Bhishma Niti: నీతి పాలకుల నీడలో ప్రజలు సుఖసంతోషాలతో ఉంటారు.. మంచి పాలకుడికి ఉండాల్సిన లక్షణాలను పాండవులకు చెప్పిన భీష్ముడు..

|

Feb 07, 2022 | 4:20 PM

Bhishma Niti:మహాభారతంలో విశిష్టమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి.. కురు వృద్ధుడు.. గంగాపుత్రుడు భీష్ముడు.. కురుక్షేత్ర యుద్ధం(Kurukshetra War)లో కౌరవుల(Kauravas) పక్షాన పోరాడి.. గాయపడిన భీష్ముడు స్వచ్చంద

Bhishma Niti: నీతి పాలకుల నీడలో ప్రజలు సుఖసంతోషాలతో ఉంటారు.. మంచి పాలకుడికి ఉండాల్సిన లక్షణాలను పాండవులకు చెప్పిన భీష్ముడు..
Bhishma Niti
Follow us on

Bhishma Niti: మహాభారతంలో విశిష్టమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి.. కురు వృద్ధుడు.. గంగాపుత్రుడు భీష్ముడు.. కురుక్షేత్ర యుద్ధం(Kurukshetra War)లో కౌరవుల(Kauravas) పక్షాన పోరాడి.. గాయపడిన భీష్ముడు స్వచ్చంద మరణం వర ప్రభావంతో.. అంపశయ్య మీద ఓఘవతీ తీరంలో పడి ఉన్నాడు. ఆ సమయంలో భీష్ముడు పాండవులకు రాజులకు ఉండాల్సిన లక్షణాలు, పాలనా నియమాలను తెలియజేస్తూ.. ఎన్నో నీతి కథలను చెప్పాడు. ఈ భీష్మ నీతి కథలు శాంతిపర్వం అనే అధ్యాయంలో రాజనీతి, గృహస్థు ధర్మం, వ్యక్తిత్వం, కర్తవ్య నిర్వహణ, ప్రజా పాలన వంటి అనేక అంశాల మీద పాండవులకు భోధనలు చేశాడు. . ధర్మరాజుకి భీష్ముడు రాజ్య పాలన గురించి.. రాజనీతి గురించి చెప్పిన ముఖ్యమైన విషయాలు నేటికీ అనుసరణీయం.. ఈ రోజు భీష్ముడు రాజు తన పాలనలో దుష్టపాలకుడు అనిపించుకోకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పిన నియమాల గురించి తెలుసుకుందాం.

రాజనీతి-దండ నీతి

అధికారంలో ఉన్న వ్యక్తి నీతి తప్పని వాడై ధర్మ పరుడై ఉండాలి. తాను చేపట్టిన పనిని మధ్యలో విడిచి పెట్టకుండా చివరి వరకూ ప్రయత్నం చేసేవాడై ఉండాలి. అటువంటి రాజుకి దైవం కూడా తోడవుతాడు. రాజు, మంత్రి, రాష్ట్రం, దుర్గం, ధనాగారం, స్నేహితులు, సైన్యం ఈ ఏడింటినీ సప్తాంగాలనీ అంటారు. రాజు ఎప్పుడు ఈ సప్తాంగాలకు హాని జరగకుండా పరిరక్షించుకోవాలి. ఇలా రక్షించుకోవాలంటే.. ఆ రాజు మంచి నడవడిక, మంచి వాక్కు కలిగి ఉండలి. అప్పుడే సాధ్యమవుతుంది. రాజ్యపాలకుడు దయ ధర్మం కలిగి ఉండాలి. అదే సమయంలో అవసరమైతే.. కఠిన నిర్ణయాలను తీసుకోవడానికి కూడా వేరువకూడదు. ,ఎవరికైనా శిక్షించే సమయంలో విచారణ తగిన జాగ్రత్తలు తీసుకుని చేయాల్సి ఉంటుంది. సంధి, విరోధం) యానం, ఆసనం, ద్వైదీభావం, సమాశ్రయం అనే ఈ ఆరు గుణాలనూ రాజు జాగ్రత్తగా చూసుకోవాలి. ధనం నీతిగా నియజతీగా సంపాదించాలి. అదే సమయంలో అవినీతి పరులపై ఓ కన్నువేసి ఉంచడం రాజ ధర్మం. రాజు ఎప్పుదూ ఎవరీ అధికంగా నమ్మకూడదు. నమ్మినట్లు నటిస్తూ.. అందరినీ కలుపుకుని పోతూ.. ప్రజలు హర్షించేలా పాలన చేయడం తెలివైన వారి లక్షణం.

