Ayodhya: బాలరాముని ప్రాణప్రతిష్ఠలో ముఖ్య ఘట్టానికి రెడీ.. విగ్రహానికి 114 కలశాల నీటితో ఉత్సవ స్నానం..

|

Jan 21, 2024 | 4:19 PM

బాల రామయ్య విగ్రహానికి 114 కలశాల నీటిని ఉపయోగించి ఉత్సవ స్నానం చేయించనున్నారు. విగ్రహ ప్రతిష్ఠాపనకు ముందు జరిగే అతిముఖ్యమైన కార్యక్రమం ఇదే.  ఈ కార్యక్రమం కోసం ఇప్పటికే సర్వం సిద్ధం చేశారు. అనంతరం మహాపూజ, ప్రసాదంలో పరిక్రమ, శయ్యాధివాస్, తత్లాన్యాలు, మహన్యాలు ఆదిన్యాలు,    అఘోర్ హోమం, వ్యాహతి హోమం, సాయంత్రం పూజ, ఆరతి ఉంటాయని అంతేకాదు రాత్రి జాగరణ ఉంటుందని ట్రస్ట్ సభ్యులు చెప్పారు. 

Ayodhya: బాలరాముని ప్రాణప్రతిష్ఠలో ముఖ్య ఘట్టానికి రెడీ.. విగ్రహానికి 114 కలశాల నీటితో ఉత్సవ స్నానం..
Follow us on

పవిత్ర అయోధ్యలో పండుగ వాతావరణం కన్పిస్తోంది. నగరం రామనామస్మరణతో మార్మోగుతోంది. రామమందిరం గ్రాండ్ ఓపెనింగ్‌కు ముందు ఆలయాన్ని సుందరంగా అలంకరించారు. రేపు మధ్యాహ్నం 12.29కి అభిజిత్‌ లగ్నంలో ప్రధాని మోడీ చేతుల మీదుగా బాల రాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. ఈ వేడుకకు దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు, భక్తులు అయోధ్యకు తరలి వస్తున్నారు. రామాలయ ప్రాణప్రతిష్ట సందర్భంగా నాగ సాధువులు సందడి చేశారు. భారీ ర్యాలీగా అయోధ్యకు నాగసాధువులు తరలివచ్చారు. స్థానికులు వాళ్లకు ఘనస్వాగతం పలికారు. నాగసాధువుల కర్రసాము, కత్తిసాము అందరిని ఆకట్టుకుంది.

బాల రామయ్య విగ్రహానికి 114 కలశాల నీటిని ఉపయోగించి ఉత్సవ స్నానం చేయించనున్నారు. విగ్రహ ప్రతిష్ఠాపనకు ముందు జరిగే అతిముఖ్యమైన కార్యక్రమం ఇదే.  ఈ కార్యక్రమం కోసం ఇప్పటికే సర్వం సిద్ధం చేశారు. అనంతరం మహాపూజ, ప్రసాదంలో పరిక్రమ, శయ్యాధివాస్, తత్లాన్యాలు, మహన్యాలు ఆదిన్యాలు,    అఘోర్ హోమం, వ్యాహతి హోమం, సాయంత్రం పూజ, ఆరతి ఉంటాయని అంతేకాదు రాత్రి జాగరణ ఉంటుందని ట్రస్ట్ సభ్యులు చెప్పారు.

మరోవైపు 2వేల క్విటాళ్ల పూలతో అయోధ్య నగరాన్ని అలంకరించారు. అంతేగాక అయోధ్య నగరమంతా రాముడి భారీ కటౌట్లు ఏర్పాటు చేశారు. ఆలయాన్ని మొత్తం దీపాలతో నింపారు. ఇవి సందర్శకులను ఎంతో ఆకట్టుకుంటున్నాయి. ఆలయ ట్రస్టు ఆహ్వానించిన 55 దేశాల విదేశీ ప్రతినిధులు ఇవాళ సాయంత్రానికి అయోధ్యకు చేరుకుంటారు. అలాగే భారత్‌లోని సుమారు 7వేల మందికిపైగా ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి.

ఇవి కూడా చదవండి

బాల రాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు తెలిపింది. జనవరి 23 నుంచి రామ మందిరంలోకి సాధారణ ప్రజలను అనుమతించనున్నారు. ఆలయ పరిసరాల్లో 25వేల మందికి పైగా యూపీ పోలీసులను మోహరించారు. ప్రాణప్రతిష్ఠ జరిగిన మరుసటిరోజు నుంచి భక్తులను రెండు స్లాట్లుగా విభజించి, దర్శనానికి అనుమతిస్తారు. ఉదయం 7 గంటల నుంచి 11.30 వరకు, మధ్యాహ్నం 2 నుంచి 7 గంటల వరకు సందర్శకులకు అనుమతిస్తారు. రామాలయంలోకి వెళ్లడానికి ట్రస్ట్ జారీచేసిన పాస్ తప్పనిసరి కాగా, గుర్తింపు కార్డులను చూపించాలని ట్రస్టు సభ్యులు తెలిపారు. విగ్రహ ప్రాణ ప్రతిష్ట వేడుకను ప్రసారం చేయడానికి సరయూ నది ఘాట్‌లో భారతదేశంలోనే అతిపెద్ద ఎల్ఈడీ స్క్రీన్ ఏర్పాటు చేశారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..