Badrinath Temple: తెరచుకున్న చార్ ధామ్ యాత్రలో పవిత్రమైన బద్రీనాథ్ ఆలయం తలుపులు.. ఆన్లైన్ లోనే భక్తులకు దర్శనభాగ్యం!

Badrinath Temple: భక్తులు పవిత్రంగా భావించే చార్ ధామ్ యాత్రలో చివరి ముఖ్యమైన బద్రీనాథ్ ఆలయం ఈరోజు ఉదయం తెరచుకుంది. ఈ సంవత్సరం కూడా కరోనా మహమ్మారి ప్రభావంతో భక్తులకు ఆన్లైన్ దర్శనాలు మాత్రమే కల్పిస్తున్నారు.

Badrinath Temple: తెరచుకున్న చార్ ధామ్ యాత్రలో పవిత్రమైన బద్రీనాథ్ ఆలయం తలుపులు.. ఆన్లైన్ లోనే భక్తులకు దర్శనభాగ్యం!
Badrinath Temple

Updated on: May 18, 2021 | 7:03 AM

Badrinath Temple: భక్తులు పవిత్రంగా భావించే చార్ ధామ్ యాత్రలో చివరి ముఖ్యమైన బద్రీనాథ్ ఆలయం ఈరోజు ఉదయం తెరచుకుంది. ఈ సంవత్సరం కూడా కరోనా మహమ్మారి ప్రభావంతో భక్తులకు ఆన్లైన్ దర్శనాలు మాత్రమే కల్పిస్తున్నారు. చార్ ధామ్ యాత్రను ఈ సంవత్సరం కూడా రద్దు చేశారు. దీంతో భక్తులకు నాలుగు ఆలయాల నుంచి భగవంతుని దర్శనానికి ఆన్లైన్ లో అవకాశం కల్పించారు. ఈ నేపధ్యంలో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీరత్ సింగ్ రావత్ భక్తులకు తమ ఇంటిలోనే ఉండి ప్రార్థనలు చేయాలని విజ్ఞప్తి చేశారు. కరోనాకారణంగా తాత్కాలికంగా చార్ ధామ్ యాత్రను నిలిపివేసినట్టు ప్రకటించారు.

ఇక చార్ ధామ్ యాత్రలో మిగిలిన పవిత్ర ధామ్ కేంద్రాలు.. యమునోత్రి ధామ్ మే 14 న, గంగోత్రి ధామ్ మే 15 న తెరుచుకున్నాయి. అలాగే కేదార్‌నాథ్ మే 17 తెరచుకుంది. ఇక ఈరోజు ఉదయం 4:15 నిమిషాలకు బద్రీనాథ్ ఆలయ తలుపులు తెరచుకున్నాయి. దీంతో చార్ ధామ్ యాత్రలోని అన్ని ఆలయాలు తెరచుకున్నట్టయింది. ప్రతి సంవత్సరం ఈ నాలుగు కేంద్రాలకు కలిపి చార్ ధామ్ పేరిట యాత్రను నిర్వహిస్తారు. ఈ నాలుగు ప్రధాన ఆలయాలను భక్తులు వరుసగా దర్శించుకుని తమ యాత్రను ముగిస్తారు. అయితే, కరోనా కారణంగా ఈ యాత్రను వరుసగా రెండో సంవత్సరం కూడా తాత్కాలికంగా రద్దు చేశారు.అయితే, నిత్యానియం నుండి పూజ-అర్చన కొనసాగుతుంది. అన్ని ఆలయాల్లో పూజ పారాయణతో సంబంధం ఉన్న వ్యక్తులను లోపలకు అనుమతిస్తారు. వారి సంఖ్య కూడా 25 మించకూడదు. కరోనా జాగ్రత్తలు అన్నీ ఈ సమయంలో తీసుకుంటారు.

చార్ ధామ్ అంటే..
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో హిమాలయాలలో ఉన్న బద్రీనాథ్, కేదార్‌నాథ్, గంగోత్రి అలాగే యమునోత్రి దేవాలయాలను చార్ ధామ్ అంటారు. చార్ ధామ్ ఆలయాలు నాలుగూ ప్రతి సంవత్సరం ఏప్రిల్-మే నెలలలో తెరుస్తారు. ఆరు నెలల పాటు ఇక్కడ దర్శనాలకు అనుమతి ఉంటుంది. తరువాత 6 నెలల శీతాకాలంలో ఈ ఆలయాలు మూసివేస్తారు. గత సంవత్సరం కూడా కరోనా కారణంగా భక్తులకు ఇక్కడ ప్రవేశం కల్పించలేదు. ఈసారి కూడా ఏప్రిల్ 29 న భక్తుల ప్రవేశాన్ని మూసివేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. నిర్ణీత సమయంలో ధామ్‌ల తలుపులు తెరుస్తాయని, అయితే పూజారులు మాత్రమే అక్కడ క్రమం తప్పకుండా పూజలు చేస్తారని ఆయన చెప్పారు.

బద్రీనాథ్ ఆలయం ఏఎన్ఐ ట్వీట్

Also Read: Kedarnath Temple: తెరుచుకున్న కేదార్‏నాథ్ ఆలయం .. ఆ గుడి గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా..

Kedarnath: తెరచుకున్న కేదార్‌నాథ్ ఆలయం.. భక్తులకు నో ఎంట్రీ.. ఆన్‌లైన్‌ దర్శనాలు మాత్రమే!