Bahuda Yatra 2024: కన్నుల పండువగా బాహుదా యాత్ర.. గర్భ గుడికి చేరుకున్న జగన్నాథ, బలరామ, సుభద్రలు

పూరీ జగన్నాథ స్వామి రథోత్సవం కన్నుల పండుగగా సాగింది. స్వామి వారి ఆలయం శ్రీ క్షేత్రానికి పూరీ జగన్నాథ స్వామి, సుభద్ర, బలభద్ర దేవతా మూర్తులు తిరిగి వచ్చారు. బహుదా యాత్ర ఘనంగా జరిగింది. జగన్నాథుడు, సుభద్ర, బలభద్రుడి రథాలు గుండిచా ఆలయం నుంచి తిరిగి ప్రధాన ఆలయానికి చేరుకున్నారు. వేలాదిమంది భక్తులు బహుదా యాత్రలో పాల్గొన్నారు. కళాకారుల ప్రదర్శన ఆకట్టుకుంది.

Bahuda Yatra 2024: కన్నుల పండువగా బాహుదా యాత్ర.. గర్భ గుడికి చేరుకున్న జగన్నాథ, బలరామ, సుభద్రలు
Bahuda Yatra 2024

Updated on: Jul 16, 2024 | 6:50 AM

పూరీ మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతమయ్యింది. జగన్నాథ స్వామి, సుభద్ర, బలభద్ర దేవతా మూర్తులు ప్రధాన ఆలయానకి తిరిగి వచ్చే బాహుదా యాత్ర కన్నుల పండువగా కొనసాగింది. బహుదా యాత్ర సందర్భంగా.. రత్న భాండాగారం లెక్కింపు ప్రక్రియను అధికారులు నిలిపివేశారు

పూరీ జగన్నాథ స్వామి రథోత్సవం కన్నుల పండుగగా సాగింది. స్వామి వారి ఆలయం శ్రీ క్షేత్రానికి పూరీ జగన్నాథ స్వామి, సుభద్ర, బలభద్ర దేవతా మూర్తులు తిరిగి వచ్చారు. గుండిచా ఆలయం నుంచి స్వామి వారి బాహూదా రథయాత్ర సాగింది. స్వామివారి రథోత్సవంలో పాల్గొనేందుకు లక్షలాదిగా మంది భక్తులు తరలిరావడంతో పూరీ ప్రాంతం జనసంద్రంగా మారింది. ఈ నెల 7వ తేదీన ప్రారంభమైన పూరీ జగన్నాథ స్వామి రథోత్సవం.. ప్రతీయేటా ఆషాడ శుద్ధ తదియ రోజున ప్రారంభమవుతుంది.

బహుదా యాత్ర ఘనంగా జరిగింది. జగన్నాథుడు, సుభద్ర, బలభద్రుడి రథాలు గుండిచా ఆలయం నుంచి తిరిగి ప్రధాన ఆలయానికి చేరుకున్నారు. వేలాదిమంది భక్తులు బహుదా యాత్రలో పాల్గొన్నారు. కళాకారుల ప్రదర్శన ఆకట్టుకుంది.

ఇవి కూడా చదవండి

బహుదా యాత్రకు పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. పూరీ మహరాజు గజపతి మహరాజు దివ్యాసింగ్‌ దేవ్‌ చెరా పహారా కార్యక్రమాన్ని నిర్వహించారు. బంగారు చీపురుతో రథాల ముందు ఊడ్చారు. మూడు కిలోమీటర్ల మేర బహుదా యాత్ర కొనసాగింది. మూడు రథాలు గుడిచా ఆలయం నుంచి జగన్నాథుడి ఆలయానికి చేరుకోవడమే బహుదా యాత్ర. రథయాత్రలో ఇది కీలక ఘట్టంగా చెప్పుకోవచ్చు.

ఏ హిందూ ఆలయంలోనైనా ఊరేగింపునకు ఉత్సవ విగ్రహాలను తీసుకువస్తారు. కానీ, పూరీ ఆలయం రథయాత్రలో మాత్రం జగన్నాథ స్వామి బలభద్ర, సుభద్రలతో సహా ఏడాదికొకసారి గుడి నుంచి బయటకు వచ్చి రథయాత్రలో భక్తులకు కనువిందు చేస్తారు. మూలవిరాట్ విగ్రహాలే రథయాత్రలో పాల్గొనడం వలన జగన్నాథ రథయాత్రను భక్తులు అత్యంత అపురూపంగా భావిస్తారు. జగన్నాథుడి రథాన్ని ‘నందిఘోష’ అని, బలభద్రుడి రథాన్ని ‘తాళధ్వజం’ అని, సుభద్రాదేవి రథం ‘పద్మధ్వజం’ అని భక్తులు పిలుస్తారు. ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు స్వామివార్లను బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు. ద్వాదశి నాడు విగ్రహాలను మళ్లీ గర్భగుడిలోని రత్నసింహాసనంపై అలంకరించడం వల్ల యాత్ర పూర్తవుతుంది.

బహుదా యాత్ర సందర్భంగా.. రత్న భాండాగారం లెక్కింపు ప్రక్రియను అధికారులు నిలిపివేశారు. దశాబ్దాల తరువాత ఆదివారం రత్న భాండాగారం తలుపులు తెరుచుకున్నాయి. రత్న భాండాగారం తాళాలు పని చేయకపోవడంతో.. కట్టర్లతో అధికారులు తలుపులు కట్ చేశారు. సమయానుభావం కావడంతో రత్న భాండాగారంలోనికి అధికారులు, హైలెవల్ కమిటీ వెళ్లలేదు. రత్నభాండాగారానికి మరొక తాళం అమర్చి జిల్లా ఖజానా కార్యాలయంలో అధికారులు భద్రపర్చారు. రథోత్సవాలు పూర్తి అయిన తరువాత మరోసారి కమిటి సమావేశమై రత్న భాండాగారంలో సంపద లెక్క కట్టడంపై మరో మార్గాన్ని పూరీ జగన్నాథ్ ట్రస్ట్ నిర్ణయించనుంది.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు