Ayodhya Ram Mandir: రామయ్య సేవలో నేను సైతం అంటున్న హైదరాబాద్ వాసి.. మందిర తలుపుల నిర్మాణంలో బిజిబిజీ

| Edited By: Surya Kala

Dec 30, 2023 | 1:54 PM

రామమందిరం తలుపుల తయారీకి బల్లార్షా టేకును ఉపయోగిస్తున్నామని అనురాధ టింబర్ డిపో యజమాని చదలవాడ శరత్ బాబు వెల్లడించారు. 100 కలప ముక్కల్లో సగటున అధిక నాణ్యత కలిగిన 20 కలప ముక్కలను మాత్రమే ఎంచుకొని తలుపుల తయారీ ప్రక్రియను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అయోధ్యలోని రామమందిరం కోసం, ఆలయ ప్రాంగణానికి అవసరమైన 118 కుపైగా తలుపులను తాము తయారు చేస్తున్నామన్నారు

Ayodhya Ram Mandir: రామయ్య సేవలో నేను సైతం అంటున్న హైదరాబాద్ వాసి.. మందిర తలుపుల నిర్మాణంలో బిజిబిజీ
Ayodhya Ram Mandir Doors
Follow us on

అయోధ్య రామమందిరం ప్రారంభానికి ముహూర్తం దగ్గర పడింది. జననవరి 22న ప్రధాని నరేంద్ర మోదీ ఆలయాన్ని ప్రారంభించనున్నారు. ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా.. హైదరాబాద్‌కు చెందిన ఓ టింబర్‌ డిపో ఆలయ నిర్మాణంలో పాలుపంచుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. చారిత్రాత్మక రామమందిరం ఆలయానికి అవసరమైన తలుపులు, ద్వార బంధనాలను బోయినపల్లిలోని అనూరాధ టింబర్ డిపో తయారు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది..

అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఎంత పెద్ద ప్రకృతి విపత్తు వచ్చినా 2,500 ఏళ్లు తట్టుకుని నిలబడేలా దేవాలయాన్ని నిర్మిస్తున్నారు. భారతీయ సంస్కృతి ప్రతిబింబించేలా నాగర శైలిలో, అష్టభుజి ఆకారంలో గర్భగుడిని తీర్చిదిద్దారు. అయోధ్య రామాలయాన్ని జనవరి 22న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. కాగా, అయోధ్య రామమందిరం నిర్మాణం కోసం దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి అత్యుత్తమ నాణ్యత కలిగిన మెటీరియల్‌, ఫర్నీచర్‌, సామగ్రిని సేకరించారు. అయితే రామమందిరం తలుపులు నగరంలోని బోయినపల్లిలోని అనూరాధ టింబర్ డిపో ఈ తలుపులను తయారు చేసింది..

రామమందిరం తలుపుల తయారీకి బల్లార్షా టేకును ఉపయోగిస్తున్నామని అనురాధ టింబర్ డిపో యజమాని చదలవాడ శరత్ బాబు వెల్లడించారు. 100 కలప ముక్కల్లో సగటున అధిక నాణ్యత కలిగిన 20 కలప ముక్కలను మాత్రమే ఎంచుకొని తలుపుల తయారీ ప్రక్రియను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అయోధ్యలోని రామమందిరం కోసం, ఆలయ ప్రాంగణానికి అవసరమైన 118 కుపైగా తలుపులను తాము తయారు చేస్తున్నామన్నారు. శిల్పాకళా నైపుణ్యం కలిగిన అనేక మంది కళాకారులు ఈ తలుపుల తయారీలో పాల్గొంటున్నారని వివరించారు. రామమందిరం ప్రారంభోత్సవానికి సమయం దగ్గర పడటంతో పనిలో వేగం పెంచామని చెప్పారు. రామలయ తలుపులు తయారు చేసే భాగ్యం తమకు దక్కడం గొప్ప అదృష్టమని తెలిపారు.

ఇవి కూడా చదవండి

గత ఏడాది జూన్ నుంచే తలుపుల తయారీ పనులు ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి ఇక్కడే ఉండి తమిళనాడుకు చెందిన కుమారస్వామితో పాటు దాదాపు అరవై మంది కళాకారులు ఈ తలుపులను తయారు చేస్తున్నారు. రామాయణంలోని కొన్ని ప్రధాన ఘట్టాలను తలపులపై చిత్రీకరిస్తోన్నామన్నారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..