అయోధ్య రామయ్య ఆలయ ప్రాణ ప్రతిష్టకు సమయం ఆసన్నమవుతున్న వేళ.. రామయ్య సేవలో మేము సైతం అంటున్నారు భక్తులు.. కొండంత దేవుడికి గోరంత పూజ అంటూ రకరకాల సేవలను చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రామయ్యకు తాను కలియుగ భరతుడిని అంటూ హైదరాబాద్ నివాసి తెలుగు వారైన ఓ భక్తుడు రామయ్యపై ఉన్న భక్తిని తెలియజేస్తున్నారు. రాములోరికి పాదుకా సేవ చేసుకుంటున్నారు చల్లా శ్రీనివాస శాస్త్రి. శ్రీరాముడి పాదుకల సాక్షిగా రాజ్యాన్ని పాలించిన భరతుని స్ఫూర్తితో బంగారు పూత పూసిన 9 కిలోల వెండి పాదుకలు సమర్పించబోతున్నారాయన. చరణ పాదుకల తయారీలో బంగారం, వెండితో పాటు విలువైన రత్నాలు కూడా ఉపయోగించబడ్డాయి.
ఉత్తరప్రదేశ్ అయోధ్యలో జనవరి 22న ప్రారంభం కానున్న నూతన రామ మందిరంలో శ్రీరామచంద్ర స్వామికి బంగారు పూత పూసిన 9 కిలోల వెండి పాదుకలు సమర్పించబోతున్నారు. ఈ చరణ్ పాదుకలను ప్రస్తుతం SG హైవేలోని తిరుపతి బాలాజీ ఆలయంలో దర్శనం కోసం ఉంచారు. వీటిని ఆదివారం రామేశ్వరం నుంచి అహ్మదాబాద్‌కు తీసుకొచ్చారు.
అయోధ్య భాగ్యనగర సీతారామ సేవా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు చల్లా శ్రీనివాస శాస్త్రి. 41 రోజులపాటు అయోధ్యలోని ఆలయం చుట్టూ ప్రదక్షిణలు నిర్వహించి, దేశవ్యాప్తంగా పాదుకలను దర్శించుకునే వీలు కల్పించాలని సంకల్పించారాయన. భద్రాచలం, నాసిక్, త్రయంబకేశ్వర్, చిత్రకూట్, ప్రయాగరాజ్ తదితర ప్రాంతాల మీదుగా 2 వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి, సంక్రాంతి తర్వాత జనవరి 19న అయోధ్య ఆలయ కమిటీకి పాదుకలను అందిస్తారు. జనవరి 22న వీటికి ప్రాణప్రతిష్ఠ చేయనున్నారు. ఇప్పటికే అయోధ్యలో రామమందిర నిర్మాణానికి శంకుస్థాపన సమయంలో శ్రీనివాసశాస్త్రి 5 వెండి ఇటుకలు అందజేశారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..