Horoscope Today: ఈరాశి వారికి చాలా అనుకూలం.. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం.. ఈరోజు రాశి ఫలాలు..

భవిష్యత్తుపై చాలా మందికి ఆశలు కాస్త ఎక్కువగానే ఉంటాయి.. వారి జీవితంలో ఏం జరగబోతుందనేది తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు.. ఈ క్రమంలో తమ రోజులో ఏం జరగబోతుంది… ఎలాంటి పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుందనేది ముందుగానే తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటారు..

Horoscope Today: ఈరాశి వారికి చాలా అనుకూలం.. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం.. ఈరోజు రాశి ఫలాలు..
Horoscope

భవిష్యత్తుపై చాలా మందికి ఆశలు కాస్త ఎక్కువగానే ఉంటాయి.. వారి జీవితంలో ఏం జరగబోతుందనేది తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు.. ఈ క్రమంలో తమ రోజులో ఏం జరగబోతుంది… ఎలాంటి పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుందనేది ముందుగానే తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటారు.. ఈ క్రమంలోనే రోజూ వారీ దినఫలాలు తెలుసుకునేవారు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు… ఈరోజు అక్టోబర్ 18న సోమవారం నాడు చంద్రుడు మీన రాశిలో రోజంతా ఉండనున్నాడు.. అలాగే ఈరోజు తులరాశి వారికి అనుకూలంగ ఉంటుంది. మరి మిగతా రాశుల వారికి ఈరోజు ఎలా ఉంటుందనేది ఇప్పుడు తెలుసుకుందామా..

మేష రాశి..
ఈ రాశి వారు శ్రమతో కూడిన విజయాలు నమోదు చేస్తారు. అభివృద్ధి కోసం చేసే ఆలోచనలను ఆచరణలో పెట్టి సత్ఫలితాలు పొందుతారు. కుటుంబ వాతావరణం సానుకూలంగా ఉంటుంది. పెద్దల ఆశీర్వచనాలు ఉంటాయి. ప్రయాణాలు చేస్తారు. వీలైనంత వరకు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండటం మంచిది.

వృషభ రాశి..
ఈరోజు మీరు అనుకున్నది సాధిస్తారు. అవసరానికి తగిన సహాయం అందుతుంది. ఇష్టదైవారాధన శుభప్రదం. అనవసర విషయాల్లో తలదూర్చక పోవడం మంచిది.

మిథున రాశి..
ఈ రాశివారు మనోధైర్యంతో చేసే పనులు సత్పలితాన్ని ఇస్తాయి. సమయానుకూలంగా ముందుకు సాగండి. సౌమ్య సంభాషణ అవసరం. దైవారాధన మానవద్దు. సోదరుడు లేదా సోదరి వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే మీరు వారికి మంచి సలహాలు ఇస్తారు.

కర్కాటక రాశి..
ఈరోజు మీరు ఆత్మీయుల సహకారంతో అనుకున్నది సాధిస్తారు. స్థిరమైన భవిష్యత్తు కోసం ఆలోచనలు చేస్తారు. దాన ధర్మాలు చేస్తారు. సమాజంలో గౌరవ, మర్యాదలు అందుకుంటారు. మీ మీ రంగాల్లో మంచి ఫలితాలను అందుకుంటారు.

సింహ రాశి..
ఈ రాశి వారు వారున్న రంగాల్లో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఒక ముఖ్యమైన పనిలో కదలిక వస్తుంది. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండండి.

కన్య రాశి..
వీరు అనుకున్నది సాధిస్తారు. సంతోషకరమైన కాలాన్ని గడుపుతారు. ఆర్థికంగా సత్ఫలితాలను అందుకుంటారు. ధర్మ కార్యాచరణ చేస్తారు. సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు. విష్ణు దర్శనం మంచిది.

తుల రాశి..
ఈ రాశి వారు కొత్త పనులు చేపడతారు. తోటివారిని కలుపుకొనిపోవడం వల్ల త్వరగా ఫలితాలు సొంతం అవుతాయి. ఉత్సాహంతో ముందుకు సాగి విజయవంతమైన ఫలితాలను అందుకుంటారు.

వృశ్చిక రాశి..
మీరు పరిపూర్ణమైన ఆత్మవిశ్వాసంతో పనిచేయాలి. ముందుచూపుతో వ్యవహరించాలి. బంధుమిత్రుల సహకారం ఉంటుంది. శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే మంచిది.

ధనస్సు రాశి..
ఈ రాశివారికి కష్టానికి తగిన ఫలితాలు ఉంటాయి. నూతన కార్యక్రమాలను ప్రారంభించే ముందు లాభ నష్టాలను అంచనా వేసి ముందుకు సాగాల్సి ఉంటుంది.
ప్రయాణాలు ఫలిస్తాయి. దుర్గా దర్శనం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.

మకర రాశి..
ఈ రోజు మీ పరిధిని దృష్టిలో ఉంచుకుని పనిచేయండి. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. ఎవరినీ పట్టించుకోకుండా మీ లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగండి. ఇబ్బందులు దరిచేరవు.

కుంభ రాశి..
ఈ రాశి వారు పనుల్లో ఆటంకాలు పెరుగుతాయి. రుణ సమస్యలు పెరగకుండా చూసుకోవాలి. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. నిరుత్సాహపరిచే సంఘటనలకు దూరంగా ఉండాలి. లక్ష్మీధ్యానం చేయండి.

మీన రాశి..
మీరు శుభకాలం. పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. మీ ప్రతిభ,పనితీరుకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సహకారం ఉంది. వ్యాపారంలో లాభదాయకమైన కాలం. సుబ్రహ్మణ్య భుజంగ స్తవం పఠించాలి.

 

Click on your DTH Provider to Add TV9 Telugu