Akshaya Tritiya: సనాతన హిందూ ధర్మంలో ప్రతి ఏటా వైశాఖ మాసంలోని శుక్ల పక్ష మూడవ రోజున అక్షయ తృతీయను జరుపుకుంటారు. సంస్కృత భాషలో అక్షయ అంటే ‘శాశ్వతమైన లేదా అంతులేని ఆనందం, విజయం’ అని అర్థం. అక్షయ తృతీయ రోజున హిందువులు శ్రీమహా విష్ణువు, మహాలక్ష్మికి పూజార్చన కార్యక్రమాలు నిర్వహిస్తారు. అలాగే ఈ రోజున ఒక గ్రాము బంగారం అయినా కొనుగోలు చేస్తే మంచిదని వైదిక పండితులు చెబుతున్నారు. అయితే అక్షయ తృతియ రోజున బంగారం మాత్రమే కాదు, మరి కొన్ని వస్తువులను కొనుగోలు చేయడం కూడా శుభప్రదమేనని శాస్త్రాలు చెబుతున్నాయి. మరి హిందూ ధర్మ గ్రంధాల ప్రకారం అక్షయ తృతీయ నాడు ఏయే వస్తువులను కొనుగోలు చేయడం శ్రేయస్కరమో ఇప్పుడు చూద్దాం..
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..