Banana Leaf: అరటి ఆకులో ఎందుకు నీరు చల్లుతాం, ఆకుని లోపలికి ఎందుకు మడత పెడతామో తెలుసా..

నేటి మనిషి కాలంతో పోటీపడుతూ ఉరుకుల పరుగుల జీవితాన్ని గడుపుతున్నాడు. జీవన శైలిలో తినే ఆహారం దగ్గర నుంచి నిద్రపోయే సమయం వరకూ ఎన్నో మార్పులు వచ్చాయి. అలాంటి మార్పులో భాగంగా పెళ్ళిళ్ళు ఫంక్షన్లలో బంతి భోజనం స్థానంలో బఫే డిన్నర్ వచ్చి చేరింది. అరటి ఆకుల్లో బదులుగా ప్లాస్టిక్ ప్లేట్లు వచ్చాయి. అయితే అలనాటి సంప్రదాయాన్ని నేటికీ పాటించేవారున్నారు. పండగలు, ఫంక్షన్ల సమయంలో అరటి ఆకుల్లో భోజనం చేసేవారున్నారు. అయితే తిన్న తర్వాత అరటి ఆకుని ఎలా మడవాలో తెలుసా..!

Banana Leaf: అరటి ఆకులో ఎందుకు నీరు చల్లుతాం, ఆకుని లోపలికి ఎందుకు మడత పెడతామో తెలుసా..
Banana Leaf Dining

Updated on: Apr 08, 2025 | 3:55 PM

తెలుగు వారి జీవనశైలిలో అరటి చెట్టుకు విశిష్ట స్థానం ఉంది. అరటి పండ్లు, కాండం, ఆకులు ఇలా ప్రతి భాగం పండగలు, పర్వదినాల సమయంలో ముఖ్యమైన పాత్రని పోషిస్తాయి. అరటి ఆకులు పురాతన కాలం నుంచి వివిధ ఆచారాలు, వేడుకలు,రోజువారీ ఆహారపు అలవాట్లలో ఉపయోగించబడుతున్నాయి. అరటి ఆకుల్లో ఆహారం తినడం కేవలం మనకి అనాదిగా వస్తున్నా ఆచారం మాత్రమే కాదు. మన సంస్కృతి, ఆరోగ్యకరమైన జీవనశైలికి చిహ్నం. అరటి ఆకుల్లో తినడానికి ముందు తినడం.. తిన్న తర్వాత ఎంగిలి ఆకుని లోపలి మతడపెట్టడం వంటి ఆచారాలు యుగయుగాలుగా పాటిస్తున్నారు. ఇలా చేయడం వెనుక ఉన్న కారణం ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం..

నీరు చల్లడానికి కారణాలు:

ఆహారం తినడానికి ముందు అరటి ఆకుపై నీరు చల్లడం శతాబ్దాలుగా అనుసరిస్తున్న ఆచారం. దీనికి వివిధ కారణాలు చెప్పబడుతున్నాయి. అరటి ఆకులపై సహజంగా కీటకాలు, సూక్ష్మజీవులు ఉంటాయి. నీటిని చల్లి శుభ్రం చేయడం వలన ఆకు మీద ఉన్న కీటకాలు, సూక్ష్మజీవులు తొలగించబడతాయి. అప్పుడు ఆ ఆకులో ఆహారం తినడం వలన భద్రత ఉంటుందని నమ్మకం. ఆకుపై ఉన్న దుమ్ము, ధూళిని తొలగించి ఆకుని శుభ్రంగా ఉంచడానికి కూడా ఇలా చేస్తారు.

నీటిని చల్లడం వల్ల ఆకు గట్టిగా ఉంటుంది. ఇలా చేయడం వలన తినేటప్పుడు ఆకులు చిరిగిపోవడం వంటి సమస్యలు ఏర్పడవు. అరటి ఆకుపై నీటిని చల్లడం చాలా పవిత్రమైన కార్యమని నమ్ముతారు. ఇలా అరటి ఆకులో ఆహారం తింటే దైవిక శక్తి ఆశీర్వదిస్తుందని కూడా భావిస్తారు.

ఇవి కూడా చదవండి

తిన్న తర్వాత ఆకును లోపలికి మడవడానికి కారణాలు:

అరటి ఆకులో భోజనం తిన్న తర్వాత, దానిని లోపలికి మడతపెడతారు. ఇలా చేయడం ఆహారాన్ని తయారు చేసి వడ్డించిన వారికి గౌరవం చూపించే మార్గంగా పరిగణించబడుతుంది. కొన్నిసార్లు ఆహార అవశేషాలు ఆకు లోపలి భాగంలో ఉంటాయి. అందువల్ల.. బయట నుంచి ఆకును లోపలికి మడతపెట్టడం సులభం. అలాగే ఆకును లోపలికి మడతపెట్టడం వల్ల సూర్యరశ్మి దానిలోకి ప్రవేశించదు. అందులోని ఆహారం దెబ్బతినకుండా నిరోధిస్తుంది.

అరటి ఆకులను ఉపయోగించడం మన పూర్వీకుల నుంచి మనకు లభించిన బహుమతి. ఇది మన సంస్కృతిలో భాగం. నేటి ఆధునిక ప్రపంచంలో ప్లాస్టిక్, కాగితం వంటి వాటితో చేసిన వస్తువుల వాడకం ఎక్కువగా జరుగుతోంది. అయితే అరటి ఆకుల వంటి సహజ వస్తువులను ఉపయోగించడం ద్వారా మనం పర్యావరణాన్ని కాపాడుకోవచ్చు.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.