
నిత్యం శివాలయాలలో శివలింగాలను చూస్తూనే ఉంటాం కాని పురాతన శివలింగాలు అక్కడక్కడ దర్శన మిస్తాయి .. కాని బ్రహ్మ సూత్ర శివలింగాలు చాలా అరుదుగా కనబడతాయి .. వాటికి ఒక చరిత్ర ఉంది .. బ్రహ్మసూత్ర శివలింగాలు దర్శించుకుంచే వెయ్యు శివాలయాలకు వెళితే వచ్చేంత ఫలితం దక్కుందని చరిత్ర చెబుతున్న సత్యం .. అలాంటిదే బ్రహ్మసూత్ర శివలింగాల గురించే ఇక్కడ తెలుసుకుందాం..
కడప జిల్లాలోని ప్రాచీన పుణ్యక్షేత్రమైన పుష్పగిరి దేవస్థానం లో అరుదైన రెండు బ్రహ్మసూత్ర శివలింగాలు వెలుగులోకి వచ్చాయి … ఇవి వల్లూరు మండలంలోని అత్యంత ప్రాచీన దక్షిణ కాశీగా పేరుగాంచింది పుష్పగిరి శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయం. ఇక్కడ గాలి గోపురం పక్కన ఉన్న శ్రీ రంగనాథ స్వామి ఆలయంలో శివలింగానికి , శివాల పల్లిలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయ శివలింగానికి బ్రహ్మ సూత్రాలు ఉంటాయి. ఈ రెండు చోట్ల మాత్రమే ఈ బ్రహ్మసూత్ర శివలింగాలు ఉన్నట్లు స్థల పురాణం చెబుతుంది.
పురాతన శివాలయాలలో శివలింగంపై నిలువు గీతలు దర్శనమిచ్చేవి అంట.. ఇవి చాలా అరుదైన శివలింగాలుగా చెబుతారు. అన్ని శివాలయాలలో శివలింగాలకు ఈ విధమైన గీతాలు ఉండవు. కానీ, ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఈ బ్రహ్మసూత్ర శివలింగాలకు సంబంధించి శివలింగంపై నిలువు గీతలు ఉండి బ్రహ్మసూత్రాలు కలిగి ఉంటాయని స్థల పురాణం. వీటిని వేద సూత్రాలు అని కూడా అంటారు .. వీటిగురించి వ్యాస మహర్షి రచించిన బ్రహ్మ సూత్ర బాదారాయణ కు చెందిన గ్రంధంలో వివరంగా ఉన్నట్లు సమాచారం. అలాగే ఇవే బ్రహ్మ సూత్రాలపై ఆదిశంకరాచార్యులు అనేక వివరణలు కూడా ఇచ్చారనేది నానుడి… ఈ బ్రహ్మ సూత్రాలు అంతర్గత జ్ఞానాన్ని కలిగిస్తాయని దుఃఖం నుంచి విముక్తి పొందుతారని, అంతేకాక విముక్తి పొందిన ఆత్మకు ఈ బ్రహ్మ సూత్రాలే ముక్తిని ప్రసాదిస్తాయని స్థల పురాణం చెబుతుంది.. చరిత్ర చెప్పిన ఆధారం ప్రకారం 555 బ్రహ్మ సూత్రాలు ఉన్నట్లు సమాచారం.
బ్రహ్మసూత్ర శివలింగాలను దర్శిస్తే 1000 శివాలలను దర్శిస్తే వెళితే ఎంత ఫలితం వస్తుంతో అంత పుణ్యం వస్తపందంట .. శివాల పల్లి శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర శివలింగానికి బ్రహ్మసూత్రం మధ్యలో ఒక నిలవాటి స్తూపాకార గీతలుంటే దానికి కొంచెం క్రిందిగా పార్స్వ భాగంలో వంపు తిరిగిన గీతలుంటాయి.. అలాగే శ్రీ గంగాధరేశ్వర ఆలయంలోని బ్రహ్మసూత్ర శివలింగం మధ్యలో స్థూపాకార గీతలుంటే దానికి సమానంగా పార్స్వ భాగాలలో నిలువు రేఖలు అలాగే వాటికి కింది తలంలో వంపు గీతలు ఉంటాయి .. ఇందులో శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి బ్రహ్మోత్సవ శివలింగం 10వ శతాబ్దానికి చెందినదిగా అలాగే శ్రీ గంగాధరేశ్వర ఆలయ బ్రహ్మసూత్ర శివలింగం 13వ శతాబ్దానికి చెందిన స్థల పురాణంచెబుతుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..