Ayodhya: రామమందిరంలోకి ప్రవేశం ఎలా..? ఎలాంటి వస్తువులు తీసుకెళ్లాలి.. ప్రత్యేక డ్రెస్ కోడ్ ఏమైనా ఉందా?
అయోధ్యలో రామలాలా మహిమ కార్యక్రమానికి సర్వం సిద్ధం చేస్తున్నారు. సంప్రోక్షణ తరువాత, సామాన్య ప్రజలు కూడా ఇక్కడ దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేశారు. అయితే రామ మందిరంలోకి ప్రవేశానికి సంబంధించి కొన్ని నియమాలు రూపొందించారు రామ మందిర నిర్వహకులు.
ఇప్పుడు ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక వాతవరణం కనబడుతుంది. జనవరి 22న సోమవారం అయోధ్యలో బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట సందర్భంగా దేశవ్యాప్తంగా వివిద ఆలయాల్లో ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రత్యేకంగా ఆలయాలను ముస్తాబు చేశారు. అటు అయోధ్యలో రామలాలా మహిమ కార్యక్రమానికి సర్వం సిద్ధం చేస్తున్నారు. సంప్రోక్షణ తరువాత, సామాన్య ప్రజలు కూడా ఇక్కడ దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేశారు. అయితే రామ మందిరంలోకి ప్రవేశానికి సంబంధించి కొన్ని నియమాలు రూపొందించారు రామ మందిర నిర్వహకులు.
రామాలయంలోకి ప్రవేశించేటప్పుడు, ఎలాంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లను లోపలికి తీసుకెళ్లడానికి అనుమతి ఉండదని స్పష్టం చేశారు. ఈ గాడ్జెట్‌లలో మొబైల్‌లు, ఇయర్ ఫోన్‌లు, రిమోట్ కీలు ఇలా ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు ఉంటాయి. ఇది కాకుండా, లోపల పర్స్ కానీ, మరేదైనా బ్యాగ్ కూడా తీసుకోవడానికి వీలు లేదని భద్రత సిబ్బంది స్పష్టం చేసింది. సీతా రాముల దర్శనానికి రామాలయానికి వచ్చే అతిథులు జనవరి 22 ఉదయం 11 గంటలలోపు ప్రవేశించవలసి ఉంటుంది. భద్రతా కారణాల దృష్ట్యా, ఎవరైనా భద్రతా సిబ్బంది వచ్చినట్లయితే, అతను కూడా బయట ఉండవలసి ఉంటుంది.
ఇక డ్రెస్ కోడ్ గురించి మాట్లాడుతూ, రామ్ మందిర్ ట్రస్ట్ ఎలాంటి డ్రెస్ కోడ్ అమలు చేయలేదు. అయితే, భారతీయ సంప్రదాయం ప్రకారం బట్టలు ధరించి రామమందిర ప్రారంభోత్సవానికి హాజరు కావచ్చని రామ మందిర ట్రస్ట్ నిర్వహకులు తెలిపారు. రాంలాలా పవిత్రోత్సవ కార్యక్రమంలో, పురుషులు ధోతీ, పంచా, కుర్తా-పైజామా ధరించాలి. అలాగే స్త్రీలు సల్వార్ సూట్ లేదా చీరలో మాత్రమే రామ మందిరంలోకి వెళ్ళేందుకు అవకాశం కల్పించారు. రామ్ మందిర్ ట్రస్ట్ కార్యాలయ ఇన్‌చార్జి ప్రకాష్ గుప్తా, నిర్దేశిత దుస్తుల కోడ్ లేదని స్పష్టం చేశారు. అయితే సందర్శకులు సాంస్కృతిక నిబంధనలకు కట్టుబడి ఉండాలని, శరీర భాగాలను బహిర్గతం చేయకుండా తగిన విధంగా కప్పబడి ఉండేలా చూసుకోవాలని అన్నారు.
అలాగే రామ్ లల్లా పవిత్రోత్సవం సందర్భంగా భద్రతా చర్యలను పటిష్టం చేపట్టారు. అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)తో కూడిన అధునాతన భద్రతా పరికరాలు అమర్చారు. మౌలిక సదుపాయాల కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రూ. 90 కోట్లు కేటాయించింది. అయోధ్య మొత్తంగా 15,000 మంది భద్రతా సిబ్బంది మోహరించారు.
మరిన్ని అధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…