Kalagnanam: బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఈ ఆరు నెలల్లో జరగనున్నవి ఇవే.. ఆకలి చావులు, అక్రమ సంబంధాలు.. వంటివి అనేకం

| Edited By: Ravi Kiran

Aug 12, 2024 | 9:00 PM

ప్రస్తుతం జరిగిన కొన్ని వింతలు, విశేషాలను ... జరుగుతున్న వాటితో సమన్వయ పరచుకుంటూ కాలజ్ఞానంలో చెప్పారని కామెంట్ చేస్తూ ఉంటారు. ఈ నేపధ్యంలో బ్రహ్మంగారు చెప్పిన కొన్ని విషయాలను తెలుసుకోవడంతో పాటు కాలజ్ఞానం ప్రకారం 2024లో జరగనున్న సంఘటలను.. బ్రహ్మం గారు కాలజ్ఞానంలో ఎం చెప్పారు.. అయన చెప్పినట్లు.. కాలజ్ఞానంలో పేర్కొన్నట్లుగా 2024లో జరగనున్నదా.. ఈ రోజు తెలుసుకుందాం..

Kalagnanam: బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఈ ఆరు నెలల్లో జరగనున్నవి ఇవే.. ఆకలి చావులు, అక్రమ సంబంధాలు.. వంటివి అనేకం
Brahmam Gari Kalagnanam
Follow us on

పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి భవిష్యత్ లో జరగనున్న విశేషాలను గురించి ముందే దర్శించి తాళ పత్ర గ్రంథాల్లో భద్రపరిచారు. దీనినే బ్రహ్మంగారి కాలజ్ఞానం అని అంటారు. ప్రస్తుతం జరుగుతున్న కొన్ని వింత ఘటనలు విన్నా.. చూసినా వెంటనే బ్రహ్మం వారు కాలజ్ఞానంలో చెప్పినట్లే జరిగాయి అని అనుకోవడం తరచుగా వింటూనే ఉన్నాం.. అంతేకాదు ప్రస్తుతం జరిగిన కొన్ని వింతలు, విశేషాలను … జరుగుతున్న వాటితో సమన్వయ పరచుకుంటూ కాలజ్ఞానంలో చెప్పారని కామెంట్ చేస్తూ ఉంటారు. ఈ నేపధ్యంలో బ్రహ్మంగారు చెప్పిన కొన్ని విషయాలను తెలుసుకోవడంతో పాటు కాలజ్ఞానం ప్రకారం 2024లో జరగనున్న సంఘటలను.. బ్రహ్మం గారు కాలజ్ఞానంలో ఎం చెప్పారు.. అయన చెప్పినట్లు.. కాలజ్ఞానంలో పేర్కొన్నట్లుగా 2024లో జరగనున్నదా.. ఈ రోజు తెలుసుకుందాం..

బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం 2024 ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటికే కొన్ని విషయాలు జరిగాయి. శ్రీ పోతులూరి వీరబ్రహ్మ స్వామి కాలజ్ఞానం లో చెప్పిన విధంగానే కొన్ని విషయాలు నిజమయ్యాయి. జనసంఖ్య విపరితంగా పెరుగుతుందని.. అడవిలో నివసించే జంతువులు జనావాసాల్లోకి ప్రవేశించి మానవుల ప్రాణాలు తీస్తాయని చెప్పారు. అంతేకాదు ఈ ఏడాది ద్వితియార్ధంలో బ్రహ్మంగారు చెప్పిన విషయాలను తెలుసుకుంటే.. వివాహేత సంబంధాలు విపరీతంగా పెరిగిపోతాయని.. ఈ రిలేషన్స్ వలన హత్యలు జరుగుతాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు.

అంతేకాదు వ్యవయ భూములు బీటలు పడతాయని పంటలు సరిగ్గా పండవని దీంతో తీవ్రమైన ఆహార కొరత ఏర్పడుతుందని చెప్పారు. జనాలు తీవ్ర ఆకలి బాధతో ఇబ్బంది పడతారని వెల్లడించారు బ్రహ్మంగారు. పండ్లు తమ రుచిని కోల్పోతాయి. సైంటిస్టులు రకరకాల ప్రయోగాలూ చేసి మానవాళికి ముప్పు తెస్తారని వెల్లడించారు. రక్తం కక్కుకుని మనుషులు మంచాన పడి మరణిస్తారు. మూగ జీవులు వివిధ కారణాలతో ప్రాణాలు విడుస్తాయని వెల్లడించారు బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో.. అంతేకాదు రాజ్యాధికారం కోసం ఆధిపత్యం కోసం దేశాలు కొట్లాటకు తెర తీస్తారని.. లక్షలాది మంది తీవ్ర ఇబ్బందుల బారిన పడతారని వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.