క్రమం తప్పని ఋతువులు

రాజ్య పాలన చేసే వారుమంచి పాలన రాజ ధర్మాన్ని పాటిస్తే… ప్రకృతి తన ధర్మం తాను సక్రమంగా నిర్వహిస్తుంది. మంచి వర్షాలు కురుస్తాయి. మంచి పంటలు పండుతాయి. ఆ రాజ్యంలోని మనుషులు సుఖ సంతోషాలతో జీవిస్తారు. అదే పాలకులు దుర్మార్గులూఅవినీతి పరులైతే.. ప్రకృతి కూడా ఆ రాజ్యంపై తిరుగుబాటు చేస్తుంది. రుతువులు వాటి ధర్మాన్ని కాలాన్ని విదిచి పెట్టి పయనిస్తాయి. అకాల వర్షాలు, ప్రకృతి విపత్తులు సర్వసాధారణంగా మరి.. ఆ రాజ్యంలోని మనుష్యులు ఆకలి దప్పులతో అనారోగ్యంతో ఇబ్బంది పడతారు. అందుకనే పాలకులు చేసే పుణ్యాలు, యజ్ఞయాగాది క్రతువులు చేస్తూంటే.. దేవతలు సంతోషించి ఆ రాజ్యంలోని కరువుకాటకాలు రాకుండా ప్రజలు సుఖ సంతోషాలతో ఉండేలా చేస్టారు.

బలహీనమైన వారికీ పాలకులు అండగా..

రాజ్య పాలన చీవారికి మంచి గృహస్థ ధర్మం తెలిసి ఉండాలి. తమ ఇంటికి వచ్చిన అతిధులను గృహస్తులు ఎలా ఆదరిస్తారో.. అదే విధంగా రాజ్యంలోని నిరుపేదలను, నిరాశ్రయులను, వృద్ధులను, వితంతువులను ఆదరించాలి. అండగా నిలబడాలి. ఇంకా చెప్పాలంటే తన రాజ్యంలోని బలహీనులకు రాజు ఓ బలంగా మారడమే రాజధర్మం అని చెప్పాడు భీష్ముడు. అంతేకాదు రాజ్యంలో ధనం, ధాన్యం, ఇతర నిత్యావసర వస్తువులకు కొరత లేకుండా చూసుకోవడమే కాదు.. తన ప్రజల జీవనోపాధి కల్పిస్తూ రాజు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.. రాజులను, కార్మికులను ఇబ్బందులు పెట్టె రాజు ఉంటె.. ఆ రాజ్యంలోమనిం ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోయే ప్రమాదం ఉందని గాంగేయుడు తెలిపాడు.

పాలకుడు రైతుకి నేస్తంగా ఉండాలి:
రాజ్యపాలనకు కావాల్సిన శక్తిని ధనాన్ని ఎప్పుడూ పాలకులు లోటు లేకుండా చూసుకోవాలి. ప్రజలకు ఆకలిదప్పులు తీర్చే విధంగా నడుచుకోవాలి. ముఖ్యంగా మట్టిని బంగారంగా మార్చి.. ప్రజలకుతినడానికి తిండి గింజలు ఇచ్చే రైతులను పాలకులు జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రతి పుటా అన్నం పెడుతున్న కర్షకులకు కృతజ్ఞులుగా ఉండడమే రాజనీతిలో ఒకటి. అందుకనే తనకు ధన, ధాన్యాలు ఇచ్చే రైతులు, కార్మికులు, వర్తకులు, గోరక్షకులవాటిని కంటికి రెప్పలా చూసుకోవాలి. అధికార బలం వీరిపై ఎప్పుడు చూపించకూడదు. అంతేకాదు ప్రకృతి కన్నెర్ర జేసి.. వర్షాలు అతి వృష్టి, అనావృష్టి, వంటి విపత్కర పరిస్థితులు ఎదురైన సమయంలో ప్రజలకు, రైతులకు పాలకులు అండగా నిలబడాలి. తగిన దైర్యాన్ని ఇవ్వాలి.

(సేకరణ)

Also Read:  రథ సప్తమి రోజున ఈ మంత్రాలను పఠించండి.. సూర్య భగవానుడి అనుగ్రహం సొంతం చేసుకోండి.