AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Body Donation: శరీర దానానికి దధీచి రుషి నేటి మానవులకు ఆదర్శం.. శరీర దానం ఎలా చేయాలి? ప్రక్రియ, ప్రాముఖ్యత పూర్తి వివరాలు

దానం చేయడం అత్యుత్తమ కర్మ అని హిందువుల నమ్మకం. సంతాన హిందూ ధర్మంలో దానానికి విశిష్ట స్థానం ఉంది. అంతేకాదు హిందువులు చేసే కర్మల్లో దానం (దాతృత్వం) ఒక ముఖ్యమైన భాగంగా చేయబడింది. విజ్ఞాన దానం, అన్న దానం, వస్త్ర దానం, భూదానం, గోదానం అనే రకరకాల దానాలున్నాయి. అయితే శరీర దానానికి కూడా విశిష్ట స్థానం ఉందని తెలుసా..! పురాతన కాలంలో శరీరాన్ని దానం చేసిన ఋషి నుంచి నేటి ఆధునిక యుగంలో కూడా శరీర దానం విశిష్టతను తెలియజేస్తూనే ఉన్నాయి.

Body Donation: శరీర దానానికి దధీచి రుషి నేటి మానవులకు ఆదర్శం.. శరీర దానం ఎలా చేయాలి? ప్రక్రియ, ప్రాముఖ్యత పూర్తి వివరాలు
Body Donation
Surya Kala
|

Updated on: Jul 02, 2025 | 11:17 AM

Share

దానం అంటే ఆత్మని శుద్ధి చేయడానికి, మంచి కర్మని సంపాదించడానికి, ఆధ్యాత్మిక మార్గంలో పయనించడానికి కూడా ఒక మార్గం అని నమ్మకం. పురాణాల ప్రకారం పావురాన్ని రక్షించేందుకు శరీర మాంసం కోసి డేగకు ఇచ్చిన శిబి చక్రవర్తి మాత్రమే కాదు ఇంద్రుడికి రాక్షస వధ కోసం ఇంద్రుడి వజ్రాయుధంగా మారేందుకు దధీచి అనే ఋషి తన శరీరాన్ని దానం చేసి నేటికీ చరిత్రలో గొప్ప వ్యక్తులుగా నిలిచిపోయారు. ఇలాంటి వారు శరీర దానానికి ఉన్న సాంస్కృతిక ప్రాముఖ్యతను గురించి తెలియజేస్తున్నారు.

నేటి సమాజంలో శరీర దానం అంటే మరణానంతరం వైద్య కళాశాలలు లేదా పరిశోధనా సంస్థలకు మొత్తం శరీరాన్ని దానం చేయడం. ఇందులో అవయవ దానం అంటే కళ్ళు, కాలేయం, గుండె, కిడ్నీలు వంటి అవయవాలను దానం చేయడమే కాదు.. శరీర నిర్మాణ అధ్యయనాల కోసం మొత్తం శరీరాన్ని కూడా దానం చేయవచ్చు. అయితే ప్రస్తుత కాలంలో శరీర దానం అంటే ఏమిటి? ఎలా చేయాలి? ఎలాంటి శరీరాన్ని వైద్యులు తీసుకుంటారో తెలుసుకుందాం..

వైద్య విద్య: వైద్య విద్యార్థులకు మానవ శరీర నిర్మాణ శాస్త్రాన్ని అధ్యయనం చేయడానికి మానవ మృత దేహాలు అవసరం. ఇది నైపుణ్యం కలిగిన వైద్యులను తయారు చేసి సమాజానికి అందించడంలో సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి

పరిశోధన: అంతేకాదు కొత్త చికిత్సలు, వ్యాధుల నిర్ధారణకు శరీర దానం ముఖ్యమైనది.

సామాజిక సహకారం: శరీర దానం అనేది ఒక దాతృత్వ చర్య. ఇది సమాజం, మానవ జీవన విధానం, విజ్ఞాన శాస్త్రాన్ని ముందుకు తీసుకెళ్లడంలో సహాయపడుతుంది.

శరీర దాన ప్రక్రియ అంటే ఏమిటి? ఎలా చేయాలంటే

రిజిస్ట్రేషన్: ఎవరైనా సరే తమ శరీరాన్ని దానం చేయాలనుకుంటే.. ముందుగా స్థానిక మెడికల్ కాలేజీలను, ఆసుపత్రి లేదా దధీచి దేహ దాన్ సమితి వంటి NGO సంస్థలను సంప్రదించాల్సి ఉంటుంది.

శరీరాన్ని దానం ఇవ్వాలనుకునే వారు ముందు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇందు కోసం ఒక ప్రతిజ్ఞ ఫారమ్ నింపాలి. ఈ పత్రంలో ఇద్దరు సాక్షులు సాక్షులుగా సంతకం పెట్టాలి. ఈ ఇద్దరి సభ్యుల్లో ఒకరు కుటుంబ సభ్యుల్లో ఒకరు అవ్వాలనే నిబంధన తప్పని సరిగా పాటించాలి.

కుటుంబ సమ్మతి: మరణానంతరం శరీర దానం చేయాలనే నిర్ణయం కుటుంబ సభ్యులతో చర్చించాలి. ఎందుకంటే మరణానంతరం శరీరం మెడికల్ కాలేజీ వారు మృత దేహాన్ని తీసుకునేందుకు కుటుంబ సభ్యుల సమ్మతి అవసరం.

మరణం తరువాత: మరణం తరువాత కుటుంబ సభ్యులు.. సంబంధిత సంస్థను సంప్రదించాలి. ఉదాహరణకు దధీచి దేహ దాన్ సమితి (ఢిల్లీ NCR) కు కాల్ చేసి సమాచారం అందించాలి. అనంతరం వారు మృత దేహాన్ని మెడికల్ కాలేజీకి అందించే ఏర్పాట్లు చేస్తారు.

పత్రాలు: మరణ ధృవీకరణ పత్రం, గుర్తింపు కార్డు అవసరం.

అవయవ దానం: అవయవాలను దానం చేయాలనుకుంటే.. మరణించిన వెంటనే (కొన్ని గంటల్లోపు) ఆ ప్రక్రియను నిర్వహించాలి. ముఖ్యంగా బ్రెయిన్ డేడ్ గా నిర్ధారించిన సమయంలో వెంటనే అవయవ దానం చేయడం వలన ఉపయోగం ఉంటుంది.

ఎవరి శరీర దానాన్ని, అవయవదానాన్ని తిరస్కరిస్తారంటే

ఎవరైనా కొని రకాల వ్యాధులతో ఇబ్బంది పడుతుంటే.. అంటే క్యాన్సర్ వ్యాధి వంటివి ఉన్నవారి అవయవ దానాన్ని తిరస్కరించబడవచ్చు.

కొన్ని సంస్థలు పోస్ట్‌మార్టం అవసరమైన వ్యక్తుల మృతదేహాలను దానంగా అంగీకరించవు.

అవయవ దానం గురించి నిర్ణయించుకునే ముందు.. కుటుంబ సభ్యులతో చర్చించి, సమీపంలోని వైద్య సంస్థను సంప్రదించాల్సి ఉంటుంది. అప్పుడు మరణం తర్వాత మృత దేహాన్ని పరిశోధన నిమిత్తం తీసుకుని వెళ్ళే ప్రక్రియ సులభతరం అవుతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)