Andhra Pradesh: చంద్రబాబు చివరి అస్త్రం షర్మిల: సజ్జల సంచలన కామెంట్స్
వైఎస్ కుటుంబాన్ని కాంగ్రెస్ ఎంతగా వేధించిందో అందరికీ తెలుసని.. అలాంటి పార్టీలో చేరగానే.. షర్మిల యాస, భాష మారాయన్నారు. గత ఎన్నికల్లో నోటాకు వచ్చిన ఓట్లు కూడా ఏపీలో కాంగ్రెస్‌కు రాలేదని ఎద్దేవా చేశారు. జగన్‌ను జైలుకు పంపించింది కాంగ్రెస్ పార్టీ అని సజ్జల చెప్పుకొచ్చారు. ఇన్నాళ్లు తెలంగాణలో ఏం చేశారు? ఇక్కడికి వచ్చి ఏం చేస్తారు? అంటూ షర్మిలను ప్రశ్నించారు.
చంద్రబాబు చివరి అస్త్రం షర్మిల అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల. తెలంగాణలో సీఎం అయిన రేవంత్ రెడ్డి.. ఇక్కడ అవకాశం లేదు పొమ్మంటే.. వైఎస్ షర్మిలను ఏపీలో నేను ఉపయోగించుకుంటా అని చంద్రబాబు తెచ్చుకున్నట్లు కనపడుతోందన్నారు. షర్మిలను చూస్తే జాలి కలుగుతోందన్నారు. వైఎస్ అభిమానుల ఓట్లు చీలితే తనకు కొంతైనా కలిసొస్తుందని చంద్రబాబు భావిస్తున్నారన్నారు. వైఎస్ కుటుంబాన్ని కాంగ్రెస్ ఎంతగా వేధించిందో అందరికీ తెలుసని.. అలాంటి పార్టీలో చేరగానే.. షర్మిల యాస, భాష మారాయన్నారు. గత ఎన్నికల్లో నోటాకు వచ్చిన ఓట్లు కూడా ఏపీలో కాంగ్రెస్‌కు రాలేదని ఎద్దేవా చేశారు. జగన్‌ను జైలుకు పంపించింది కాంగ్రెస్ పార్టీ అని సజ్జల చెప్పుకొచ్చారు. ఇన్నాళ్లు తెలంగాణలో ఏం చేశారు? ఇక్కడికి వచ్చి ఏం చేస్తారు? అంటూ షర్మిలను ప్రశ్నించారు. ప్రత్యేక హోదాకు ఇవాల్టికి కూడా వైసీపీ కట్టుబడి ఉందన్న సజ్జల.. ఆనాడూ కాంగ్రెస్ ప్రత్యేక హోదాను చట్టంలో పెట్టి ఉంటే ఇవాళ పోరాటాలు చేయాల్సిన పరిస్థితి ఉండేది కాదన్నారు. కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా.. ఏపీకి మేలు చేయాలనే భావనతోనే సీఎం జగన్ నడుచుకుంటున్నారని చెప్పారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..