023 | 8:10 AM

చేయాల్సిన పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. దీనికి కారణం కొన్ని సార్లు వాస్తు దోషాలు కావచ్చు. ఈ పరిస్థితిలో వాస్తుదోషాన్ని తొలగించాలనుకుంటే.. కర్పూరం గురించి వాస్తుశాస్త్ర సలహా ప్రకారం కొన్ని పద్ధతులు అవలంబించవచ్చు. పూజ సమయంలో చాలా మంది కర్పూరాన్ని ఉపయోగిస్తారు. అయితే ఈ కర్పూరం వాస్తు దోషాలను తొలగించడానికి మాత్రమే కాదు.. కానీ దానితో వాస్తు మార్గం చేయడం గొప్ప ఫలితాలను ఇస్తుంది.

Vastu Tips: ఇంట్లో వాస్తు దోష నివారణకు కర్పూరంతో ఈ చిట్కాను పాటించండి చూడండి..
Camphor Vastu Tips
Follow us on

ఇంట్లో నిరంతరం గందరగోళం ఉంటే.. ఇంటి కార్యకలాపాలకు ఆటంకం ఏర్పడవచ్చు. ఈ సంఘటన ఇంటి సభ్యుల పురోగతికి కూడా ఆటంకం కలిగిస్తుంది. ఇంటి వాతావరణం సరిగా లేకుంటే ఇంటి ఆరోగ్యకర వాతావరణం దెబ్బతింటుంది. వివాదాలు ఏర్పడతాయి. చేయాల్సిన పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. దీనికి కారణం కొన్ని సార్లు వాస్తు దోషాలు కావచ్చు. ఈ పరిస్థితిలో వాస్తుదోషాన్ని తొలగించాలనుకుంటే.. కర్పూరం గురించి వాస్తుశాస్త్ర సలహా ప్రకారం కొన్ని పద్ధతులు అవలంబించవచ్చు. పూజ సమయంలో చాలా మంది కర్పూరాన్ని ఉపయోగిస్తారు. అయితే ఈ కర్పూరం వాస్తు దోషాలను తొలగించడానికి మాత్రమే కాదు.. కానీ దానితో వాస్తు మార్గం చేయడం గొప్ప ఫలితాలను ఇస్తుంది.

ఇంట్లో వాస్తు దోష నివారణకు

ఇంట్లో వాస్తు దోష నివారణకు కర్పూరం సాయం తీసుకోవచ్చు. కర్పూరాన్ని వాస్తు దోషం ఉన్న స్థలంలో పెట్టుకోవాలి. ఈ కర్పూరం కరిగిన తర్వాత మళ్ళీ అక్కడ కర్పూరం పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల వాస్తుదోషం తొలగిపోతుంది.

ఆర్థిక సంక్షోభ నివారణకు

తరచుగా పెరిగిన ఖర్చులు.. తగ్గిన ఆదాయం.. పెరిగిన రుణాలు అనేక ఇబ్బందులకు కారణం అవుతాయి.  ఏదైనా కారణాల వల్లనైనా ఆర్థిక ఇబ్బందులు ఏర్పడితే.. వంటగదిలో వెండి పాత్రను ఉంచి కర్పూరం, లవంగాలను కలిపి వెలిగించండి. ఇలా చేయడం వల్ల ఇంట్లోని సభ్యులకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది.

ఇవి కూడా చదవండి

అదృష్టం కోసం

ఎన్ని సార్లు ప్రయత్న చేసినా ఆ పనిలో సక్సెస్ లభించకపోతే.. అప్పుడు స్నానం చేసే నీటిలో కర్పూరం నూనెతో కలిపి స్నానం చేస్తే జీవితంలో శుభం కలుగుతుంది.

ఇంటిలో శాంతి నెలకొనాలంటే

దేశీ నెయ్యి తీసుకుని అందులో కర్పూరం ముంచి వెలిగించండి. అప్పుడు సువాసన మొత్తం గదిని నింపుతుంది. ఇంట్లో సానుకూల శక్తినిస్తుంది. కుటుంబంలో సంతోషం ఉంటుంది. ఇంటి సభ్యుల ఆరోగ్యం బాగుంటుంది.

వ్యాపార, ఉద్యోగ జీవితంలో విజయం కోసం

అంతేకాదు ఇంట్లో కర్పూరం, లవంగం కలిపి గెలిగించి వంటగదిలో శుభ్రమైన ప్రదేశంలో ఉంచాలి. ఇలా చేస్తే ఇంట్లో మంచి సువాసన వెదజల్లుతుంది. అంతేకాదు  ప్రతి ఒక్కరి జీవితంలో వ్యాపారాభివృద్ధి కనిపిస్తుంది. ఉద్యోగంలో కూడా మంచి ఫలితాలు వస్తాయి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)