Ayodhya Ram Mandir LIVE: ఆధ్యాత్మిక పరవశం..దివ్యమంగళ రూపం కోసం పరితపిస్తున్న భక్తజనం
అయోధ్య..ఆ పేరు వింటేనే ఆధ్యాత్మిక పరవశం..కోట్లాది భక్త హృదయాలు ఉప్పొంగేలా భవ్యమైన దివ్యమైన మందిరంలోకి రామచంద్ర ప్రభువు వేం చేస్తున్నారు.. ఆ దివ్యమంగళ రూపం కోసం పరితపిస్తున్న భక్తకోటి ఆర్తి తీరేలా బాలరాముడిగా ఆదివారం తొలి దర్శనభాగ్యం కలిగించబోతున్నాడు..
అయోధ్య నగరం రామనామస్మరణతో మార్మోగుతోంది. జనవరి 22, ఆదివారం మధ్యాహ్నం 12 గంటల ఐదు నిమిషాల నుంచి 12 గంటల 55 నిమిషాల వరకు బాలరాముడి ప్రాణప్రతిష్ఠ శాస్త్రోస్తకంగా నిర్వహిస్తారు. మధ్యాహ్నం 12.29కి అభిజిత్ లగ్నంలో ప్రధాని మోదీ చేతుల మీదుగా బాల రాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ జరుగునుంది. ప్రాణప్రతిష్ఠ తర్వాత 12.55కి హెలికాప్టర్‌తో పూలవర్షం కురిపిస్తారు. ప్రాణప్రతిష్ఠ కోసం ఆహ్వానాలు అందుకున్న అతిథులు, ఉదయం పదికల్లా ఆలయానికి చేరుకుంటారు. అయోధ్య ఆలయం కట్టుదిట్టమైన భద్రతా వలయంలో ఉంది. ప్రధాన ఆలయానికి వెళ్లే దారుల్లో అడుగడుగునా భద్రతను పెంచారు. ఏటీఎస్ కమాండోలు, పోలీసులు, సీఆర్‌పీఎఫ్ పహారా కాస్తున్నారు.
అయోధ్య రామమందిరాన్ని, అయోధ్య నగరాన్ని పుష్పాలతో అలంకరించేందుకు దాదాపు ఎనిమిది వందల మంది పనివాళ్లు రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు. దాదాపు 1100 టన్నుల పూలను అలంకరణ కోసం ఉపయోగిస్తున్నారు.పూలపై జై శ్రీరామ్ అనే అక్షరాలు వచ్చేలా ప్రత్యేకంగా అలంకరిస్తున్నారు. అటు అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ సందర్భంగా యాగం నిర్వహిస్తున్న యాగశాలకు సమీపంలో భక్తులు నిరంతరాయ రామనామం జపిస్తున్నారు. 9 రోజుల పాటు ఈ అఖండ రామనామం జపం సాగనుంది.
పవిత్ర అయోధ్యలో పండుగ వాతావరణం కన్పిస్తోంది. రామాలయ ప్రాణప్రతిష్ట సందర్భంగా నాగ సాధువులు సందడి చేశారు. భారీ ర్యాలీగా అయోధ్యకు నాగసాధువులు తరలివచ్చారు. స్థానికులు వాళ్లకు ఘనస్వాగతం పలికారు. నాగసాధువుల కర్రసాము, కత్తిసాము అందరిని ఆకట్టుకుంది.
మరిన్ని అధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…