Bhishma Niti: కలియుగంలో రాజ్యపాలన చేసేవారు ప్రజల కోసం ఏమి చెయ్యాలో చెప్పిన భీష్ముడు

|

Oct 20, 2021 | 7:30 AM

Bhishma Niti: మహాభారతంలో విశిష్టమైన వ్యక్తి అష్టవసువులలో అగ్రగణ్యుడు.. గంగాపుత్రుడవు భీష్ముడు. కౌరవుల పక్షాన కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొని..  గాయపడి..

Bhishma Niti: కలియుగంలో రాజ్యపాలన చేసేవారు ప్రజల కోసం ఏమి చెయ్యాలో చెప్పిన భీష్ముడు
Bhishmaniti
Follow us on

Bhishma Niti: మహాభారతంలో విశిష్టమైన వ్యక్తి అష్టవసువులలో అగ్రగణ్యుడు.. గంగాపుత్రుడవు భీష్ముడు. కౌరవుల పక్షాన కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొని..  గాయపడి అంపశయ్యమీద ఓఘవతీ తీరంలో పడి ఉన్నాడు. ఆ సమయంలో  భీష్ముడు పాండవులకు ఎన్నో నీతికథలను చెప్పాడు. అవన్నీ శాంతిపర్వం అనే అధ్యాయంలో రాజనీతి, గృహస్థు ధర్మం, వ్యక్తిత్వం వంటి అనేక అంశాల మీద కథల కనిపిస్తాయి. ధర్మరాజుకి భీష్ముడు రాజ్య పాలన గురించి.. దండనీతి గురించి చెప్పిన ముఖ్యమైన విషయాలు నేటికీ అనుసరణీయం.. ఈ రోజు భీష్ముడు కలియుగంలో పాలన ఎలా ఉంటుందో కూడా చెప్పాడు భీష్ముడు.. రాజుకు ఉండాల్సిన దండ నీతి గురించి తెలుసుకుందాం..

భీష్ముడు ధర్మరాజుతో మాట్లాడుతూ.. ” ధర్మనందనా .. కృతయుగం నుండి రాజు దండనీతిని ధర్మమైన పద్ధతిలో అమలు చేస్తున్నాడు. రాజు దండనీతిని ధర్మబద్ధంగా ఆచరించడం వలన ధర్మనిరతి పెరుగుతుంది. మనం చేసే కర్మలు సత్ఫలితాలను ఇస్తాయి. ఋతువులు చక్కగా శుభం చేకూరుస్తాయి. ప్రజల జీవితకాలం పెరుగుతుంది. దున్నకుండానే భూమి ఫలసాయం అందిస్తుంది. త్రేతాయుగంలో ధర్మం క్షనిమించి మూడుపాదాలమీద నడిస్తే..  ద్వాపరయుగంలో ధర్మం రెండు పాదాలమీద మాత్రమే నడుస్తుంది. ఇక కలి యుగంలో రాజులో ధర్మాచరణ మీద శ్రద్ధ క్షీణిస్తుంది. ప్రజలలో అధర్మం పెరుగుతుంది. వర్ణాశ్రమధర్మాలు గతి తప్పుతాయి. ఇదంతా కాలగతిలో జరిగే మార్పులను అనుసరించి జరుగుతుంది.. అయితే రాజ్యపాలన చేసేవారు ప్రజలు చేసే తప్పులను జాగ్రత్తగా పశీలించాలి.

రాజు తనని తాను పోగొడుకుంటే అతడికి మదం, అహంకారం, లోభం, దుర్మార్గం ఎక్కువగా ఉంటుందని తెలుసు కోవాలి. అవి లేని వాడు తనను తాను పొగుడుకొనడు. సజ్జనుడైన రాజు నియమ నిబద్ధంగా జీవిస్తాడు. అతడికి పరాక్రమం ఉంటుంది కాని గర్వం ఉండదు. అతడు పరస్త్రీని కోరడు, కోపించడు, తనకంటే కిందవారిని ధనం కొరకు వేధించడు.

రాజుకు వేదవేదాంగ పారతుడైన పురోహితుడు అవసరం.  రాజు సామంత రాజుల నుండి కప్పం, కానుకలు స్వీకరించే పనిని రాజు దయ, కరుణ, చతురత కలిగిన మంత్రులకు అప్పగించాలి. రాజు పన్నుల కొరకు ప్రజలను పీడించడం ఆవు పొదుగును కోయడంతో సమానం. తోటమాలి చెట్ల నుండి పండ్లు కోసినంత సున్నితంగా రాజు ప్రజల నుండి పన్నులను వసూలు చేయాలి. ముందు ప్రజలకు అవసరమైన సౌకార్యాలు, రక్షణ కల్పించిన తరువాత ప్రజల నుండి పన్నులు స్వీకరించాలని .. అది రాజ్యపాలనలో ముఖ్యమైన విషయం అని భీష్ముడు చెప్పాడు.

Also Read:  శ్రీవారి భక్తుల కోసం.. కొత్త క్యాలెండర్.. ఆకట్టుకుంటున్న స్వామివారి ఫోటోలు..